బస్సులు, మెట్రో రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణం: సీఎం కేజ్రీవాల్

అతి త్వరలోనే ఢిల్లీలోని మహిళలు ఉచితంగా ప్రయాణించబోతున్నారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. బస్సులు, మెట్రో రైళ్లలో ఉచితంగా మహిళలు ప్రయాణించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమం వల్ల ఢిల్లీ ప్రభుత్వంపై ఈ ఏడాది రూ. 700 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. మెట్రో టికెట్లను కొని ప్రయాణించేంత ఆర్థిక సామర్థ్యం అందరు మహిళలకు ఉండదని… టికెట్ కొనుగోలు చేయగలిగిన శక్తి ఉన్నవారు కొనుక్కోవచ్చని… టికెట్ కొనలేనివారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. ఈ ఖర్చును మొత్తం ఢిల్లీ  ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. ప్రజాధనాన్ని ప్రజల కోసమే వినియోగిస్తున్న ఏకైక ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వమే అని కేజ్రీవాల్ చెప్పారు. ఇంత చేస్తున్నప్పటికీ ఢిల్లీ ఆర్థిక పరిస్థితి లాభాల్లోనే ఉందని తెలిపారు. మహిళల రక్షణకు తాము అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని చెప్పారు. కేజ్రీవాల్ ప్రకటనపై బీజేపీ మండిపడింది. ఆయన ప్రకటనల…

Read More

సఫల తెలంగాణ

దేశచరిత్రలోనే ఎన్నదగిన మహోద్యమాన్ని సాగించి సాధించుకొన్న తెలంగాణ నేడు ఒక సఫల రాష్ట్రంగా పురోగమిస్తున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఒక రాష్ట్ర చరిత్రలో ఐదేండ్లు చిన్నకాలమే అయినప్పటికీ ప్రభుత్వం సాధించిన అసామాన్య విజయాల రీత్యా ఎంతో విలువైన కాలమని పేర్కొన్నారు. కాళేశ్వరంతోపాటు రాష్ట్రంలో తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయితే రాష్ట్రంలో కరువు అనే మాట వినిపించదు.. కనిపించదని సీఎం తెలిపారు. రెండున్నరేండ్ల అతి తక్కువ సమయంలో నిర్మిస్తున్న అతి పెద్ద సాగునీటి ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్ర సృష్టించబోతున్నదన్నారు. వచ్చేనెల చివరినుంచి మేడిగడ్డ బరాజ్ నుంచి ప్రతిరోజు రెండు టీఎంసీల నీళ్లను ఎత్తిపోయనున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో అవినీతికి ఎంతమాత్రం చోటులేకుండా కొత్త రెవెన్యూ, మున్సిపల్ చట్టాలను తీసుకొచ్చి పారదర్శకమైన పాలనను అందిస్తామన్నారు. కాలంచెల్లిన చట్టాలకు చరమగీతం పాడుతామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో తనకు సంతృప్తినిచ్చిన ఆసరా పింఛన్లను జూలై ఒకటి…

Read More