ఆ తండాకు సీఎం కేసీఆర్ పేరు

ఆ తండా వాసులు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మారుస్తూ 2018 ఆగస్టు 2వతేదీన అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటన చేసింది. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై గిరిజన తండా వాసులు ప్రత్యేక అభిమానాన్ని చాటుతున్నారు. ఏన్నో ఏళ్లుగా ‘మా తండాలో మా రాజ్యం’ అంటూ నినదిస్తున్న గిరిజనులు టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తుండగా… ప్రభుత్వాధినేత అయిన కేసీఆర్ పేరును ఓ తండాకు ఏర్పాటుచేసుకోవడం విశేషం. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలో ఓ తండాకు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు పెట్టుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Read More

గ్రామాభివృద్ధి చేయడమే నా తప్పా?

Nara-Lokesh-s-Tweet-Challenge

ఘనమైన రాజకీయ వారసత్వం గల కుటుంబం నుంచి వచ్చిన నాపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. తాత ఎన్టీఆర్‌ ఆశయ సాధనలో భాగంగా తండ్రి చంద్రబాబు అడుగు జాడల్లో ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయాల్లో ప్రవేశించాను. గ్రామాలను అభివృద్ధి చేయడమే నేను చేసిన తప్పా? ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ రంగంలో ప్రపంచ మొత్తం ఏపీ వైపు చూసేలా ప్రగతి మార్గంలో పయనింపచేయడమే నేను చేసిన నేరమా?’’ అంటూ మంత్రి లోకేశ్‌ ఆగ్రహంతో ప్రశ్నించారు. కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గం ముష్టికుంట్లలో జరిగిన జన్మభూమి గ్రామ సభలో ఆయన మాట్లాడారు. ‘‘విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా ప్రధాని మోదీ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారు.

Read More

ఈ నెల 13న కీలక ప్రకటన చేయనున్న పవన్

pawan-kalyan

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈనెల 13న తెనాలి రానున్నట్లు ఆ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకుని పెదరావూరులోని వ్యవసాయ క్షేత్రంలో జరిగే భోగి పండుగ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. ఇందుకు సంబంధించి పెదరావూరు వ్యవసాయ క్షేత్రంలో చేయనున్న ఏర్పాట్లను సోమవారం కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. రైతులు, మహిళలు యువతతో పవన్‌ భేటి అవుతారని రైతాంగ సమస్యలపై ఆయన కీలక ప్రకటన చేయనున్నారని మనోహర్‌ చెప్పారు.ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.

Read More

రిజర్వేషన్లు లేకుండానే ఆమె రాణించారు

indira-nitin

మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసల వర్షం కురిపించారు. రిజర్వేషన్ల అవసరం లేకుండానే ఇందిరా గాంధీ తన ప్రతిభను నిరూపించుకున్నారని, పురుష నాయకుల కంటే ఆమె ఎంతో గొప్పగా పనిచేశారని కొనియాడారు. మహిళా రిజర్వేషన్లను తాను వ్యతిరేకించడం లేదని, కుల, మతాల ఆధారంగా రాజకీయాలు చేయడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నానని గడ్కరీ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన నాగ్‌పూర్‌లో మహిళా స్వయంశక్తి సంఘాల ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎమర్జెన్సీని విధించినందుకు ఇందిరా గాంధీని బీజేపీ విమర్శిస్తుంటే.. మరో వైపు గడ్కరీ ఆమెను ప్రశంసించడం చర్చనీయాంశమయింది. కాంగ్రెస్ పార్టీలో ఇందిరా గాంధీ తన ప్రతిభను నిరూపించుకుని అంకితభావం కలిగిన పురుషుల కంటే ఎంతో గొప్పగా పనిచేశారు. ఇందుకు రిజర్వేషన్లు కారణమా? కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే,…

Read More

మనమే నిర్ణయాత్మక శక్తి

KTR-TRS-Hero

లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించి 16 సీట్లలో గెలిపిస్తే ఢిల్లీ గద్దెనెక్కేది ఎవరో నిర్ణయించేది తెలంగాణ ప్రజలేనని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. యాచించేస్థాయి నుంచి శాసించేస్థాయికి ఎదుగాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యమన్న కేటీఆర్.. రాజకీయాల్లో కుర్చీలు శాశ్వతం కాదని, ఏ కుర్చీపైనా ఎవరి పేరూ శిలాక్షరాలతో చెక్కి ఉండదని చెప్పారు. టీఆర్‌ఎస్‌ది పేదల ప్రభుత్వమన్నారు. ఎన్నికల్లో గెలిచినందుకు గర్వపడవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. వచ్చే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణభవన్‌లో వేర్వేరు కార్యక్రమాల్లో రామగుండం స్వతంత్ర ఎమ్మెల్యే కొరుకంటి చందర్, దాదాపు మూడువేల మంది ఆయన అనుచరులు, నాగార్జునసాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు భగవాన్ నాయక్, లక్ష్మారెడ్డి, అబ్బాస్‌లు కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

Read More