కల్వకుంట్ల కవితకు ‘పసుపు రైతుల’ దెబ్బ.. 18,000 ఓట్లతో వెనుకంజ!

Kalvkutla-Kavitha

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నిజామాబాద్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత వెనుకంజలో ఉన్నారు. నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అరవింద్ కవితపై 18,000 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. మరోవైపు మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖరరెడ్డి అక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సికింద్రాబాద్ లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి, తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని కిరణ్ కుమార్ యాదవ్ పై లీడింగ్ లో దూసుకుపోతున్నారు.

Read More

తన పెళ్లి గురించి నేడు ప్రకటిస్తానంటున్న సల్మాన్ ఖాన్!

ఐదు పదుల వయసు దాటినా, ఇప్పటికీ, బాలీవుడ్ సెలబ్రిటీల్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ హోదాను అనుభవిస్తున్న సల్మాన్ ఖాన్, పెళ్లి ఎప్పుడన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చారు. తాను నటించిన ‘భరత్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా విలేకరులతో మాట్లాడుతున్న వేళ, పెళ్లి గురించిన ప్రశ్న ఎదురుకాగా, స్పందించారు. “నా పెళ్లి గురించి 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే రోజు (మే 23) ప్రకటిస్తా” అని ఆయన ఓ జోక్ చేశారు. వచ్చే ఐదేళ్ల కాలానికీ పీఎంగా ఎవరు అధికార పీఠం ఎక్కుతారో నేడు తేలనుండగా, ఈ రిజల్ట్స్ కన్నా తన పెళ్లి గురించే ప్రజలకు ఆసక్తి ఎక్కువగా ఉందన్న అభిప్రాయంతో సల్మాన్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. కాగా, నిన్న ఆయన మాట్లాడుతూ, తనకు పిల్లలు కావాలే తప్ప, వారికి తల్లి వద్దన్నట్టుగా మాట్లాడటంతో,…

Read More

వచ్చేస్తున్న రాజన్న రాజ్యం… పలు జిల్లాల్లో క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ!

ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, మరోసారి రాజన్న రాజ్యం తెస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పలుమార్లు చేసిన విజ్ఞప్తితో ప్రజలు కదలగా,  ఆ అభిమానం ఓట్ల రూపంలో వెల్లువై పారింది. ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ఊపందుకోగా, పలు నియోజకవర్గాల్లో ఐదు నుంచి ఆరు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. మొత్తం 175 నియోజకవర్గాలున్న ఏపీలో 162 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ వెలువడుతుండగా, వైసీపీ 133 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి, తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండగా, తెలుగుదేశం పార్టీ కేవలం 29 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జనసేన, కాంగ్రెస్ సహా మరే ఇతర పార్టీ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం. పవన్ కల్యాణ్ భీమవరంలో మూడో స్థానంలో, గాజువాకలో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఈ…

Read More

భీమవరంలో రెండోస్థానం, గాజువాకలో మూడోస్థానం.. చతికిలపడ్డ పవన్ కల్యాణ్!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు తీవ్ర నిరాశ ఎదురయింది. జనసేన అభ్యర్థులు గెలవడం పక్కనపెడితే ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అడ్రస్సే ఇప్పుడు గల్లంతు అయింది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల ప్రకారం పవన్ కల్యాణ్ భీమవరంలో రెండో స్థానంలో కొనసాగుతుండగా, గాజువాకలో మూడోస్థానంలో కొనసాగుతున్నారు.  రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 138 స్థానాల్లో, టీడీపీ 33 స్థానాల్లో, జనసేన ఓ సీటులో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

Read More