క్రిస్మస్ తాత వేషంలో చిన్నారులకు కానుకలు తీసుకువచ్చిన విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. అందుకే తన పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేసి సమాజానికి తనవంతు సేవలు అందిస్తుంటాడు. తాజాగా కోహ్లీ నిరుపేద బాలబాలికల కోసం క్రిస్మస్ తాత అవతారమెత్తాడు. క్రిస్మస్ పర్వదినం రానున్న నేపథ్యంలో అనాథ చిన్నారుల ముఖాల్లో వెలుగులు నింపేందుకు కోహ్లీ తనవంతుగా కాస్త సమయం కేటాయించాడు. క్రిస్మస్ తాత శాంటాక్లాజ్ వేషంలో వచ్చిన కోహ్లీ కోల్ కతాలోని ఓ అనాథాశ్రమం చిన్నారులకు అనేక కానుకలు తీసుకువచ్చాడు. క్రిస్మస్ తాతలా ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ ఆపై మేకప్ తీసేయడంతో బాలబాలికలు ఆనందోత్సాహాలతో ఒక్కసారిగా చుట్టుముట్టారు. కోహ్లీ కూడా వారితో ఎంతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ పండుగను ముందే సెలబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

Read More

మంత్రి కేటీఆర్‌ను కలిసిన కపిల్‌ దేవ్‌

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ ఇవాళ ఉదయం జీహెచ్‌ఎంసీ ఆఫీసులో కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కేటీఆర్‌తో కపిల్‌ దేవ్‌ చర్చించారు. ఈ భేటీలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డితో పాటు పలువురు ఉన్నారు.

Read More

సానియామీర్జా చెల్లెలి పెళ్లి…వరుడు ఎవరంటే…

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెల్లెలైన ఆనంమీర్జా పెళ్లి కూతురు కానుందా? అవునంటున్నారు ఆనంమీర్జా తన ఇన్ స్టాగ్రాం పోస్టులో… హైదరాబాద్ : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెల్లెలైన ఆనంమీర్జాను భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు అసద్ పెళ్లాడనున్నట్లు సమాచారం. అసద్,ఆనందమీర్జాల వివాహం ఈ ఏడాది డిసెంబరులో స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో జరగనుందని వెల్లడైంది. గతంలో ఆనం, అసద్ లు చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో వారిద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ పుకార్లు షికారు చేశాయి. ఎట్టకేలకు ఆనంమీర్జా తాను ‘‘కాబోయే వధువు’’అంటూ తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. గతంలోనూ ఆనం, అసద్‌లు తాము చెట్టాపట్టాలేసుకొని దుబాయ్‌లో తిరిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. గతంలో అసద్, ఆనంలు ఒకరికొకరు జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తన జీవితంలో అసద్ అత్యంత అద్భుతమైన వ్యక్తి అంటూ…

Read More

టెన్నిస్‌ ఆడితే పెండ్లి కాదన్నారు : సానియా

టెన్నిస్‌ ఆడడం ఆపాలని, లేకపోతే ఆరుబయట ఆడటం వల్ల చర్మం నల్లబడి ఎవరూ పెండ్లి చేసుకోరని చిన్నప్పుడు తనకు కొందరు సలహాలు ఇచ్చారని భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా వెల్లడించింది. అమ్మాయి అంటే తెల్లగా ఉండాలన్న భావన సమాజంలోని చాలామందిలో పాతుకుపోయిందని, ఇలాంటి సంస్కృతి మారాలని చెప్పింది. చిన్నప్పటి నుంచే ఆటలు ఆడేలా బాలికలను ప్రోత్సహించాలని సూచించింది. గురువారమిక్కడ జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సులో భాగంగా జరిగిన మహిళలు – నాయకత్వం అనే అంశం చర్చలో సానియా మీర్జా మాట్లాడింది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ వైఫల్యానికి తాను విమర్శలను ఎదుర్కొన్న అంశంపై ప్రశ్నించగా..‘నేను పాక్‌ జట్టులో లేను అలాంటప్పుడు గెలిపించేందుకు నాకెలాంటి శక్తులు కల్గి ఉండాలో అర్థం కావడం లేదు. విరాట్‌ కోహ్లీ డకౌట్‌ అయితే అతని భార్య అనుష్క శర్మను నిందించారు. అలా వ్యక్తిగత విమర్శలు…

Read More

గేల్ దుమారం… 54 బంతుల్లో 122 పరుగులు

క్రికెట్ లో అందునా పొట్టి ఫార్మాట్ లో యూనివర్శల్‌ బాస్‌ గా పేరు తెచ్చుకున్న క్రిస్‌ గేల్‌ మరోసారి తన మెరుపులు చూపించాడు. ప్రస్తుతం గ్లోబల్‌ టీ-20 కెనడాలో వాంకోవర్ నైట్స్‌ తరఫున ఆడుతున్న గేల్‌, నిన్న జరిగిన మ్యాచ్ లో కేవలం 54 బంతుల్లో 122 పరుగులు సాధించాడు. ఇందులో 12 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. మాంట్రియల్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ, ఆకాశమే హద్దుగా గేల్ సాగిపోయాడు. తొలి వికెట్‌ కు విస్సేతో కలిసి 63 పరుగులు, రెండో వికెట్ కు చెడ్విక్‌ వాల్టన్‌ తో కలిసి 139 పరుగుల భాగస్వామ్యాన్ని గేల్ నెలకొల్పాడు. దీంతో వాంకోవర్ జట్టు 20 ఓవర్లలో 276 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. టీ-20 చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. గత సంవత్సరం ఐర్లాండ్ తో…

Read More