తెలంగాణలో రుతురాగం జూన్ రెండోవారంలో!

ఈసారి నైరుతి రుతుపవనాలు జూన్ రెండోవారంలో తెలంగాణను తాకనున్నాయని ఇండో-జర్మన్ ప్రాజెక్టులో భాగమైన పాట్స్‌డామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ైక్లెమేట్ ఇంపాక్ట్ రిసెర్చ్ (పీఐకే) సంస్థ వెల్లడించింది. మధ్యభారతదేశంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో జూన్ 8 నుంచి 16వ తేదీ మధ్య నైరుతి రుతుపవనాలు మొదలయ్యే అవకాశముందని పీఐకే శాస్త్రవేత్తల ప్రాథమిక అధ్యయనం పేర్కొన్నది. తూర్పు కనుమలు, మహారాష్ట్రలోని తూర్పు దక్షిణ ప్రాంతం, ఛత్తీస్‌గఢ్‌లోని పశ్చిమప్రాంతం, ఉత్తర తెలంగాణ కేంద్రంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని పీఐకే తెలిపింది. 

Read More

టీవీ9 రవిప్రకాశ్ పై ఫోర్జరీ కేసు నమోదు

టీవీ9 సీఈవో రవిప్రకాశ్ పై ఫోర్జరీ కేసు నమోదైంది. చానల్ నిర్వహణ తన ఇష్టారాజ్యంగా జరగాలన్న పంతంతో అలందా మీడియా యాజమాన్యానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ, చివరకి ఓ కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసిన రవిప్రకాశ్‌ను ఆ సంస్థ సీఈవో పదవి నుంచి తొలగించింది. కంపెనీలో 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యానికి ఆ కంపెనీ నిర్వహణలో అడుగడుగునా అడ్డుపడుతూ, కంపెనీల చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కొత్త యాజమాన్యం ఆరోపించింది. మెజార్టీ వాటాదారుల హక్కులను అణగదొక్కే విధంగా కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారంటోంది అలందా మీడియా. సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పీఎస్‌లో రవి ప్రకాష్‌పై ఫోర్జరీ కేసు నమోదైంది. ఐటీ యాక్ట్ 56, ఐపీసీ 406, 467 సెక్షన్ల కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తన సంతకం రవిప్రకాష్ ఫోర్జరీ…

Read More

నిప్పుల గుండం

రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. బుధవారం నల్లగొండలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు రోజులపాటు ఇదే రీతిన ఎండలు మండిపోతాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఖమ్మంలో 44.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత గరిష్ఠంగా నమోదైంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 46.5 నుంచి 47 డిగ్రీలకు చేరుకోవచ్చని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉదయం పది గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతుండటంతో ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే ఒకటికి రెండుసార్లు అలోచించాల్సిన పరిస్థితి. సాయంత్రం ఆరు గంటల వరకు ఎండ తీవ్రత తగ్గకపోవడం గమనార్హం. ఉక్కపోత చెమటతో ప్రజలు సతమతమవుతున్నారు. 

Read More

మహర్షికి సెలబ్రిటీల వీడియో వర్షం

మహేష్ బాబు బెటర్ హాఫ్ నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా అకౌంట్స్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకు ఆవిడ ఎన్నో స్వీట్ సర్ప్రైజెస్ ఇస్తూనే ఉంటారు. ఇవాళ విడుదలైన మహర్షి విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న నమ్రతా గత మూడు నాలుగు రోజులుగా ఇప్పటిదాకా మహేష్ ని డైరెక్ట్ చేసిన దర్శకులతో నటించిన హీరొయిన్లతో ప్రత్యేక వీడియోలు చేయించి వాటిని షేర్ చేయడం ద్వారా కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. పాతిక సినిమాల జర్నీ కాబట్టి ఈ ఆలోచన బాగా కనెక్ట్ అవుతోంది. అందరూ మహేష్ తో పని చేయడం వల్ల కలిగిన అనుభూతులను పంచుకోవడం అంతగా తాము హీరోని ఇష్టపడేందుకు గల కారణాలు వివరించడం ఇవన్ని బాగానే వర్క్ అవుట్ అవుతున్నాయి

Read More