కేసీఆర్ ఒక గిఫ్ట్ ఇస్తే మేం మూడు గిఫ్ట్‌లు ఇస్తాం: చంద్రబాబు

కేసీఆర్ ఒక గిఫ్ట్ ఇస్తే. తాము మూడు గిఫ్ట్‌లు ఇస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తామేమీ చేతకానివారం కాదని అన్నారు. మనతో ప్రధాని మోదీ మంచిగా ఉన్నంతవరకు కేసీఆర్ కూడా మంచిగానే ఉన్నారని అన్నారు. ఎన్డీయే నుంచి బయటకు రావడంతో కేసీఆర్ కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. Tags: cm kcr, CM Chandrababu, ReturnGigt

Read More

సీఎం కేసీఆర్‌కు బెంగాల్‌ సీఎం మమత ఫోన్

సీఎం కేసీఆర్‌కు బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ ఫోన్‌ చేశారు. కోల్‌కతా ర్యాలీకి రావాలని కేసీఆర్‌ను ఆహ్వానించారు. కాంగ్రెస్‌, చంద్రబాబు పాల్గొనే ర్యాలీకి కేసీఆర్ దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలిసింది. రేపు కోల్‌కతాలో బీజేపీయేతర పార్టీల ర్యాలీ నిర్వహించనున్నారు. Tags: cm kcr, Mamata banerjee

Read More

భారతీయుడు2: సేనాపతి మనవడిగా హీరో సిద్ధార్థ్!

ఇండియన్ 2’ పేరుతో హిందీ, తమిళంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ‘భారతీయుడు 2’ పేరుతో తెలుగులో విడుదలకానుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ పక్కన కథానాయిక కాజల్ అగర్వాల్ ఆడిపాడనుంది. సినిమాలో యంగ్ హీరో సిద్దార్థ్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. కథాపరంగా ‘భారతీయుడు2’ సినిమాలో కమల్‌ హాసన్‌కి మనవడి పాత్ర చాలా కీలకమట. ఆ పాత్ర కోసం పలువురు తమిళ కథానాయకుల్ని పరిశీలించిన దర్శకుడు శంకర్‌.. చివరికి సిద్ధార్థ్‌ను ఖరారు చేశారని ప్రచారం సాగుతోంది. బాలీవుడ్‌కు చెందిన మరో ప్రముఖ హీరో కూడా మరో కీలక పాత్రలో మెరవనున్నారట. త్వరలో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి Tags: Indian2, Sidhartha, Kamalhasan, Shankar

Read More

ఎన్టీఆర్‌ 23వ వర్థంతి: కుటుంబ సభ్యుల ఘన నివాళి

నేడు (జనవరి 18) విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 23వ వర్థంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించినవారిలో ఆయన కుమారులు నందమూరి రామకృష్ణ, నందమూరి బాలకృష్ణతోపాటు.. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బ్రాహ్మణి, నందమూరి సుహాసిని ఉన్నారు. హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ తెల్లవారుజామునే వచ్చి నివాళులు అర్పించగా.. ఆ తర్వాత మిగతా కుటుంబ సభ్యులు వచ్చి నివాళులు అర్పించారు. Tags: NTR, Balakrishna, TDP , Legendery NTR

Read More

Mr Majnu: అఖిల్ సినిమా వేడుకకు చీఫ్ గెస్ట్‌గా ఎన్టీఆర్

ఇటీవల కాలంలో తెలుగు యువ హీరోల మధ్య స్నేహబంధం బలపడుతోంది. ఒకరి ఫంక్షన్‌కు మరొకరు రావడం, ఒకరి సినిమాకు మరొకరు వాయిస్ ఓవర్ ఇవ్వడం, అప్పుడప్పుడు కలిసి పార్టీలు చేసుకోవడం తరుచూ చూస్తూనే ఉంటున్నారు. ఇప్పుడు అక్కినేని వారసుడు అఖిల్ సినిమా ఫంక్షన్ కోసం నందమూరి వారసుడు ఎన్టీఆర్ వస్తున్నారన్న వార్త ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. Tags: Mr.Majnu, Akhil, NTR,

Read More