జగన్ కోసమే తలనీలాలు సమర్పించా: హాస్యనటుడు పృథ్వీరాజ్

జగన్ సీఎం కావాలని శ్రీ వెంకటేశ్వరుడిని కోరుకున్నానని వైసీపీ నాయకుడు, ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ అన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఆయన సందర్శించుకున్నారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇంత వరకూ తన కోసం స్వామి వారికి ఏ మొక్కూ మొక్క లేదు, తలనీలాలు ఇవ్వలేదని అన్నారు. జగన్ సీఎం కావాలని కోరుకుంటూ తన తలనీలాలు తొలిసారిగా ఇచ్చానని అన్నారు. జగన్ సీఎం అయ్యేందుకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని, ఆ సీటులో ఆయన్ని కూర్చోబెట్టి, ప్రజారంజకమైన పాలన అందించే శక్తిని ఆయనకు ప్రసాదించమని కోరుకున్నట్టు చెప్పారు.  శ్రీవారిని దర్శించుకున్న మరో వైసీపీ నేత కొడాలి నాని మాట్లాడుతూ, వైసీపీకి అత్యధిక స్థానాలు రావాలని, జగన్ సీఎం కావాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ దేవుడిని వేడుకున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న కరవు పరిస్థితుల నుంచి…

Read More

జూన్ 6న కేర‌ళ‌కు రుతుప‌వ‌నాలు : ఐఎండీ

నైరుతీ రుతుప‌వ‌నాల ఆగ‌మ‌నం ఈసారి ఆల‌స్యంకానున్న‌ది. ఈ ఏడాది రుతుప‌వ‌నాలు జూన్ 6వ తేదీన కేర‌ళ‌లో ప్ర‌వేశిస్తాయ‌ని భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ‌(ఐఎండీ) ఆశాభావం వ్య‌క్తం చేసింది. సాధార‌ణంగా ప్ర‌తి ఏడాది జూన్ ఒక‌ట‌వ తేదీన రుతుప‌వ‌నాలు కేర‌ళ‌లో ప్ర‌వేశిస్తాయి. క‌స్ట‌మైజ్డ్ వెద‌ర్ మాడ‌ల్ ఆధారంగా ఐఎండీ ప్ర‌తి ఏడాది వాతావ‌ర‌ణాన్ని అంచ‌నా వేస్తుంది. అయితే 2015లో ఒక‌సారి మాత్ర‌మే త‌మ అంచ‌నా త‌ప్పింద‌ని ఐఎండీ వెల్ల‌డించింది. మొత్తం ఆరు ప‌రిమితుల‌ను ఆధారం చేసుకుని వాతావ‌ర‌ణాన్ని అంచ‌నా వేస్తామ‌ని ఐఎండీ చెప్పింది. వాయ‌వ్యంలో క‌నీస ఉష్ణోగ్ర‌త‌లు, ద‌క్షిణ ద్వీప ప్రాంతంలో రుతుప‌వ‌నాలకు ముందు కురిసిన వ‌ర్షం, ద‌క్షిణ చైనా స‌ముద్రంపై ఓఎల్ఆర్‌, హిందూమ‌హాస‌ముద్రంలో గాలుల తీరు లాంటి అంశాల ఆధారంగా రుతుప‌వ‌నాల‌ను అంచ‌నా వేయ‌డం జ‌రుగుతుంద‌ని ఐఎండీ చెప్పింది. త‌మ ద‌గ్గ‌ర ఉన్న వెద‌ర్ మోడ‌ల్ ఆధారంగా.. అంచ‌నాలో…

Read More

రైతు ఆదాయం రెట్టింపుపై సర్కార్ నజర్

 అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే రైతుబంధు పథకంతో ఎకరాకు రూ.నాలుగు వేలు ఇస్తుండగా.. పెట్టుబడి వ్యయాన్ని మరిం త తగ్గించాలని యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేసింది. ప్రధాన పంటలైన వరి, మక్కజొన్న, పప్పు ధాన్యాలు, పల్లీల దిగుబడిలో వ్యత్యాసాలను తగ్గించి ఉత్పత్తి పెంచాలని నిర్ణయించింది. తెలంగాణ విత్తనోత్పత్తికి ఎంతో అనుకూలమైన ప్రదేశం. ఏటా దాదాపు 37.42 లక్షల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయి. దేశవ్యాప్తంగా అవసరమైన వరి విత్తనాలు 90 నుంచి 95 శాతం మన రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. 2022 నాటికి దేశ రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. దీనిని సాధ్యం చేసేలా తెలంగాణ సర్కార్ ఇప్పటికే చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ రాష్ట్రాలు ఇప్పటికే రైతుల ఆదాయం…

Read More

తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన ఉష్ణోగ్రతలు

ఈసారి సూర్యుడు రికార్డు బద్దలు కొడుతున్నాడు. ఇప్పటికే తన ప్రతాపం ఏంటో చూపిన భానుడు.. బుధవారం నుంచి మరింత రెచ్చిపోనున్నాడు. ఉత్తర భారతం నుంచి వచ్చే వేడిగాలులతో తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడు రోజులపాటు వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి. వాయువ్యదిశ నుంచి వచ్చే గాలుల ప్రభావంతో మే నెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు ఘననీయంగా పెరుగుతాయి. జూన్ మొదటి వారం వరకు ఎండల ప్రభావం ఉంటుంది. తెలంగాణ కోల్ హీట్ వేవ్ జోన్ పరిధిలో ఉంది. రాజస్థాన్ నుంచి ప్రారంభమయ్యే ఈ జోన్ పరిధిలో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఒడిసా, ఆంధ్రప్రదేశ్. ఈ ప్రాంతాల్లో సూర్యకిరణాలు నిటారుగా పడతాయి. దీంతో ఉష్ణోగ్రత, వడగాల్సుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

Read More