లక్ష్మీస్ ఎన్టీఆర్: ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది

రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. అయితే ఇప్పటి వరకు లక్ష్మీ పార్వతి, చంద్రబాబు పాత్రలకు సంబంధించిన న‌టుల‌ను పరిచయం చేసిన వర్మ తాజాగా.. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాడు. ఇవాళ సాయంత్రం 5 గంటలకే రిలీజ్ చేయాల్సి ఉన్నా… ఎన్టీఆర్‌కు ఉన్న విశ్వాసాల మీద గౌరవంతో ఆయన లక్కీ నెంబర్ 9 కలిసే విధంగా సాయంత్రం 6.57 గంటలకు లక్ష్మీస్ ఎన్టీఆర్‌లోని ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేశాడు వర్మ. వెన్నుపోటు ద్వారా చంపబడిన ఎన్టీఆర్ మళ్లీ లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపంలో బతికి వ‌చ్చారంటూ వర్మ ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశాడు. Tags: RGV, Lakshmi NTR, NTR, Lakshmiparvathi

Read More

విజయ్ దేవరకొండ సినిమాలో అనసూయ

వెండితెర వైపు నుంచి అనసూయకి వస్తోన్న అవకాశాల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. తనకి నచ్చిన పాత్రలను ఓకే చేస్తూ ఆమె ముందుకు వెళుతోంది. తాజాగా ‘ఎఫ్ 2’ సినిమాలో అలరించిన అనసూయ .. త్వరలో ‘యాత్ర’ సినిమాతోను పలకరించనుంది. ఈ నేపథ్యంలో ఆమె విజయ్ దేవరకొండ సినిమాలోను చేయనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. Tags: Vijaydevarakonda, Anasuya, Anchors Anasuya

Read More

శృంగార తార పాత్రలో నటి రమ్యకృష్ణ

ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే నటి రమ్యకృష్ణ. ప్రేమికురాలిగా, గృహిణిగా, చలాకీ అమ్మాయి వంటి పాత్రల నుంచి ‘బాహుబలి’లో శివగామి పాత్ర వరకు తన నటనా భినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నటి రమ్యకృష్ణ. ప్రస్తుతం వరుస సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లో బిజీగా ఉన్న రమ్యకృష్ణ ఓ ఆసక్తికర పాత్రలో నటించేందుకు సాహసించింది. ఓ తమిళ సినిమాలో పోర్న్ స్టార్ పాత్రలో ఆమె కనిపించనున్నారు. ప్రముఖ హీరో విజయ్ సేతుపతి, సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘సూపర్ డీలక్స్’. Tags: Ramyakrishna, Pornstar, super delux, Ramya

Read More

కోల్‌కతాలో ‘యునైటెడ్ ఇండియా బ్రిగేడ్’ ర్యాలీ

brigade-didi-2

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నిర్వహిస్తున్న ‘యునైటెడ్ ఇండియా బ్రిగేడ్’ ర్యాలీ శనివారం ప్రారంభమైంది. బీజేపీ యేతర పార్టీల నేతలు ఈ ర్యాలీకి హాజరయ్యారు. చంద్రబాబు, అఖిలేష్‌యాదవ్, స్టాలిన్, శరద్‌పవార్, దేవేగౌడ, కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా, యశ్వంత్‌సిన్హా, తేజస్వీయాదవ్, హార్దిక్‌పటేల్, జిఘ్నేశ్, శరత్‌యాదవ్, శతృఘ్నసిన్హా, కుమారస్వామి, అరుణ్‌శౌరి, మల్లికార్జునఖర్గే, హేమంత్ సొరేన్, అభిషేక్ సింఘ్ని తదితరులు హాజరయ్యారు. అలాగే పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. Tags: Mamatha, United, Kolkatha

Read More