ఏపీ పౌరుషం ఏంటో ఈ నెల 23 తర్వాత జగన్, కేసీఆర్, మోదీలకు తెలుస్తుంది!: సాధినేని యామిని

ఈ నెల 23న లోక్ సభ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత మోదీ హిమాలయాలకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సాధినేని యామిని మాట్లాడారు. మోదీ పాలన జర్మనీ నియంత హిట్లర్ ను తలపిస్తోందని ఆమె దుయ్యబట్టారు. ఏపీ పౌరుషం అంటే ఏంటో మే 23న మోదీ, జగన్, కేసీఆర్ లకు తెలుస్తుందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో జగన్, కేసీఆర్, మోదీలకు ఆస్కార్ ఇవ్వొచ్చని యామిని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ విజయాన్ని ఆపలేరనీ, చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు.

Read More

ప్రస్తుతం తెలంగాణను చినజీయర్ స్వామి పరిపాలిస్తున్నారు!: ప్రొ.కంచ ఐలయ్య ఆరోపణ

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రస్తుతం చినజీయర్ స్వామి పరిపాలిస్తున్నారని ప్రొఫెసర్ కంచ ఐలయ్య విమర్శించారు. దళిత, బీసీ పక్షపాతిని అని చెప్పుకునే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటివరకూ ఒక్క అంబేద్కర్ విగ్రహానికి కూడా నివాళులు అర్పించలేదని స్పష్టం చేశారు. ఇటీవల హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేసినా కేసీఆర్ స్పందించలేదని విమర్శించారు. అసలు అంబేద్కర్ తో పెట్టుకున్నవాళ్లు ఎవ్వరూ బాగుపడలేదని హెచ్చరించారు. హైదరాబాద్ లో సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ‘అంబేద్కర్‌ విగ్రహం ప్రతిష్టించి, దోషులను శిక్షించడం’ అనే సదస్సులో ఐలయ్య పాల్గొన్నారు.

Read More

ప్రేర‌ణాత్మ‌క అంశాల‌తో అబ్ధుల్ క‌లాం బ‌యోపిక్

మిసైల్ మ్యాన్, పీపుల్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం బ‌యోపిక్‌ని తెలుగులో రూపొందించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ అబ్దుల్ క‌లాం బ‌యోపిక్‌ని త‌మ సంస్థ‌లో రూపొందించ‌బోతున్న‌ట్టు ఇటీవ‌ల అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. రామ‌బ్ర‌హ్మం సుంక‌ర , అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో అబ్దుల్ క‌లాం బ‌యోపిక్‌ని హాలీవుడ్ స్టాండ‌ర్డ్స్‌లో తెర‌కెక్కించ‌నున్నాట‌. అయితే ఇందులో అబ్ధుల్ క‌లాం జీవితంలో ఏం జ‌రిగింది అనే అంశాల‌ని కాకుండా చిన్న‌త‌నం లోని వివిధ ద‌శ‌ల‌లో ఆయ‌న ఆలోచ‌న‌లు ఎలా ఉండేవి అన్న దానిపై సినిమా తీయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. 

Read More

పేటీఎం క‌స్ట‌మ‌ర్ల‌కు క్రెడిట్ కార్డ్.. ఫ‌స్ట్ కార్డ్‌ను లాంచ్ చేసిన పేటీఎం

ప్ర‌ముఖ డిజిట‌ల్ వాలెట్ యాప్ పేటీఎం త‌న క‌స్ట‌మ‌ర్ల కోసం పేటీఎం ఫ‌స్ట్ కార్డ్ పేరిట ఓ నూత‌న క్రెడిట్ కార్డును ఇవాళ భార‌త్‌లో లాంచ్ చేసింది. సిటీ బ్యాంక్‌తో భాగ‌స్వామ్యం అయిన పేటీఎం ఈ కార్డును ఇవాళ ప్ర‌వేశ‌పెట్టింది. ఈ కార్డు ద్వారా క‌స్ట‌మ‌ర్ల‌కు 1 ప‌ర్సంట్ యూనివ‌ర్స‌ల్ అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది. దేశంలోనే ఈ త‌ర‌హా క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్న మొద‌టి కార్డు ఇదే కావ‌డం విశేషం. కాగా ఈ కార్డును పొందేందుకు ఎలాంటి చార్జిలు లేవు. అలాగే ఇంట‌ర్నేష‌న‌ల్‌గా కూడా ఈ కార్డును వాడుకోవ‌చ్చు. ఇక ఈ కార్డును ఉప‌యోగించి ఏడాదికి రూ.50వేల‌కు పైగా వాడుకుంటే వార్షిక ఫీజు రూ.500 ల‌ను ర‌ద్దు చేస్తారు. ఈ కార్డుతో క‌స్ట‌మ‌ర్లు ప‌లు వ‌స్తువుల‌ను ఈఎంఐ విధానంలోనూ కొనుగోలు చేసే అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. ఇక…

Read More