ఉత్కంఠను రేపుతోన్న ‘నాగకన్య’ ట్రైలర్

తమిళంలో ‘నీయా’ పేరుతో ఒక సినిమాను రూపొందిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ .. రాయ్ లక్ష్మి .. కేథరిన్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇక హీరో ‘జై’ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. నాగుపాము నేపథ్యంలో సాగే ఈ సినిమాను తెలుగులో ‘నాగకన్య’ పేరుతో విడుదల చేయనున్నారు. సురేశ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా వుంది. కేథరిన్ ను నాగుపాము వెంటాడటం .. పామును ‘జై’ ప్రేమగా హత్తుకోవడం .. వరలక్ష్మి శరత్ కుమార్ .. రాయ్ లక్ష్మి పాములుగా మారిపోవడం .. ముగ్గురు కథానాయికలకు ‘జై’ తాళి కడుతుండటం .. శత్రువులపై పాము వరుసగా దాడి చేయడం .. ‘పగటి వేళ…

Read More

ఆరంభం.. అదుర్స్

priyanka gandhi

రాజు వెడలె రవి తేజములదరగా.. అనే రీతిలో కాంగ్రెస్ భవిష్యత్ ఆశాకిరణం, యువనేత ప్రియాంక గాంధీ (47) సోమవారం అట్టహాసంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో అడుగుపెట్టారు. ఏఐసీసీ కార్యదర్శిగా, యూపీ తూర్పు ప్రాంత ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి యూపీకి వచ్చిన ప్రియాంకకు అడుగడుగునా పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి. సాదాసీదా వస్త్రధారణతో, మోములో చిరునవ్వుతో, ఆద్యంతం కార్యకర్తలకు, ప్రజలకు అభివాదం చేస్తూ శ్రేణుల్లో ప్రియాంక జోష్ నింపారు. తన నాయనమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీని తలపించారు. సోదరుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమ యూపీ ఇన్‌చార్జి జ్యోతిరాదిత్య సింధియాలతో కలిసి బస్సు టాప్‌పై నిలబడి ప్రియాంక మెగా రోడ్‌షోలో పాల్గొన్నారు. లక్నోలోని చౌదరీ చరణ్‌సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర రోడ్‌షో భారీ ఎత్తున…

Read More