ఉండవల్లి నుంచి మకాం మార్చే యోచనలో చంద్రబాబు..

Chandrababu-Naidu-

ఉండవల్లిలోని అక్రమ నిర్మాణం ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. ఆ తర్వాత చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని కూడా కూల్చివేస్తారన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నివాసం కూడా అక్రమ నిర్మాణమేనని వైసీపీ నేతలు చెబుతున్ననేపథ్యంలో అక్కడి నుంచి ఖాళీ చేసే యోచనలో బాబు ఉన్నట్టు తెలుస్తోంది. అనువైన నివాసం దొరికిన వెంటనే, అక్కడి నుంచి ఖాళీ చేయాలని మెజార్టీ టీడీపీ నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. కాగా, చంద్రబాబు కొత్త ఇంటి కోసం పరిశీలనలో పలు గెస్ట్ హౌస్ లు ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. క్వాలిటీ ఐస్ క్రీమ్ గెస్ట్ హౌస్, గామన్ ఇండియా అతిథి గృహం, మరో గెస్ట్ హౌస్ ను టీడీపీ నేతలు పరిశీలించినట్టు సమాచారం. రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెం ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు కొందరు చంద్రబాబు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇచ్చేందుకు…

Read More

రెండేళ్లలో చంద్రబాబును జైలుకు పంపడం ఖాయం

టీడీపీ అధినేత చంద్రబాబును రెండేళ్లలో జైలుకు పంపడం ఖాయమని బీజేపీ ఏపీ ఇన్చార్జి సునీల్ దేవదర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులను చంద్రబాబు పక్కదోవ పట్టించి, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం టీడీపీని స్థాపించి, 9 నెలలలోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. తన రాజకీయ వారసుడిగా లోకేశ్ ను చంద్రబాబు ప్రకటించడం దారుణమని అన్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టి… ఇచ్చిన వాగ్దానాన్ని ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకోవాలని కోరారు.

Read More

కేఏ పాల్‌ బయోపిక్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు

kapaul

తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచతమైన పేరు కేఏ పాల్‌. తన వెరైటీ వ్యాఖ్యలతో నిత్యం న్యూస్‌లో ఉండే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఈయన క్రైస్తవ మత బోధకుడు కూడా. ఇక ఏపీ ఎన్నికల సమయంలో ఆయన వైఖరి మరింత హాట్ టాపిక్‌గా అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ వరకు అన్ని రాజకీయపార్టీలపై ఆయన చలోక్తులు విసిరారు. ఏపీలో అధికారం తమ పార్టీదేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.పవన్ పార్టీ తనతో కలిసి స్వీస్ చేస్తుందంటూ నేల విడిచి వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు తమ ప్రజాశాంతి పార్టీకి వంద సీట్లు గ్యారంటీ అంటూ ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పారు. అప్పట్లో కేఏ పాల్ అన్న ప్రతి మాట చర్చనీయాంశం…ఇటు జనానికి కూడా ఆయన తన పనులతో బాగానే ఎంటర్ టైన్ చేశారు. అలాంటి కేఏ పాల్ మీద…

Read More

బీజేపీ ఎంపీ సోయం బాపురావుపై కేసు నమోదు..

bjp mp

ముస్లిం యువతపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సోయం బాపురావుపై ఆదిలాబాద్ వన్‌టౌన్‌ పోలీస్ స్టేసన్‌లో కేసు నమోదైంది. బాపురావు వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ మైనారిటీ నేతలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.కేసుపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.ఈ నెల 14వ తేదీన ఆదిలాబాద్‌లోని గాదిగూడలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ముస్లింలపై బాపురావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఆదివాసీ యువతుల జోలికొస్తే ముస్లిం యువకుల తల నరికేస్తానని హెచ్చరించారు. బాపురావు చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.బాధ్యతగల ఓ ప్రజాప్రతినిధిగా కుల మతాలకు అతీతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి.. ఇలాంటి కామెంట్స్ చేయడం సమంజసం కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Read More

ఏపీ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.

తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇప్పటికే ఈ విషయంలో ఆర్టీసీ కార్మిక సంఘాలకు హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకునే దిశగా ముందుకు సాగుతోంది. తాజాగా ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో జరిగిన ఈ భేటీకి మంత్రులు పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సహా పలువురు ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. మాజీ ఐపీఎస్ అధికారి ఆంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆర్టీసీ విలీన కమిటీకి జగన్ ఈ భేటీలో దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశం అనంతరం సచివాలయంలో అధ్యయన కమిటీ సభ్యులు విడివిడిగా భేటీ కానున్నారు. అలాగే ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టే విషయాన్ని కూడా…

Read More