‘సైరా’ టీజర్ కి భారీ రెస్పాన్స్

చిరంజీవి కథానాయకుడిగా రూపొందిన ‘సైరా’ చిత్రం కోసం మెగా అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల వదిలిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. వచ్చేవారం ఫస్టు లిరికల్ వీడియో సాంగ్ ను వదలడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తేదీ ఎప్పుడనేది రేపో .. ఎల్లుండో ప్రకటించనున్నారు. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో, తమన్నా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. అమితాబ్ .. సుదీప్ .. విజయ్ సేతుపతి పాత్రలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెప్పుకుంటున్నారు.

Read More

పార్టీ వర్కర్ చెంప చెల్లుమనిపించిన మాజీ సీఎం

కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. పబ్లిక్ ప్లేసులో పార్టీ కార్యకర్త చెంప చెల్లుమనిపించారు. ఈ ఘటన మైసూర్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. మైసూర్ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న సిద్ధరామయ్యకు ఆయన వెంట ఉన్న పార్టీ వర్కర్ ఒకాయన ఫోన్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. దీంతో అసహనం కోల్పోయిన సిద్ధారామయ్య అతని చెంపపై ఒక్కటి తగిలించారు. దీన్ని అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే సిద్ధరామయ్య ఇలా అసహనం కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన ఇలాంటి పనులు చేస్తూ వార్తాల్లోకి ఎక్కారు. ఈ ఏడాది జనవరిలో మైసూర్‌లో బహిరంగ సభలో మాట్లాడుతూ… పార్టీ నేతను ఒక్కతోపు తోశారు. 2016లో కూడా సిద్ధారమాయ్య బళ్లారిలోని వాల్మీకి భవన్‌లో ఒక బ్యూరోక్రాట్‌ను చెంపదెబ్బ కొట్టడం దుమారం…

Read More

తూర్పు గోదావరి జిల్లా జ్యువెలరీ షాపులో భారీ దొంగతనం..

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడులో భారీ దొంగతనం జరిగింది. పక్కా ప్లాన్‌తో వచ్చిన దొంగలు జువెలరీ షాపు షట్టర్‌ను గ్యాస్ కట్టర్లతో కోసేసి రూ.15 లక్షల విలువైన అరకిలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో పత్తిపాడులోని ధర్మవరం రోడ్డులో ఉన్న కనకమహాలక్ష్మి ఫ్యాషన్ జ్యువెలర్స్‌లోకి చొరబడి దొరికినంత దోచేశారు. దుకాణం షట్టర్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్‌ చేసి రేకును తొలగించారు. ఆ రంధ్రంలో నుంచి షాపు లోపలికి వెళ్లి ఆభరణాలు, వస్తువులను చోరీ చేశారు. కాగా, దొంగలు ఈ చోరీ పక్కా ప్లాన్‌తో చేసినట్లు తెలుస్తోంది. గ్యాస్ కట్టర్ తెచ్చి షట్టర్‌ను కట్ చేసి దొంగతనం చేశారంటే.. ముందుగానే దుకాణాన్ని ఎంచుకుని రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. దుకాణ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా…

Read More

ప్రయాణికుడిని చితక్కొట్టి.. నగలు, నగదుతో క్యాబ్ డ్రైవర్ పరార్..

శంషాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు వద్ద ఓ ప్రయాణికుడిని ఎక్కించుకున్న క్యాబ్ డ్రైవర్.. అతడ్ని చితకబాది యూకే కరెన్సీ, బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. దమ్మాయిగూడకు చెందిన ప్రయాణికుడు యూకేలో నివాసం ఉంటున్నాడు. 15 రోజుల్లో తన పెళ్లి ఉండగా హైదరాబాద్ వచ్చాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగి క్యాబ్ ఎక్కాడు. అయితే, ఆ క్యాబ్ డ్రైవర్ కొంత దూరం వెళ్లాక దారి మళ్ళించి గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి అతడ్ని దారుణంగా చితకబాదాడు. అతడి వద్ద రెండు లక్షల యూకే కరెన్సీ, బంగారాన్ని క్యాబ్ డ్రైవర్ ఎత్తుకెళ్లాడు. వెంటనే బాధితుడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను గుర్తు తెలియని ప్రదేశంలో ఉన్నానని, తానున్న ప్రదేశంలో కొండపై గుడి ఉన్నట్లు వెల్లడించాడు. హుటాహుటిన బాధితుడి కుటుంబీకులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న…

Read More

గణేష్ మండపంలో మంటలు… నాలుగు కార్లు, పది బైకులు దగ్ధ౦..

సికింద్రాబాద్ గణేష్ మండపంలో అగ్నిప్రమాదం సంభవించింది. మల్కాజ్‌గిరిలోని మైత్రి నివాస్ అనే అపార్ట్‌మెంట్‌లో స్థానికులు వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేశారు. అయితే రాత్రి దీపం వెలిగిస్తుండగా అనుకోకుండా మంటలు ఎగిసి మండపమంతా వ్యాపించాయి. గణేష్ మండపాన్ని అందంగా అలంకరించిన డెకరేషన్ వస్త్రాలకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అపార్ట్‌మెంట్ వాసులు అప్రమత్తతతో ప్రాణ నష్టం తప్పింది. మంటలు ఎగిసి పడటంతో… స్థానికులు మంటలు ఆపే ప్రయత్నం చేయగా ఫలితం లేకుండా పోయింది. వెంటనే ఫైరింజన్‌ను పిలిపించి మంటల్ని అదుపు చేశారు.ఈ ఘటనలో నాలుగు కార్లు, పది బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మండపం మొత్తం కాలిపోయింది.

Read More