జగన్ సంచలనం.. వైజాగ్ రెండో రాజధాని?

వైఎస్ జగన్ అఖండ మెజార్టీతో గద్దెనెక్కగానే సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. ముఖ్యంగా అన్ని వర్గాలకు కేబినెట్ లో ప్రాధాన్యం ఇస్తూ బీసీలకు పెద్ద పీట వేశారు. ఇక కుల సమీకరణాలకు అనుగుణంగా అణగారిన వర్గాలకు న్యాయం చేస్తున్నారు. ఈ క్రమంలో పాలనలో తనదైన మార్పులు చేర్పులు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇన్నాళ్లు అమరావతి రాజధానిగా సాగించిన ఏపీ పాలనను ఇక నుంచి విశాఖపట్నానికి ఇనుమడింప చేయాలని జగన్ యోచిస్తున్నట్టు తెలిసింది. విశాఖను ఏపీకి రెండో రాజధానిగా ప్రకటించాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. జగన్ గెలుపులో ఉత్తరాంధ్ర ప్రాముఖ్యత వెలకట్టలేనిది. గోదావరి జిల్లాలు – విశాఖ – ఉత్తరాంధ్రలో ప్రజలు ఆదరించారు. అందుకే పాలనను వారికి చేరువ చేయడానికి జగన్ ఏపీ రెండో రాజధానిగా విశాఖను చేయాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. మహారాష్ట్ర తరహాలోనే…

Read More

ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా కోరుతాం: ఎంపీ అసద్‌

ఎంఐఎంకు ప్రతిపక్షహోదా కోరుతూ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని కలవనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తెలిపారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా ఎంఐఎం అవతరించిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కన్నా ఎంఐఎంకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. ఇదే విషయాన్ని సభాపతిని కలసి వివరించి సభలో ప్రతిపక్ష హోదా కల్పించాల్సిందిగా విన్నవిస్తామన్నారు. స్పీకర్‌ సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు. Tags: MIM, opposition, MP Asad

Read More

విరాట్‌కోహ్లీకి రూ.500 ఫైన్‌

మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆప్‌ గురుగ్రామ్‌(ఎంసీజీ) భారత క్రికెట్‌ టీం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి రూ.500 జరిమాన విధించింది. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంసీజీ చర్యలు చేపట్టింది. గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్‌ ఫేజ్‌-1లో విరాట్‌ నివాసముంటున్న విషయం తెలిసిందే. ఇంటి ఆవరణలో ఆరు కార్లకు పైగా ఉంటాయి. కార్లను రోజు మంచినీటితో శుభ్రచేస్తుండటాన్ని గమనించిన విరాట్‌ పొరిగింటి వ్యక్తి ఎంసీజీకి ఫిర్యాదు చేశాడు. కార్లు శుభ్రం చేసేందుకు రోజు వేల లీటర్ల మంచినీటిని వృథా చేస్తున్నారని పేర్కొన్నాడు. విచారణ చేపట్టిన ఎంసీజీ అధికారులు నీటి వృథా నిజమేనని తేల్చారు. విరాట్‌తో పాటు ఆ ప్రాంతంలోని ఇతర ఇండ్లలో సైతం మంచినీటి వృథాను గుర్తించిన అధికారులు జరిమానా విధించారు. వరల్డ్‌కప్‌ నిమిత్తం కోహ్లీ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. Tags: Viratkohili, 500fine, capten kohili

Read More

నేడు కొలువుదీరనున్న జగన్ క్యాబినెట్

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం శనివారం కొలువుదీరనున్నది. ఉదయం 11.49 గంటలకు వెలగపూడిలోని సచివాలయం ప్రాంగణంలో కొత్త మంత్రులతో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు. మొత్తం 25 మందితో పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటుచేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజికవర్గాలకు చెందినవారు ఉంటారని వెల్లడించారు. ఉపముఖ్యమంత్రులుగా పుష్పశ్రీవాణి (ఎస్టీ), సుచరిత (ఎస్సీ), అంజద్‌బాషా (మైనార్టీ), ఆళ్ల నాని (కాపు), ధర్మాన కృష్ణదాస్ (బీసీ)లకు అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. రాష్ట్ర క్యాబినెట్‌లో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించడం ఇదే ప్రథమం. రెండున్నరేండ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని, అప్పుడు కొత్తవారికి అవకాశం కల్పిస్తామని స్పష్టంచేశారు. మంత్రివర్గం ఏర్పాటు నేపథ్యంలో శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ లెజిస్లేచర్‌పార్టీ సమావేశంలో…

Read More