పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న కేజీఎఫ్ 2

KGF-2

క‌న్న‌డ సినీ ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా రికార్డులు పొందిన మూవీ కేజీఎఫ్‌. పీరియ‌డ్ గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల‌లో విడుద‌ల చేశారు. అంత‌టా ఈ చిత్రానికి భారీ ఆద‌ర‌ణ ల‌భించింది. శాండ‌ల‌వుడ్ చ‌రిత్రలో సరికొత్త రికార్డు నెల‌కొల్పిన ఈ చిత్రానికి సీక్వెల్ ప్రారంభ‌మైంది. తాజాగా బెంగ‌ళూర్ లోని విజ‌య‌న‌గ‌ర్ ప్రాంతంలో ఉన్న‌ కొండండ్రం గుడిలో సీక్వెల్ చిత్రానికి పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి న‌టుడు య‌శ్‌తో పాటు శ్రీనిధి శెట్టి, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌, త‌దితరులు హాజ‌ర‌య్యారు. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని మేక‌ర్స్ అనుకుంటున్నార‌ట‌. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో కేజీఎఫ్ చిత్రాన్ని తెరకెక్కించారు. యువ నటుడు యష్‌ ఈ చిత్రంలో హీరోగా నటించారు. సీక్వెల్‌లోను…

Read More

నేడు కల్వకుంట్ల కవిత పుట్టినరోజు.. ట్విట్టర్ లో స్పందించిన కేటీఆర్!

Kalvkutla-Kavitha

నిజామాబాద్ లోక్ సభ సభ్యురాలు, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో సోదరుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ట్విట్టర్ లో కేటీఆర్ స్పందిస్తూ..‘నా సోదరి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె ఓ పవర్ హౌస్. ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. కవిత సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో మరింతకాలం ప్రజాసేవలో కొనసాగాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు.

Read More