రోడ్డుపై వరినాట్లు పెడుతూ వినూత్న రీతిలో డీకే అరుణ నిరసన

మాజీ మంత్రి,బీజేపీ నేత డీకే అరుణ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పాడైన రోడ్లు,ఏళ్లు గడుస్తున్నా పూర్తి కానీ ఆర్వోబీ నిర్మాణంపై డీకే అరుణ నిరసన తెలియజేశారు. రోడ్డుపై వరినాట్లు పెడుతూ వినూత్న రీతిలో ప్రభుత్వానికి నిరసన తెలిపారు.జిల్లా కేంద్రంలోని స్థానిక రైల్వే గేట్-2 వద్ద గురువారం ఆమె నిరసన కార్యక్రమం చేపట్టారు. పాడైన రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారని అన్నారు. ఐదేళ్లుగా ఆర్వోబీ నిర్మాణం జరుగుతూనే ఉందని.. ఇప్పటికైనా దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. డీకే అరుణ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ఇటీవల డీకే అరుణ ఆరోపించారు.మూడేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్..ఆరేళ్లయినా పూర్తి చేయలేదన్నారు. ఇప్పుడు కూడా 8…

Read More

చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్యే షాక్…

Chandrababu-Naidu-

ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటే… మరోవైపు ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా పార్టీలో కొనసాగే విషయంలో డోలాయమానంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఇప్పటికే అనేకమంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వంతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తుండగా… తాజాగా టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఏకంగా చంద్రబాబు సమావేశానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు కాకినాడలో జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయగా… ఈ సమావేశానికి రామచంద్రాపురం టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు దూరంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి రావాలని స్వయంగా చంద్రబాబు రాయబారం పంపినా… ఇందుకు త్రిమూర్తులు మాత్రం సానుకూలంగా స్పందించలేదు. జిల్లాకు చెందిన ముఖ్యనేతలు తమకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన తనను కలిసేందుకు వచ్చిన టీడీపీ…

Read More

వివేకానందరెడ్డి హత్య కేసుపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేకంగా దృష్టి

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ కేసు విచారణపై ఆరా తీసేందుకు నిన్న కడవ వచ్చిన సవాంగ్… ఈ రోజు కూడా అక్కడే ఉండి కేసు విచారణ తీరుపై స్థానిక పోలీసులను సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు సిట్ 1300 మందిని విచారించింది. అయితే కేసులో అనుమానితుడిగా విచారణ ఎదుర్కొన్న శ్రీనివాసులురెడ్డి ఆత్మహత్య చేసుకోవడం కేసును కొత్త మలుపు తిప్పింది. అయితే శ్రీనివాసులురెడ్డి ఆత్మహత్య కేసును అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు… దీనిపై విచారణ జరుపుతున్నారు. ఇదే అంశంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్థానిక పోలీసులపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అనుమానితుడిగా ఉన్న శ్రీనివాసులురెడ్డి కదలికలపై ఎందుకు నిఘా పెట్టలేదని ఆయన పోలీసులను అడిగినట్టు…

Read More

కాబుల్‌లో కారు బాంబు పేలుడు..

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరం మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. గురువారం శష్ దరక్ ప్రాంతంలోని అమెరికా ఎంబసీ,నాటో కార్యాలయాలకు సమీపంలో కారు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 10 మంది మృతి చెందారు. ఇందులో సాధారణ పౌరులతో పాటు పోలీసులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.పేలుళ్లు తమ చర్యనే అని తాలిబన్లు ప్రకటించారు.తాలిబన్లతో శాంతి చర్చల తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లోని తమ సైనికులను అమెరికా ఉపసంహరించుకున్న కొన్ని గంటలకే ఈ పేలుళ్లు జరగడం గమనార్హం. గడిచిన నాలుగైదు రోజుల్లో కాబూల్‌లో పేలుళ్ల ఘటన జరగడం ఇది రెండోసారి. దీంతో పేలుడు సంభవించిన ప్రాంతంలో పోలీసులు రాకపోకలను తాత్కాలికంగా నిషేధించారు.కాగా, సోమవారం రాత్రి తూర్పు కాబుల్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 16 మంది చనిపోగా.. 100కు పైగా తీవ్రంగా గాయపడ్డారు.

Read More

తెలంగాణలో యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమ౦…ఎంపీ ధర్మపురి అరవింద్

తెలంగాణలో యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. తన కుమార్తె కవితను ఓడించినందుకే ఇక్కడ రైతులపై ఈ రకంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేంద్రం యూరియాను నిల్వ చేసుకోవాలని ఎప్పటి నుంచో చెబుతున్నా… ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. తమకు యూరియా నిల్వ చేసుకోవడానికి గోదాములు లేవని చెప్పి… రాష్ట్ర ప్రభుత్వం యూరియాను తెప్పించుకోలేదని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లాకు రావాల్సిన యూరియాను టీఆర్ఎస్ ముఖ్యనేతలు కామారెడ్డికి తరలించుకుపోయారని ఆయన ఆరోపించారు. దీనిపై జిల్లా మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఎంత కావాలంటే అంత యూరియా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఎంపీ దర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. రైతులు రోడెక్కకుండా ఉండాలంటే వెంటనే యూరియా సమస్యను…

Read More