ఆక‌లి బాగా పెర‌గాలంటే.. ఇలా చేయాలి..!

ఆకలి బాగా అయితేనే మ‌నం ఆహారం తింటాం. జీర్ణం బాగా అవుతుంది. దాంతో మ‌న‌కు శ‌క్తి, పోష‌కాలు ల‌భిస్తాయి. అయితే ఆక‌లి లేక‌పోతే ఏ ఆహారాన్నీ తిన‌లేం. దీంతో నీర‌సం, అల‌స‌ట వస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే చాలా మంది ఆక‌లి లేక‌పోవ‌డ‌మ‌నే స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. మరి ఆక‌లి బాగా పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!  1. ఒక టీస్పూన్ బెల్లం పొడి, అర టీస్పూన్ న‌ల్ల‌మిరియాల పొడిల‌ను క‌లిపి రోజూ ఒక పూట తీసుకుంటే ఆక‌లి బాగా పెరుగుతుంది.  2. అర టీస్పూన్ అల్లం ర‌సంలో కొద్దిగా రాక్ సాల్ట్ క‌లిపి 10 రోజుల పాటు రోజూ ఈ మిశ్రమాన్ని భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకుంటే ఆక‌లి బాగా పెరుగుతుంది.  3. ఒక క‌ప్పులో నీటిని తీసుకుని అందులో 2 టీస్పూన్ల ఉసిరికాయ ర‌సం,…

Read More

‘హ్యాపీబర్త్‌డేఎన్టీఆర్’.. ట్రెండింగ్‌లో టాప్

హ్యాపీబర్త్‌డేఎన్టీఆర్’ హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియా షేకవుతోంది. యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు పుట్టిన రోజు నేడు (మే 20). 1983లో జన్మించిన తారక్ ఈ పుట్టినరోజుతో 36వ వసంతంలోకి అడుగుపెట్టారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు మనవడిగా, ఆయన నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో రారాజుగా దూసుకెళుతూ.. తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు తారక్. “బాలరామాయణం” మూవీతో మొదలైన ఆయన నటప్రస్థానం.. స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి, యమదొంగ, బృందావనం, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ, అరవింద సమేత వంటి వైవిధ్య చిత్రాలతో టాలీవుడ్ శిఖరాగ్రానికి చేరింది. చరిత్రను తిరగరాయబోతున్న ‘ఆర్ఆర్ఆర్’కు ఆయనొక అస్త్రం అయ్యేలా చేసింది. త్వరలో ‘కొమరం భీమ్’ పాత్రలో నట విశ్వరూపాన్ని ప్రదర్శించబోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డేను పురస్కరించుకుని…

Read More

ఏం కొందాం.. ఏం తిందాం..

మార్కెట్‌ల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే వాటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఏ కూరగాయలు కొనుగోలు చేసే పరిస్థితులు కన్పించడం లేదు. ఏ రకం కూరగాయలు కొనాలన్నా.. ఆకాశన్నంటిన ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. అంతటి ధరలు పెట్టి ఎల కొనుగోలు చేయాలో తెలియని అయోమయంలో పడిపోతున్నారు. మరో వైపు చికెన్ ధరలు సైతం పెరిగాయి. ఇప్పటికే మటన్ ధరలు సామాన్యుడికి అందనంత దూరంలోకి వెళ్లిపోయాయి. ఇలా పెరిగిన ధరలతో ఏం కొనలేని.. తినలేని పరిస్థితి నెలకొన్నది.

Read More

టీఆర్‌ఎస్‌దే హవా

 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే క్లీన్‌స్వీప్. పదహారు ఎంపీ స్థానాల్లో విజయఢంకా మోగించనున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీమెజార్టీతో రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకొన్న గులాబీ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ తన హవా కొనసాగించనున్నదని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టంచేశాయి. రాష్ట్రంలో ఎంపీ సీట్లన్నింటినీ టీఆర్‌ఎస్ ఏకపక్షంగా గెలుచుకోబోతున్నదని జాతీయసంస్థలు నిర్వహించిన అన్ని ఎగ్జిట్‌పోల్స్ పేర్కొన్నాయి. 45 శాతానికి పైగా ఓటర్లు టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికారని తెలిపాయి. 17 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ 16 స్థానాలను గెలుచుకుంటుందని హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) ప్రతినిధి వేణుగోపాలరావు పేర్కొన్నారు. మరోస్థానంలో ఎంఐఎందే విజయమని తెలిపారు.

Read More

కాళేశ్వరం అభివృద్ధికి వంద కోట్లు

పవిత్ర గోదావరి నదీతీరాన ఉన్న కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా, పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దేవాలయంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వెంటనే రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణకు ప్రాణధార అయిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు పూర్తవుతున్న నేపథ్యంలో ఆలయంతోపాటు కాళేశ్వరం ప్రాంతాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉన్నదన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా కుటుంబసమేతంగా ఉన్నతాధికారులతో కలిసి ఆదివారం ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ఆలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని, పార్వతిమాతను దర్శించుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆలయ ప్రాంగణంలోనే అర్చకులతో కాసేపు కూర్చొని మాట్లాడారు. 

Read More