ప్రధాని కేసీఆర్‌

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ను ఈ దేశానికి కాబోయే ప్రధానిగా టీఆర్‌ఎస్‌ ఫోకస్‌ చేస్తోంది. మంత్రులు, పార్టీ ఎంపీ అభ్యర్థులు.. అందరూ దీనిని ఒక ప్రచార నినాదంగా మలుస్తున్నారు. ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో కేసీఆర్‌ సహా నేతలందరి నోటా ఇదే మాట వినిపిస్తోంది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలుండగా, మిత్రపక్షం మజ్లిస్‌ సిటింగ్‌ స్థానం హైదరాబాద్‌ మినహా మిగిలిన 16 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు కార్యరంగంలోకి దూకాయి. అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధిష్ఠానం, సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు కూడా ముగుస్తుండటంతో ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌.. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లింది. జాతీయ అంశాలతో ముడిపడి ఉన్న ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ ‘ప్రధాని కేసీఆర్‌!’ అనే…

Read More

మహేష్ బాబుతో మహేష్ సెల్ఫీ.. ఆసక్తిగా చూస్తున్న ఫ్యాన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు, సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు రూపొందించిన మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ విగ్రహం హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ మల్టిప్లెక్స్‌లో అభిమానులు, మీడియా సందర్శనార్థం ఉంచారు. కొద్ది సేపటి క్రితమే విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి మహేష్ ఫ్యాన్స్ పెద్దఎత్తున తరలి వచ్చి వీక్షించారు. విగ్రహావిష్కరణకు వచ్చిన సూపర్ స్టార్.. తన మైనపు బొమ్మతో సెల్ఫీ దిగుతూ సందడి చేశారు. మైనపు బొమ్మ పక్కన మహేష్ నిల్చొని అచ్చం అదే స్టిల్‌తో ఫోజులిచ్చారు. అయితే ఇద్దరు మహేష్‌లను ఒక్కచోట చూసిన అభిమానులు ఇంతకీ ఎవరు నిజం, ఎవరు విగ్రహం అనేది అర్థంకాక తికమక పడుతున్నారు. ఈ విగ్రహాన్ని ఒక్క రోజు (సోమవారం…

Read More