‘మహర్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పీవీపీ సినిమా పతాకాలపై ఈ చిత్రం రూపొందుతోంది. మహేష్‌ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. మహేష్ 25గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మార్చి 15నాటికి రెండు పాట‌లు మిన‌హా షూటింగ్ అంతా పూర్త‌వుతుంది. మ‌రో వైపు శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ఈ సినిమా ఏప్రిల్ 25న విడుద‌ల చేస్తున్నారు. అల్లరి నరేష్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి రాక్‌ స్టార్ దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Read More

చంద్రబాబు మీద కక్షతో కొడుకుని జగన్ కాళ్లపై పడేశారు: దగ్గుబాటిపై వర్ల విసుర్లు

varla-ramaiah

దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన భార్య పురందేశ్వరిలపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. తోడల్లుడు చంద్రబాబు అంటే దగ్గుబాటికి ఈర్ష్య అని అన్నారు. చంద్రబాబు సీఎం కావడంతో దగ్గుబాటికి నిప్పుల కుంపటి మీద కూర్చున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మీద కక్షతోనే వైసీపీ అధినేత జగన్ కాళ్లపై తన కొడుకును పడేశారని విమర్శించారు. చంద్రబాబు వింతజీవి అంటున్నారని… వింతజీవి ఎలాగో చెప్పాలని అన్నారు. దగ్గుబాటి, పురందేశ్వరిలు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలంటూ హితవు పలికారు. Tags: Chandrababu, Jagan, Daggubati

Read More

జగన్‌ ధ్యాసంతా ప్యాలెస్‌లపైనే

వైకాపా పేదల పార్టీ కాదని.. ప్యాలెస్‌ల పార్టీ అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. హైదరాబాద్ వీడి జగన్మోహన్ రెడ్డి రాలేదని.. ప్యాలెస్‌ ఉంటే తప్ప ఇక్కడ నివసించలేరని దుయ్యబట్టారు. ఎక్కడికి వెళ్లినా రాజ ప్రసాదాల్లోనే జగన్ బస చేస్తారని విమర్శించారు. లోటస్ పాండ్, బెంగళూరు ప్యాలెస్‌, పులివెందుల ప్యాలెస్‌లకు తోడు ఇప్పుడు అమరావతిలో ఇంకో ప్యాలెస్‌ ఏర్పడిందన్నారు. జగన్‌ ధ్యాసంతా ప్యాలెస్‌లపైనే ఉందని.. ప్రజాసేవ పట్ల చిత్తశుద్ది లేదని విమర్శించారు. ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, పార్టీ బాధ్యులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజధాని విషయంలో వైకాపా ప్రజల్లో అనుమానాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. అందరికీ అందుబాటులో రాష్ట్రం నడిబొడ్డున ఉన్న అమరావతిపై ప్రజల్లో అపోహలు పెంచుతారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు వైకాపా తన మేనిఫెస్టోలో రాజధాని ఎక్కడ అనే అంశం పెట్టి తన దుర్బుద్ధిని బయటపెట్టిందని మండిపడ్డారు.…

Read More

ర‌జ‌నీ, క‌మ‌ల్‌లు ప‌ని చేస్తే అద్భుతం ఖాయం: విశాల్

త‌మిళనాట ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ మ‌ధ్య కాలంలో వీరిద్ద‌రు రాజ‌కీయాల‌లోకి వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రచారు. అయితే క‌మ‌ల్ ఇప్ప‌టికే మక్కల్‌‌ నీది మయ్యం‌ అనే పార్టీని స్థాపించి రాజ‌కీయాల‌లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ర‌జనీకాంత్ మాత్రం ఇప్ప‌టికి పార్టీ పేరు, కార్యాచ‌ర‌ణ‌ని ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం. ఇటీవ‌ల తాను రానున్న లోక్ స‌భ‌లో పోటీ చేయ‌న‌ని చెప్పడంతో పాటు ఏ పార్టీకి స‌పోర్ట్ చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించాడు ర‌జ‌నీకాంత్‌. ‘రజనీ మక్కల్‌ మండ్రమ్‌’ అనే అభిమాన సంఘం పేరిట తన రాజ‌కీయ కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్న తలైవా అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తాన‌ని అన్నాడు. అయితే లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో క‌మ‌ల్‌, ర‌జనీకాంత్ క‌లిసి పోటీ చేస్తే బాగుంటుంద‌ని విశాల్ అభిప్రాయ‌ప‌డుతున్నాడు. వారిద్ద‌రు క‌లిసి త‌మిళ‌నాడుకి మంచి జ‌రుగుతుంద‌ని అంటున్నాడు.…

Read More

నేటినుంచి ఇంటర్ పరీక్షలు

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9.42 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగనున్నా యి. గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి హాజరుకావాలని విద్యార్థులకు బోర్డు అధికారులు సూచించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అప్‌లోడ్ చేశామని, అవసరమైన వారు డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఫీజుల కోసం హాల్‌టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెట్టాలని చూసిన ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు సెక్రటరీతో మంత్రి సమీక్ష ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి బోర్డు సెక్రటరీ అశోక్ తో…

Read More