రాజన్న బిడ్డకు ఒక్క అవకాశమివ్వండి: వైఎస్ షర్మిళ

ఈ ఎన్నికల్లో రాజన్న బిడ్డను ఒక్కసారి గెలిపించండి, జగన్ ని సీఎం చేయండి అంటూ వైసీపీ నేత వైఎస్ షర్మిళ ప్రజలను కోరారు. గుంటూరులోని మాయాబజార్ సెంటర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే, జగన్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఓటు వేసే ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఓసారి గుర్తుచేసుకోవాలని షర్మిళ సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఆమె విమర్శలు గుప్పించారు. అవతల పార్టీలో గెలుపొందిన వారిని తమ పార్టీలోకి చంద్రబాబు లాక్కున్నారని, ఇలాంటి రాజకీయ వ్యభిచారం జగన్ చేయలేదని, రాజకీయ విలువలకు ఆయన కట్టుబడి ఉన్నారని ప్రశంసించారు. ప్రజలకు తాను ఉన్నానని భరోసా ఇస్తున్న రాజన్న బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వకూడదా? ప్రజలకు ఇచ్చిన మాట తప్పని వాడు కావాలంటే, మడమ తిప్పని…

Read More

‘జెర్సీ’ కోసం రక్తమోడ్చిన నాని!

సినిమా కోసం, అందులోని పాత్ర కోసం ఎంతైనా కష్టపడే అతి కొద్ది మంది నటుల్లో యువ కథానాయకుడు నాని ఒకరు. అందుకే ఆయన నేచురల్‌ స్టార్‌ అయ్యారు. నాని కథానాయకుడిగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జెర్సీ’. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. ఇందులో నాని అర్జున్‌ అనే 36ఏళ్ల క్రికెటర్‌గా కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం చిత్ర బృందం ‘జర్నీ ఆఫ్‌ జెర్సీ’ పేరుతో వీడియోను అభిమానులతో పంచుకుంది. ఈ సినిమా కోసం నాని ప్రొఫెషనల్‌ క్రికెట్‌ నేర్చుకున్నారు. ఇందుకోసం 70రోజుల పాటు కఠోర సాధన చేశారు. క్రికెట్‌ నిపుణుల సమక్షంలో సాగిన ఈ సాధనలో ఎన్నో మెలకువలు నేర్చుకున్న తర్వాత సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. మైదానంలో తీసే సన్నివేశాలకు నాని, చిత్ర బృందం ఎంత కష్టపడిందో ఈ వీడియోలో చూపించారు. ఒక సన్నివేశంలో నాని…

Read More

మంగళగిరి టూర్.. మగ్గం గుంటలో దిగి చీర నేసిన ఏపీ మంత్రి నారా లోకేశ్!

మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పిస్తామని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇందుకోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏపీ బడ్జెట్ లో రూ.250 కోట్లతో చేనేత మార్కెటింగ్ నిధిని ఏర్పాటుచేయడంతో పాటు చేనేత వస్త్రాల వినియోగం పెరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని రత్నాలచెరువులో టీడీపీ లోక్ సభ అభ్యర్థి గల్లా జయదేవ్ తో కలిసి లోకేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అప్కో పెండింగ్ బకాయిల సత్వర విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చేనేత కుటుంబాలకు ఉచిత ఆరోగ్య బీమా, పిల్లలకు మోడల్ పాఠశాలలతో పాటు అంతర్జాతీయ స్థాయి టెక్స్ టైల్ లెర్నింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. పర్యటనలో భాగంగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా…

Read More