ఊపందుకున్న రవితేజ ‘డిస్కోరాజా’

రవితేజ తాజా చిత్రంగా ‘డిస్కోరాజా’ రూపొందుతోంది. ఆ మధ్య నత్తనడక నడిచిన షూటింగ్ తిరిగి ఊపందుకుంది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్ – నభా నటేశ్ నటిస్తున్నారు. ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగు జరుపుకుంటోంది. రెండవ షెడ్యూల్లో భాగంగా కొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో రవితేజ – వెన్నెల కిషోర్ కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ రోజు .. రేపు వికారాబాద్ లో షూటింగును ప్లాన్ చేశారు. కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో మరో కథానాయికకు కూడా చోటు వున్నట్టుగా తెలుస్తోంది. Tags: Raviteja, Discoraja, payalraj

Read More

లోక్‌సభ ఎన్నికలు @ రూ.60 వేల కోట్లు!

ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఏకంగా 60 వేల కోట్ల రూపాయలను వ్యయం చేశాయి. సగటున ఒక్కో లోక్‌సభ నియోజకవర్గానికి రూ.100 కోట్ల మేర ఖర్చు చేశాయి. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) అనే మేథో సంస్థ సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఎన్నికల వ్యయంపై సీఎంఎస్ ఢిల్లీలో సోమవారం చర్చా కార్యక్రమం నిర్వహించింది. దీనికి కేంద్ర మాజీ ఎన్నికల ప్రధాన అధికారి ఎస్‌వై ఖురేషి హాజరయ్యారు. దేశంలో ఎన్నికల ఖర్చు భారీగా పెరుగడంపై సీఎంఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల వ్యయం పెరిగేకొద్దీ ఎన్నికల ప్రచారం కూడా దుర్మార్గంగా, అసహ్యంగా తయారవుతుందని తాజా ఎన్నికల ద్వారా తేలిందని సీఎంఎస్ పేర్కొంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో రూ.60 వేల కోట్లు ఖర్చు చేశారని, ఇందులో ఎన్నికల…

Read More

కేసీఆర్ దత్తత గ్రామంలో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ ప్రభంజనం ఉన్న స్థితిలో అనూహ్యంగా సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. కరీంనగర్ జిల్లా చినముల్కనూర్ ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి పరాజయం తప్పలేదు. ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీచేసిన రాజేశం ఎంపీటీసీగా విజయం సాధించారు. తెలంగాణలో ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 3,042 ఎంపీటీసీ స్థానాలు, 44 జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 1,101 ఎంపీటీసీ స్థానాలు, 3 జడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంది. కాగా, తెలుగుదేశం పార్టీకి 20 ఎంపీటీసీ స్థానాలు దక్కాయి. బీజేపీ 184 ఎంపీటీసీ స్థానాలను చేజిక్కించుకోగా, ఇతరులు 487 ఎంపీటీసీ స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. Tags: TRS, KCR, MPTC

Read More