అసాధారణ విజయమిది

K.Tarakaramarao-TRS

‘‘డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏవిధంగా ఏకపక్ష తీర్పు ఇచ్చారో ‘పరిషత్‌’ ఎన్నికల్లో దాన్ని తలదన్నే తీర్పును ప్రజలు ఇచ్చారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో జడ్పీ పీఠాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకునేలా విజయం సాధించడం అసాధారణమైన విషయం. ఏ పార్టీ మద్దతు అవసరం లేకుండానే 32కు 32 జిల్లా పరిషత్తుల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పీఠాలను కైవసం చేసుకోబోతున్నాం. దేశ స్థానిక సంస్థల ఎన్నికల చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతటి ఏకపక్ష తీర్పు రాలేదు. ఇదొక చరిత్రాత్మక విజయం’’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘పరిషత్‌’ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాలు సాధించాం. ఈ పరిషత్‌ ఎన్నికల్లో 32కు 32 జడ్పీ పీఠాలను సాధించాం. 90…

Read More

హైదరాబాద్ లో ఓ ‘అమ్రిష్ పురి’… ‘మోజో’ టీవీని కబ్జా చేస్తున్నారు: రవిప్రకాశ్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్ లో ఉన్న ఓ అమ్రిష్ పురి, పోలీసుల సాయంతో టీవీ చానళ్లను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఉదయం రెండో రోజు సీసీఎస్ పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన ఆయన, లోనికి వెళ్లేముందు మీడియాతో మాట్లాడారు. భూములను ఎలా ఆక్రమిస్తున్నారో, ఇక్కడ మీడియాను అలాగే ఆక్రమిస్తున్నారని అన్నారు. తన మిత్రులు కొందరు కష్టపడి ‘మోజో’ టీవీని పెట్టుకుంటే, సత్ప్రవర్తన లేని పోలీసుల సహకారంతో, తప్పుడు కేసులు పెట్టి యాజమాన్యాన్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఉచితంగా ఓ టెలివిజన్ చానల్ ను కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ, సత్యాన్ని చంపేయాలని చూస్తున్నారని, టీవీ యాజమాన్యానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా లాక్కునే ప్రయత్నం జరుగుతోందని, దీన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. Tags: Raviprakash, MojoTv, Media

Read More

గ్లోబల్ లీడర్ షిప్ అవార్డుకు ఎంపికైన సుందర్ పిచాయ్!

అమెరికా భారత వాణిజ్య మండలి (యూఎస్‌ ఐబీసీ) ప్రతి సంవత్సరమూ ఇచ్చే గ్లోబల్ లీడర్ షిప్ అవార్డుకు గూగుల్ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ఎంపికయ్యారు. 2019కి గాను సుందర్‌ పిచాయ్‌ తో పాటు నాస్‌ డాక్‌ ప్రెసిడెంట్ అడేనా ఫ్రైడ్‌ మాన్‌ ను ఎంపిక చేసినట్టు యూఎస్ ఐబీసీ పేర్కొంది. వీరి నేతృత్వంలోని కంపెనీలు ప్రపంచ సాంకేతిక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్న కారణంగా అవార్డును ఇస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే వారం జరగనున్న ‘ఇండియా ఐడియాస్‌’ సదస్సులో వారికి అవార్డును అందించనున్నట్టు వెల్లడించింది. గూగుల్‌, నాస్‌ డాక్‌ ల కృషితో గత సంవత్సరం ఇండియా, యూఎస్ ల మధ్య వస్తుసేవల ద్వైపాక్షిక వాణిజ్యం 150 శాతం మేరకు పెరిగిందని ఈ సందర్భంగా యూఎస్‌ ఐబీసీ తెలిపింది. కాగా, తనకు అవార్డును ప్రకటించిన సందర్భంగా సుందర్ పిచాయ్ స్పందించారు.…

Read More