ప్రచారంలో దూసుకుపోతున్న ప్రకాశ్ రాజ్

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన పోరాటం ఏ ఒక్క వ్యక్తిపై కాదని చెప్పారు. ప్రజల కోసమే తాను పోరాడుతున్నానని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో సరైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడే ప్రజలు గెలిచినట్టని అన్నారు. సరైన వ్యక్తిని ఎన్నుకోకపోతే… ఆ ఓటమి ప్రజలదేనని చెప్పారు. కుల, మతాలకు అతీతంగా, ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వేయాలని విన్నవించారు.

Read More

నైరుతిలో మంచి వానలు

దేశ వ్యాప్తంగా ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు కానుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాలు సకాలంలోనే ప్రవేశిస్తాయని శుభవార్త చెప్పింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు 96శాతం వర్షపాతం నమోదు కానుందని తెలిపింది. ప్రస్తుతం పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్న ఎల్‌నినో నైరుతి సీజన్‌ రెండో భాగానికి మరింత బలహీనపడుతుందని అంచనా వేసింది. బలహీన ఎల్‌నినో పరిస్థితులు ఈ వేసవి అంతా కొనసాగనున్నాయని, దీంతో ఆసియా పసిఫిక్‌ దేశాల్లో తక్కువ వర్షపాతం కురుస్తుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. ఐఎండీ మాత్రం ఆ ప్రభావం భారత్‌పై ఉండదని తేల్చిచెప్పింది. వేసవి తర్వాత ఎల్‌నినో బలహీనపడుతుందని స్పష్టం చేసింది. గతేడాది మంచి వర్షాలు కురుస్తాయన్న అంచనాకు భిన్నంగా 91శాతం వర్షపాతమే నమోదైంది. ముఖ్యంగా దక్షిణాదిలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈసారి దేశంలో సాధారణ వర్షాలు…

Read More

త్వరలోనే బద్దలవుతుంది: విజయశాంతి

రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తానన్న సీఎం కేసీఆర్‌ ప్రకటన వెనుక రాజకోట రహస్యం దాగి ఉందని, అది త్వరలోనే బద్దలవుతుందని కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి వ్యాఖ్యానించారు. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తానని కేసీఆర్‌ చెప్పడం విడ్డూరంగా ఉందంటూ విజయశాంతి సోమవారం తన ఫేస్‌బుక్‌లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల క్రితం రాష్ట్రాన్ని కుదిపేసిన మియాపూర్‌ భూకుంభకోణం వెలుగు చూసినప్పుడే రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని కేసీఆర్‌ ప్రకటనలు గుప్పించారని, అందులో టీఆర్‌ఎస్‌ బడా నేతలకు సంబంధాలు ఉన్నాయని తేలడంతో ప్రక్షాళన అంశాన్ని అటకెక్కించారన్నారు. ఆ ఘటనలో కే కేశవరావు వంటి బడుగు నేతను బలి చేసి తనకు సన్నిహితులైన వారిని కేసీఆర్‌ సర్కారు కాపాడిందన్నారు. అప్పుడే రెవెన్యూ ప్రక్షాళన చేసి ఉంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు.

Read More

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

మియపూర్ భూములపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. మియపూర్ భూములపై రాష్ట్ర ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేయడాన్ని కోర్టు తప్పు పట్టింది. రద్దు ఉత్తర్వులు నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పరిష్కారమయ్యే వరకు స్టే విధించింది. మియపూర్ భూములను యధావిధిగా ఉంచాలని స్టేటస్‌కో ఆర్డర్ ఇచ్చింది. చట్టాన్ని దుర్వినియోగం చేసే వారి పట్ల కోర్టుకు సానుభూతి ఉండదని స్పష్టంచేసింది.

Read More