కమనీయంగా సీతారాముల కల్యాణం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివారం శ్రీసీతారాముల కల్యాణం కనుల పండువగా జరిగింది. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన లక్షలాది భక్తులు స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ముందుగా రామాలయాన్ని సందర్శించిన మంత్రి.. అక్కడ పూజల అనంతరం కల్యాణ మండపానికి చేరుకొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. కుటుంబం తరపున వ్యక్తిగతంగా సీతారామచంద్రస్వామివారికి పట్టువస్ర్తాలను పంపించారు. ఈ పట్టువస్ర్తాలను దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ అందజేశారు. త్రిదండి చినజీయర్‌స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీరంగక్షేత్రం, శృంగేరి పీఠం నుంచి స్వామివారికి పట్టువస్ర్తాలు, శేషమాలికలు, పవిత్రాలు పంపించారు. రామదాసు వంశం పదోతరంగాఉన్న కంచర్ల శ్రీనివాస్ దంపతులు స్వామివారికి పట్టువస్ర్తాలు అందజేశారు. 

Read More

ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ప్రశ్నకు నటుడు ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అభివృద్ధికి, ప్రభుత్వ వ్యతిరేకతకు మధ్య జరగలేదని, వ్యక్తిగత నిందారోపణలు, పరస్పర అభియోగాలు, నేతల మధ్య విభేదాలు ప్రాతిపదికన జరిగాయని తాను భావిస్తున్నట్టు నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా, “ఏపీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారని భావిస్తున్నారు?” అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. తనకు ఏపీ ఎన్నికల్లో పరిస్థితి ఏంటన్న విషయమై క్షేత్రస్థాయిలో అవగాహన లేదని, అయితే, అత్యధికులు చంద్రబాబుకు గతంలో వచ్చినంత మెజారిటీ రాకపోవచ్చని అంటున్నారని, ఇదే సమయంలో జగన్ చాలా ఎదిగారని చెబుతున్నారని అన్నారు. ఓ విజన్ ఉన్న నాయకుడైన చంద్రబాబు, తన విజన్ ను ఈ ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందుకు తీసుకు రాలేదని భావిస్తున్నట్టు చెప్పారు.

Read More