భవనాల అప్పగింత నేడు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంలో భాగంగా సోమవారం కీలకమైన భవనాల అప్పగింత కార్యక్రమం చేపట్టనున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రభుత్వానికి హైదరాబాద్‌లో కేటాయించిన భవనాలను తిరిగి అప్పగించనున్నట్టు ఏపీ అధికారులు.. తెలంగాణ అధికారులకు స్పష్టంచేశారు. సచివాలయంలోని పలు బ్లాకులతోపాటు, ఏపీ డీజీపీ కార్యాలయ భవనం, లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లను తెలంగాణకు అప్పగించనున్నారు. సచివాలయంలోని అన్ని బ్లాకులు తెలంగాణ ఆధీనంలోకి రానుండటంతో ఈ నెల 27న నూతన సచివాలయానికి శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం విజయవాడ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ర్టాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలపై కూడా చర్చించనున్నారు. ఏపీ సీఎం జగన్ చొరవతో అప్పగింతలో వేగం తెలంగాణ ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉండాలని నిర్ణయించుకున్న ఏపీ…

Read More

ఆసక్తిని రేకెత్తిస్తోన్న ‘గుణ 369’ టీజర్

అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ‘గుణ 369’ రూపొందుతోంది. అనిల్ కడియాల – తిరుమల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తించేదిగా వుంది. ఈ సినిమా ద్వారా కొత్త హీరోయిన్ పరిచయమవుతోంది. ఈ టీజర్ చివరిలో కార్తికేయ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ హైలైట్ గా నిలుస్తోంది. మరింత హ్యాండ్సమ్ గా ఆయన ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘హిప్పీ’ ఫలితంతో డీలాపడిపోయిన కార్తికేయకి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి. Tags: GUNA369, Karthikeya

Read More