ప్రజారాజ్యం విలీనం గంటా పుణ్యమేనట!

కోపంలోనో.. ఆవేశంలోనో.. కొందరు అధినేత నోటి నుంచి వచ్చే మాటలు యమా ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోటి నుంచి వచ్చిన మాటలు కూడా ఇదే కోవకు చెందినవని చెప్పాలి. గుంటూరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంలో ఆయన సభ ఏర్పాటు చేశారు. ఇందులో మాట్లాడిన పవన్.. ప్రజారాజ్యం విలీన అంశాన్ని ప్రస్తావించారు. గడిచిన కొద్ది రోజులుగా ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ పై ఒంటికాలిపై విరుచుకుపడుతున్న పవన్.. మరోసారి ఆయన్ను టార్గెట్ చేశారు. 2014 ఎన్నికల్లో తన మద్దతుతో గెలిచిన గంటా శ్రీనివాసరావు ఇప్పుడు తనపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో చూడండండి అంటూ చెప్పిన పవన్.. మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. Tags: Prajarajyam, Pawan kalyan

Read More

షూటింగ్‌లో గాయపడ్డ నాని

నేచురల్ స్టార్ నాని షూటింగ్‌లో గాయపడ్డారు. ‘జెర్సీ’ సినిమా షూటింగ్‌లో భాగంగా నానికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో క్రికెటర్ అర్జున్‌గా కనిపించబోతున్నారు నాని. క్రికెట్ నేపధ్యం ఉన్న ఈ సినిమాలో కీలకమైన సన్నివేశం తెరకెక్కిస్తున్న సందర్భంలో నాని ముక్కుకి క్రికెట్ బంతి తగిలినట్టు తెలుస్తోంది. అయితే నాని ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని.. గాయం చిన్నదే కావడంతో కాసేపు రెస్ట్ తీసుకుని నాని తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నట్టు సమాచారం. Tags: Nani, Accident, Jersy

Read More

టీడీపీ, వైసీపీలను ప్రజలు నమ్మరు: కేఏ పాల్‌

రాష్ట్రాన్ని సింగపూర్‌ చేస్తానన్న చంద్రబాబే ఆ విషయంలో విఫలమయ్యారని, ఇక వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఏం చేస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ విమర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆదివారం పార్టీ కన్వీనర్ల అత్యవసర సమావేశాన్ని ఆయన నిర్వహించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ అధికార, ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లక్షల కోట్లు దోచుకొని ఒకరినొకరు విమర్శించుకుంటున్న టీడీపీ, వైసీపీలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు.బీజేపీలో చేరిన బాలీవుడ్ హీరోయిన్. Tags: KA Paul, YCP, TDP

Read More

ప్రకాశం జిల్లాపై వైసీపీ బ్రహ్మాస్త్రం

ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలపై వైసీపీ కన్నేసిందా? రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసేందుకు యత్నిస్తోందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జగన్ ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా ఆయన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందం రాష్ట్రమంతటా పర్యటించింది. వైసీపీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజల అభిప్రాయాన్ని సేకరించింది. ఈ నేఫథ్యంలో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి ఈ సారి వైవీ సుబ్బారెడ్డిని కాకుండా వైఎస్ షర్మిలను పోటీకి దించాలని ప్రతిపాదించింది. Tags: YCP party , YS sharmila, Prakasamdistirct

Read More