పైసల్లేవు.. కేంద్రం నిధులివ్వట్లేదు, కానీ వాటికి కోతపెట్టబోం.. హరీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో 33/11 కెవి సబ్ స్టేషన్‌ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచం, దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదన్నారు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమానికి ఢోకా లేదన్నారు. తమది సంక్షేమ ప్రభుత్వమన్న హరీశ్.. ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కోత విధించినప్పటికీ.. సంక్షేమానికి కోత విధించబోమన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రగల్భాలు పలుకుతున్నాయన్న హరీశ్ రావు.. టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరును పక్క రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయన్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలోని ప్రాంతాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారన్నారు.

Read More

టెన్నిస్‌ ఆడితే పెండ్లి కాదన్నారు : సానియా

టెన్నిస్‌ ఆడడం ఆపాలని, లేకపోతే ఆరుబయట ఆడటం వల్ల చర్మం నల్లబడి ఎవరూ పెండ్లి చేసుకోరని చిన్నప్పుడు తనకు కొందరు సలహాలు ఇచ్చారని భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా వెల్లడించింది. అమ్మాయి అంటే తెల్లగా ఉండాలన్న భావన సమాజంలోని చాలామందిలో పాతుకుపోయిందని, ఇలాంటి సంస్కృతి మారాలని చెప్పింది. చిన్నప్పటి నుంచే ఆటలు ఆడేలా బాలికలను ప్రోత్సహించాలని సూచించింది. గురువారమిక్కడ జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సులో భాగంగా జరిగిన మహిళలు – నాయకత్వం అనే అంశం చర్చలో సానియా మీర్జా మాట్లాడింది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ వైఫల్యానికి తాను విమర్శలను ఎదుర్కొన్న అంశంపై ప్రశ్నించగా..‘నేను పాక్‌ జట్టులో లేను అలాంటప్పుడు గెలిపించేందుకు నాకెలాంటి శక్తులు కల్గి ఉండాలో అర్థం కావడం లేదు. విరాట్‌ కోహ్లీ డకౌట్‌ అయితే అతని భార్య అనుష్క శర్మను నిందించారు. అలా వ్యక్తిగత విమర్శలు…

Read More

పండుగ ఎఫెక్ట్‌..! ఆర్టీసీ బాదుడు..!!

దసరా పర్వదినాన్ని ఎన్‌‘క్యాష్‌’ చేసుకునేం దుకు ఆర్టీసీ అమలుచేస్తున్న 50శాతం అ‘ధ నం’ ప్రయాణికుల నడ్డి విరుస్తోంది! అదనపు చార్జీ సంస్థకు కాసులు కురిపిస్తుంటే.. ప్రయా ణికులు మాత్రం నిలువు దోపిడీకి గురవుతు న్నారు. విజయవాడ నుంచి దూరప్రాంతాలైన హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి, రాజ మహేంద్రవరంలకు ప్రత్యేక బస్సులలో వెళ్ళా లంటే మోత మోగుతోంది. దసరా ఉత్సవాల సందర్భంగా ఇప్పటికే దూరప్రాంతాల నుంచి రాకపోకల కోసం షెడ్యూల్‌ బస్సుల్లో సీట్లకు ముందస్తుగా రిజర్వేషన్‌ జరిగి పోయింది. దీంతో ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ అధికారులు దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని 600కు పై గా ప్రత్యేక బస్సులను తిప్పటానికి ప్లానింగ్‌ చేశారు. సెప్టెంబరు 28నుంచి స్పెషల్‌ బస్సు లకు సైతం అడ్వాన్స్‌ బుకింగ్‌ కల్పించారు. షెడ్యూల్‌ బస్సులలో సీట్లన్నీ హాటుకేకు మాదిరిగా బుక్‌ అయిపోవటంతో ప్రయాణికు లకు ప్రత్యేక…

Read More

ఆర్థికప్రగతికి నగరాలే దన్ను

జాతిపిత మహాత్మాగాంధీ చెప్పినట్లు ఇప్పటికీ దేశం పల్లెల్లోనే నివసిస్తున్నదని, అయితే దేశాన్ని, రాష్ట్రాలను ఆర్థికంగా నడిపిస్తున్నవి కచ్చితంగా నగరాలు, పట్టణాలేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పా రు. గురువారం ఢిల్లీలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఈఎఫ్) నిర్వహించిన ఇండియా ఎకనామిక్ సమ్మిట్‌లో భాగంగా యూనియన్ ఆఫ్ స్టేట్స్ సెషన్‌లో మాట్లాడిన కేటీఆర్.. ఆర్థికప్రగతి సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సంబంధాలపై అభిప్రాయాలను వెలిబుచ్చారు. అనేక పాలసీలను నిర్ణయించే అధికారం కేంద్రానికే ఉన్నప్పటికీ అసలైన కార్యాచరణ క్షేత్రస్థాయిలో రాష్ట్రాల్లోనే ఉన్నదని స్పష్టంచేశారు. ఉమ్మడి జాబితాలో అనేక అంశాలను రాష్ట్రాలకు అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అభివృద్ధి పట్ల విజనరీ కలిగిన నాయకత్వం ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా ఎదుగుతాయనేందుకు తెలంగాణనే ఒక ఉదాహరణ అని చెప్పారు. తెలంగాణ గత ఐదున్నరేండ్లుగా అద్భుత పారిశ్రామిక…

Read More

ఘనంగా బతుకమ్మ వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా గురువారం బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణభవన్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, మహిళానేతలు మూల విజయారెడ్డి, ముక్తవరం సుశీలారెడ్డి, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. డీజీపీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో ఉమెన్‌సేఫ్టీవింగ్ ఇంచార్జి, ఐజీ స్వాతిలక్రా, పలువురు మహిళా ఐపీఎస్ అధికారులు, సీనియర్ అధికారుల సతీమణులు, ఇతర మహిళా సిబ్బంది బతుకమ్మ ఆడారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో లుంబినీపార్కులో నిర్వహించిన వేడుకల్లో మంత్రులు సత్యవతిరాథోడ్, శ్రీనివాస్‌గౌడ్, జేఏసీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి,…

Read More