మమతా బెనర్జీ తల తెస్తే రూ. 1 కోటి… షాకింగ్ లెటర్!

Mamata-Banerjee

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఓ షాకింగ్ లెటర్ వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చంపేసి ఆమె తల తెచ్చినా, లేక ఆమెను సజీవంగా పట్టుకుని తెచ్చి అప్పగించినా, కోటి రూపాయల బహుమతి ఇస్తామని రాజీవ్ కిల్లా అనే వ్యక్తి పేరిట ఆరాంబాగ్ ఎంపీ అపురూప పొద్దార్‌ కు లేఖ అందింది. దీనిలో అతని చిరునామా, మూడు ఫోన్ నంబర్లు కూడా ఉండటం గమనార్హం. దీంతో ఆందోళనకు గురైన పొద్దార్, శీరాంపూర్ పోలీసులను ఆశ్రయించి, లేఖను ఇచ్చి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు, వెంటనే రాజీవ్ కిల్లాను అదుపులోకి తీసుకోగా, తన పేరును తప్పుగా వాడుకున్నారని, లేఖతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని అతను వెల్లడించినట్టు తెలుస్తోంది. కాగా, 2014 సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైన…

Read More

బెదిరింపులకు.. కేసులకు భయపడను: రేవంత్

పాలకుల బెదిరింపులకు బెదిరేది లేదు… అక్రమంగా పెట్టే కేసులకు భయపడేది లేదు… ప్రలోభాలకు లొంగేది లేదు.. ప్రజలిచ్చిన నమ్మకాన్ని ఏ పరిస్థితిలోనూ వమ్ముచేయను.. ప్రజల తరఫున వారి సమస్యలపైన రాజీలేని పోరాటం చేస్తానని మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లో ఏర్పాటుచేసిన ప్రజా కృతజ్ఞత సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే అతి పెద్ద పార్లమెంట్‌ నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి ప్రజలు ప్రశ్నించే గొంతు ఉండాలని, ఏ నమ్మకంతోనైతే ఇంతటి విజయాన్ని అందించారో వారి నమ్మకానికి తగ్గట్లుగా వారి గొంతుకనై పనిచేస్తానన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై, కేసీఆర్‌ పోకడలపై తన పోరాటం సాగుతుందని, కేంద్రంలో మోదీకి సైతం తాను భయపడనని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానంటూ హామీనిచ్చారు. రైల్వే…

Read More

ప్రముఖ సినీ నటుడు గిరీష్‌కర్నాడ్ కన్నుమూత

ప్రముఖ సినీ, రంగస్థల నటుడు, దర్శకుడు, రచయిత గిరీశ్ కర్నాడ్(81) కన్నుమూశారు. బెంగళూరులోని ఆయన స్వగృహంలో సోమవారం ఉదయం 6.30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గిరీష్ కర్నాడ్ 19 మే 1938లో మహారాష్ట్రలోని మాథేరాన్ ప్రాంతంలో జన్మించారు. కన్నడలో పలు నాటకాలు రచించి ఆయన వెలుగులోకి వచ్చారు. 1970లో ‘సంస్కారా’ అనే చిత్రం ద్వారా ఆయన సినిమాల్లో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం సినిమాల్లో ఆయన నటించారు. జంధ్యాల దర్శకత్వంలో 1983లో తెరకెక్కిన ఆనందభైరవి చిత్రంతో కర్నాడ్‌కు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. శంకర్ దాదా-ఎంబీబీఎస్, కొమరం పులి, స్కెచ్ ఫర్ లవ్, ధర్మచక్రం తదితర తెలుగు సినిమాల్లో ఆయన నటించారు. అంతేకాకుండా.. బుల్లితెరపై సంచలన విజయం సాధించిన ‘మాల్గుడి డేస్’ అనే సీరియల్‌లోనూ ఆయన నటించారు.…

Read More

ఏపీ తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశం అమరావతిలోని సచివాలయంలో ప్రారంభమయ్యింది. ఉదయం 10.30 గంటలకు వెలగపూడిలోని సమావేశ మందిరంలో భేటీ మొదలయ్యింది. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రి పలు హామీల అమలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం నేపథ్యంలో తొలి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా ఎనిమిది అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారోత్సవం రోజు వృద్ధుల పింఛన్‌ మొత్తాన్ని రూ.2250కి పెంచుతూ జగన్‌ తొలి సంతకం చేశారు. సీఎం తన చాంబర్లోకి ప్రవేశించినప్పుడు ఆశ వర్కర్ల వేతనం రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ మరో సంతకం చేశారు. అక్టోబరు 15 నుంచి ఏడాదికి రూ.12,500లు రైతుకు సాయంగా అందించే ‘రైతు భరోసా’ పథకానికి ముఖ్యమంత్రి ప్రకటన చేశారు.

Read More

90,500 మందికి చేప ప్రసాదం

మృగశిర కార్తెను పురస్కరించుకొని బత్తిన మృగశిర ట్రస్ట్ చేప ప్రసాద వితరణ ప్రశాంతంగా ముగిసింది. గత ఏడాది 86 వేల మందికి పంపిణీచేయగా.. ఈసారి 90,500 మందికి చేప ప్రసాదం అందజేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ప్రసాదం పంపిణీ.. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. శుక్రవారం నుంచే చేప ప్రసాదం తీసుకొనేందుకు జనం రావడంతో ఎగ్జిబిషన్ మైదానం ప్రాంతాలు ఉబ్బసం వ్యాధిగ్రస్థులతో నిండిపోయాయి. రెండురోజులపాటు కొనసాగిన ప్రసాద వితరణలో 90,500 మంది కొర్రమీను చేప ప్రసాదం స్వీకరించినట్టు మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య గతేడాది కన్నా 4,500 అదనం. చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లల్లో అన్నీ తానై వ్యవహరించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆదివారం కూడా ఎగ్జిబిషన్ మైదానానికి వచ్చి చేప ప్రసాద వితరణ కొనసాగుతున్న తీరును…

Read More