బోనాలకు 15 కోట్లు

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో కీలకమైన ఆషాఢ బోనాల ఉత్సవాలు హైదరాబాద్‌లో జూలై 4 నుంచి ప్రారంభంకానున్నట్టు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. 4న గోల్కొండ బోనాలు, 21న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 28న పాతబస్తీలో బోనాలు నిర్వహిస్తామని తెలిపారు. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందన్నారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే బోనాల పండుగ ఏర్పాట్లపై హోంమంత్రి మహమూద్‌అలీ, దేవాదాయశాఖ మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి ఆయాశాఖల అధికారులతో తలసాని సోమవారం సచివాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఈ ఏడాది బోనాల సంబురాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లుచేయాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రంజాన్, క్రిస్మస్, దసరా, బోనాల పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నదని గుర్తుచేశారు. ఆయా శాఖలకు దిశానిర్దేశం జీహెచ్‌ఎంసీ…

Read More

చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి ప్రాంతంలో బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి నిర్మాణ పనులను త్వరలో చేపడుతామని ఆస్పత్రి చైర్మన్‌, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ 59వ జన్మదిన వేడుకలను సోమవారం బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రి ఆవరణలో నిర్వహించారు. ముందుగా దివంగత నందమూరి బసవతారకం, రామారావు విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో కేన్సర్‌తో బాధపడుతున్న చిన్నారుల మధ్య కేక్‌ను కట్‌ చేసి వారికి తినిపించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఆస్పత్రి స్థాపన సమయంలో దివంగత ఎన్టీఆర్‌ ఆశించిన లక్ష్యాలకు అనుగుణంగా దేశంలోనే అత్యున్నత శ్రేణి కేన్సర్‌ ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఆస్పత్రి స్థాపనలోనూ, నిర్వహణలోనూ సహాయం అందిస్తున్న పలువురు దాతలకు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన కృషికి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ…

Read More

బిగ్ షాక్.. ప్రపంచకప్ ‌నుంచి ధావన్ ఔట్

వన్డే ప్రపంచకప్‌లో రెండు వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న టీమిండియాకు షాక్. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో ప్రపంచకప్‌ నుంచి వైదొలిగాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అద్భుత శతకం సాధించిన ధావన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ బౌలర్ కౌల్టర్‌ నీల్‌ వేసిన ఓవర్లో ధావన్ ఎడమచేతి బొటన వేలికి బంతి బలంగా తాకడంతో గాయమైంది. నొప్పిను భరిస్తూనే సెంచరీ సాధించిన ధావన్ జట్టు భారీస్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. వేలి నొప్పితో ధావన్ ఫీల్డింగ్‌కు రాకుండా పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. అతడి స్థానంలో రవీంద్ర జడేజా ఫీల్డింగ్ చేశాడు. ధావన్ వేలికి స్కానింగ్ తీసిన డాక్టర్లు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ధావన్ ప్రపంచకప్…

Read More