నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్

ఆర్థికమాంద్యం నేపథ్యంలో రాష్ట్రానికి ఇచ్చే నిధులను పెంచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రితో సమావేశం కావడంకోసం గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రధానమంత్రితో సీఎం భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను పెంచడంతోపాటు రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని ప్రధానిని సీఎం కోరనున్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయప్రాజెక్టు హోదా కల్పించాలని ఇదివరకే అనేకసార్లు ప్రధానిని సీఎం కోరిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల పూడిక తీసే మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని నీతిఆయోగ్ ప్రశంసించింది. దీనివల్ల తెలంగాణలో భూగర్భజలాలు పెద్దఎత్తున పెరుగుతున్నాయి. ఈ పథకానికి ఆర్థిక సహాయం అందించాలని గతంలోనే ప్రధానికి సీఎం…

Read More

తెలుగు రాష్ట్రాల్లో ‘సైరా’ తొలిరోజు వసూళ్లు

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చరణ్ నిర్మించిన ‘సైరా నరసింహా రెడ్డి’ నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిరంజీవి 151వ చిత్రంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజున 38.76 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇవి రికార్డుస్థాయి వసూళ్లేనని అంటున్నారు. చిరంజీవి కెరియర్లో ఇది తొలి చారిత్రక చిత్రం కావడం .. ఈ భారీ సినిమాకి చరణ్ నిర్మాతగా వ్యవహరించడం .. దర్శకుడిగా తనకి వచ్చిన అవకాశాన్ని సురేందర్ రెడ్డి ఛాలెంజింగ్ గా తీసుకోవడం .. భారీ తారాగణం ఈ కథలో భాగస్వాములు కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఇన్ని రకాల ప్రత్యేకతల కారణంగానే ఈ సినిమా ఈ స్థాయి…

Read More

ఐదేళ్లలో ఐదు లక్షల కోట్లు దోచుకున్నారు.. వాటి గురించి మాట్లాడితే బాగుంటుంది: విజయసాయిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల రూ. 7,500 కోట్ల నష్టం వస్తుందని చంద్రబాబు కాకి లెక్కలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. మీరు పాలించిన ఐదేళ్లలో దోచుకున్నది ఐదు లక్షల కోట్లు అని అన్నారు. కరువు వల్ల రాష్ట్ర వ్యవసాయరంగం లక్ష కోట్ల ఉత్పత్తిని కోల్పోయిందని చెప్పారు. ముందు వీటి గురించి మాట్లాడితే బాగుంటుందని హితవుపలికారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Read More

తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ సంఘాల చర్చలు విఫలం.. సమ్మె యథాతథం

తెలంగాణ ఆర్టీసీ సంఘాలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ మధ్య జరిగిన తొలి దశ చర్చలు విఫలమయ్యాయి. కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందు 26 డిమాండ్లు ఉంచగా, వాటి పరిష్కారంపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెను యథాతథంగా కొనసాగించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఎప్పుడు ఇస్తుందన్న దానిపై ఓ కాలపరిమితి అంటూ లేకపోవడం కూడా చర్చలు విఫలం కావడానికి మరో కారణంగా తెలుస్తోంది. అయితే, నేడు మరోసారి జరిగే చర్చలకు హాజరవుతామని, కాకపోతే ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లలో కొన్నింటికైనా ప్రభుత్వం నుంచి హామీ రావడంతోపాటు నివేదిక కచ్చితంగా ఎప్పుడు ఇస్తారో చెప్పాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. హామీ ఇస్తేనే సమ్మెను విరమిస్తామని సంఘాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వం నుంచి హామీ రాకుంటే…

Read More

నేడు బీజేపీలోకి టీడీపీ సీనియర్‌ నేత దేవేందర్‌ గౌడ్‌ తనయుడు

ఓవైపు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో సత్తాచాటి పార్టీలో పునరుత్తేజానికి కృషి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తుంటే ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరూ జారిపోయి షాకిస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌ తనయుడు వీరేందర్‌గౌడ్‌ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఢిల్లీలో ఈ రోజు బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డా సమక్షలో ఆయన కమదళంలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వీరేందర్‌గౌడ్‌ కాషాయం కండువా కప్పుకునేందుకు ఎప్పుడో సిద్ధమయ్యారు. అందుకే పదవికి రాజీనామా చేస్తూ పార్టీపై విమర్శలు కూడా గుప్పించిన విషయం విదితమే. రాజకీయ అవసరాల కోసం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు.

Read More