మోదీ కరడుగట్టిన ఉగ్రవాది.. మంచివాడు కాదు: చంద్రబాబు

ఏడాది కిందటి వరకు కూడా ప్రధాని నరేంద్ర మోదీతో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల సభల్లో మోదీపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా నరేంద్ర మోదీ ఓ కరడు గట్టిన ఉగ్రవాది అని, మంచివాడు కాదు అని అనడం విశేషం. చిత్తూరు జిల్లా మదనపల్లె ఎన్నికల సభలో బాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సభలో ఎప్పుడో జరిగిన గోద్రా అల్లర్ల అంశాన్ని కూడా మరోసారి గుర్తు చేశారు. మైనారిటీ సోదరులకు ఒక్కటే చెబుతున్నా. మిమ్మల్ని జైళ్లలో వేయడానికి మోదీ ట్రిపుల్ తలాఖ్ బిల్లు తీసుకొచ్చారు. గోద్రా ఘటన మీకు గుర్తుండే ఉంటుంది. 2 వేల మందిని చంపారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన తొలి వ్యక్తిని నేనే అని…

Read More

కాబోయే ప్రధాని కేసీఆర్

దేశానికి కాబోయే ప్రధానమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కేంద్రంలో ఏర్పడబోయేది కొత్త కూటమేనని పేర్కొన్నారు. బాలాపూర్ మండల పరిధిలోని షాహిన్‌నగర్ జెన్‌జెన్ మేకరి కాలనీలో టీఆర్‌ఎస్, ఎంఐఎం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభలో, సికింద్రాబాద్ అభ్యర్థి సాయికిరణ్‌యాదవ్‌కు మద్దతుగా ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రూపాయి కూడా ఇవ్వలేదని, ప్రజలను ద్వేషపూరిత వ్యాఖ్యలతో రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు ప్రధాని మోదీకి నింగికీ నేలకు ఉన్నంత వ్యత్యాసం ఉన్నదన్నారు. 

Read More

పాయ‌ల్ రాజ్‌పుత్ మాస్ మ‌సాలా సాంగ్

ఆర్‌ఎక్స్100 సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన పాయల్‌రాజ్‌ఫుత్ ఈ చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో చక్కటి అభినయంతో ఆకట్టుకున్నది . తొలి అడుగుతోనే ఆమెకి పెద్ద విజయం దక్కింది. ప్ర‌స్తుతం వెంకీమామ చిత్రంలో వెంకటేష్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ర‌వితేజ చిత్రంలోను ముఖ్య పాత్ర పోషించ‌నుంది. త‌మిళంలోను ప‌లు ప్రాజెక్టులు చేస్తుంది పాయ‌ల్‌. అయితే సీత సినిమా కోసం పాయల్ రాజ్‌పుత్ ఐటెంగర్ల్‌గా అవతారమెత్తింది. సీత చిత్రం ఏప్రిల్ 25న విడుద‌ల కానున్న నేప‌థ్యంలో పాయ‌ల్ న‌ర్తించిన ‘బుల్‌ రెడ్డి…’ అనే పెప్పీ మాస్‌ సాంగ్‌ని కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఈ పాటలో పాయల్ అభినయం, నృత్యాలు, గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 

Read More