ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టేసిన తెలంగాణ యువతి!

ఇండియాలో యువతకు ఉపాధి లభించడం లేదని, నిరుద్యోగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుందని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని విమర్శలు వెల్లువెత్తున్న వేళ, నైపుణ్యముంటే ప్రభుత్వ ఉద్యోగం రావడం ఎంత సులువో నిరూపించిందో తెలంగాణ యువతి. ఆత్మకూరు (ఎస్) మండలానికి చెందిన నెమ్మికల్‌ గ్రామ యువతి, ఏకంగా రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి, తానెంత చదువుల సరస్వతినో నిరూపించింది. ఎంఎస్సీ బీఈడీ చేసిన జటంగి సువర్ణ అనే యువతి, గురుకుల సైన్స్‌ టీచర్ గా, పంచాయతీ కార్యదర్శిగా ఒకేసారి రెండు ఉద్యోగాలు సంపాదించింది. తాను రాసిన రెండు ప్రవేశ పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో విజయం సాధించింది. నెమ్మికల్‌ లో ఇంటర్ వరకూ, సూర్యాపేటలో డిగ్రీని, ఉస్మానియాలో ఎంఎస్‌సీ ఆపై బీఈడీని పూర్తి చేసిన ఆమె, తాను అటెంప్ట్ చేసిన రెండు ఉద్యోగాలకూ ఎంపికైంది. ఈ…

Read More

Audi కొత్త కారు .. ఒక్కసారి చార్జ్ చేస్తే 450 కిలోమీటర్లు

జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి.. మరో అదిరిపోయే ఎలక్ట్రిక్ కారును మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. దీని పేరు క్యూ4 ఇ-ట్రాన్. జెనీవాలో జరుగుతున్న మోటార్ షో‌లో కంపెనీ ఈ కారు కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. క్యూ4 ఇ-ట్రాన్ ఒక 4 డోర్ ఎస్‌యూవీ. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. మాగ్జిమమ్ ఔట్‌పుట్ 302 బీహెచ్‌పీ. ఇందులో క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది. ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 6.3 సెకన్లలో అందుకుంటుంది. కారును ఒకసారి చార్జ్ చేస్తే 450 కిలోమీటర్లు వెళ్లొచ్చు. గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు. కొత్త కారులో బ్రాండ్ లోగో, సింగిల్ ఫ్రేమ్, ఆక్టాగొనల్ ఫ్రేమ్, పెద్ద ఎయిర్ ఇన్‌లెట్స్, మాట్రిక్స్ ఎల్‌‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, 22 అంగుళాల వీల్స్,పెద్ద క్యాబిన్, వర్చువల్…

Read More

క‌రీంన‌గ‌ర్‌కు కేటీఆర్‌..దారి పొడుగునా జేజేలు..ఘన స్వాగతాలు

K.Tarakaramarao-TRS

కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో టీఆర్‌ఎస్ తొలి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం ఇవాళ జరగనుంది. సన్నాహక సభలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. శామీర్‌పేట నుంచి కేటీఆర్ భారీ ర్యాలీగా కరీంనగర్‌కు బయలుదేరారు. శామీర్‌పేట్‌లో కేటీఆర్‌కు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు బేతి సుభాష్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, పార్టీ జనరల్ సెక్రటరీ మలిపెద్ది సుధీర్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. మహిళలు, కళాకారులు బోనాలతో తరలివచ్చారు. శామీర్‌పేట్ చౌరస్తాలో కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావడంతో జాతీయ రహదారి గులాబీమయమైంది. Tags: KTR, Karimnagar, TRS Workingpresident

Read More

కేసీఆర్ సెంటిమెంట్..ఎంపీలు క్లీన్ స్వీపేనా?

కేసీఆర్ కు దైవభక్తి నమ్మకాలు ఎక్కువ. ఆయన వాస్తును పక్కాగా ఫాలో అవుతుంటారు. వాస్తు సరిగా లేదని.. ఉమ్మడి ఏపీ పాలనలో సీఎం నివాసమైన బేగంపేట భవనాన్ని వదిలేశారు. పంజాగుట్టలో వాస్తు ప్రకారం ప్రగతి భవన్ కట్టుకున్నారు. ఇక సెక్రెటేరియట్ కూడా వాస్తు సరిగా లేదని అటువైపే వెళ్లడం లేదు.విజయాలు సాధించాంటే వాస్తు ప్రకారం వెళ్లాలన్నది కేసీఆర్ నమ్మకం. ఆ నమ్మకంతోనే తను ప్రచారం చేసినా.. ఏదైనా బృహత్తర పని మొదలుపెట్టినా ఆయన ఈశాన్యం నుంచే మొదలుపెడుతారు. ఈశాన్య సెంటిమెంట్ కేసీఆర్ కు అచ్చొచ్చిన ప్రదేశంగా చెబుతారు. CM KCR, MP Elections

Read More

హీరో అవ్వడమే ఒక బోనస్!!

Sharwanand-Birthday

మనిషిగా పుట్టడమే బోనస్ అనుకుంటే.. హీరో అవ్వడం డబుల్ బోనస్!! టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖుడు ఓ సందర్భంలో చెప్పిన మాట ఇది. హీరోకి ఉండే క్రేజు అలాంటిది. జన్మ ఒక్కటే అనుకుంటే అందులో హీరో అయ్యే అవకాశం కూడా ఒక్కటే. అందుకే ఫేజ్ 3 యూత్ చాలా మంది వన్ ఫిలిం వండర్ అయినా అవ్వాలనుకుంటారు. నవతరం హీరోల్లో ట్యాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ అసలు హీరో అవ్వాలనుకున్నాడా? అంటే.. ఆరంభం ఆ ఆలోచన లేకపోయినా.. తనకు ఉన్న ఫేజ్3 కనెక్షన్ దృష్ట్యా హీరో అవ్వాలనుకున్నాడు. అయ్యాడు. అటుపై కెరీర్ పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా నెమ్మదిగా నిలదొక్కుకోగలిగాడు. ఫ్యామిలీ ఆడియెన్ మనసు దోచిన యువహీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు.

Read More