భగ్గుమంటున్నాబంగారం ధరలు

దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్‌లో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.38,310 పలికింది. అలాగే 22 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.36,030గా పలికింది. ఇక ప్రభుత్వ సంస్థ ఎంఎంటీసీ జారీ చేసే 999 ప్యూరిటీ బంగారం 10 గ్రాముల ధర రూ.41,709 గా నమోదైంది. అలాగే కేజీ వెండి ధర రూ.52370గా పలికడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు ధర 1500 డాలర్లకు పైగా ట్రేడవుతోంది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో నెలకొన్న స్తబ్దత కారణంగా మదుపరులు బంగారం పెట్టుబడులపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా స్పాట్ గోల్డ్ ధర 0.4 శాతం పెరిగి (ఒక ఔన్సు) 1502 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక అటు యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ సైతం 0.4 శాతం ఎగిసి ఒక…

Read More

ఒక్క ఆటోలో 24 మంది ప్రయాణికులు…

తెలంగాణ… కరీంనగర్ పోలీసులు ఓ ఆటోను చూసి షాకయ్యారు. మహేష్ బాబు నటించిన అతడు సినిమాలో… ఒకే వాహనంలో 20 మందిని ఎక్కిస్తే… ఈ ఆటోలో ఏకంగా 24 మంది ప్రయాణికులున్నారు. మొదట ఏ 10 మందినో ఎక్కించినట్లు కనిపించినా… ఒక్కొక్కరూ దిగుతుంటే… పోలీసులకే ఆశ్చర్యమేసింది. మొత్త ఎంతమంది అని లెక్కించి… షాకయ్యారు. అసలు అంత మంది ఒక్క ఆటోలో ఎలా పట్టారన్నదే వాళ్లకు అర్థం కాలేదు. వాళ్లందర్నీ ఆటో పక్కన నిలబెట్టి… ఫొటోలు తీశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని… కరీంనగర్ కమిషనర్… ఈ ఆటోకి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆటో డ్రైవర్లు ఆదాయం కోసం ఇష్టమొచ్చినట్లు ప్రయాణికుల్ని ఎక్కించేసుకోవడం సహజంగా జరుగుంతోందన్న పోలీసులు… ప్రయాణికులు తమ సేఫ్టీని ఆలోచించుకోవాలని హెచ్చరించారు.ఈ వీడియో వైరల్ అయ్యింది. దాదాపు 17 వేల మంది దీన్ని…

Read More

నేడు శ్రీఅత్తి వరదరాజస్వామి వారిని దర్శనానికి వెళ్లనున్న కేసీఆర్…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఇవాళ తమిళనాడులోని… కంచిలో ఉన్న శ్రీఅత్తివరదరాజ స్వామి ఆలయానికి వెళ్లున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచీ ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న కేసీఆర్… రోడ్డు మార్గంలో తమిళనాడు కాంచీపురం బయలుదేరతారు. మధ్యాహ్నం 12:15 గంటలకు శ్రీఅత్తివరదరాజ స్వామి వారిని దర్శించుకుంటారు. తిరిగి అక్కడ నుంచీ బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని తిరుగు ప్రయాణం అవుతారు. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వాధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. ప్రస్తుతం అత్తివరదరాజస్వామి ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. 40 ఏళ్లకు ఒకసారి జరిగే అత్తి వరదరాజస్వామి దర్శనం ఆగస్టు 17తో ముగుస్తుంది. ఆగస్టు 18న స్వామిని తిగిరి పుష్కరిణిలో భద్రపరుస్తారు. మళ్లీ 2059లోనే అత్తి వరదరాజ పెరుమాళ్‌ దర్శన భాగ్యం కలుగుతుంది. అందువల్లే…

Read More

హన్మకొండలోబాలికపై గ్యాంగ్ రేప్‌, ఆత్మహత్య..

హన్మకొండలో ఇటీవల శ్రీహిత అనే చిన్నారిపై ప్రవీణ్ అనే కామాంధుడి హత్యాచారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఇటీవలే వరంగల్ కోర్టు దోషికి ఉరిశిక్ష కూడా విధించింది. అయితే న్యాయస్థానాలు ఉరిశిక్ష అమలుచేస్తున్నా సరే..కామాంధుల్లో మార్పు రావడం లేదు. తాజాగా అదే హన్మకొండలో మరో బాలిక గ్యాంగ్ రేప్‌కు గురైంది. అవమానాన్ని తట్టుకోలేక ఆపై ఆత్మహత్యకు పాల్పడింది.నిరుపేద కుటుంబానికి చెందిన ఆ బాలికకు తల్లిదండ్రులు కూడా లేరు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఆమె తరుపువారు ఆదివారం కాకతీయ యూనిర్సిటీ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. హన్మకొండలోని సమ్మయ్యనగర్‌లో 15ఏళ్ల ఓ బాలిక ఆమె నానమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటోంది.9వ తరగతి చదువుతున్న ఆ బాలికకు తల్లిదండ్రులు లేరు. ఇదే క్రమంలో శనివారం ఉదయం 11గంటలకు స్థానిక యువకులైన తిరుపతి,ప్రసన్న కుమార్‌లు…

Read More