నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన సీఎం జగన్‌..

అక్రమాస్తుల కేసు విషయమై నాంపల్లి సీబీఐ కోర్టుకు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఆయనతో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన కూడా హాజరయ్యారు. అయితే సీఎం హోదాలో జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావడం ఇదే తొలిసారి. సీఎం హోదాలో కోర్టుకు హాజరుకావడంపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతోంది. రెండు గంటల పాటు జగన్‌ కోర్టులోనే ఉండనున్నారు. గత ఏడాది మార్చి నుంచి జగన్‌ కోర్టుకు హాజరు కావడం లేదు. సీబీఐ కోర్టు జడ్జి ఆదేశంతో కోర్టుకు జగన్‌ హాజరయ్యాడు. సీబీఐ కోర్టు జడ్జి తదుపరి ఆదేశంపై వైసీపీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Read More

ఒక రేంజ్ లో జరిగిన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ బిజినెస్

విడుదలకి ముస్తాబవుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ కీలకమైన పాత్రలో విజయశాంతి ప్రపంచ వ్యాప్తంగా 101.05 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మహేశ్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రూపొందింది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో విజయశాంతి ఒక కీలకమైన పాత్రను పోషించారు. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను జనవరి 11వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. క్రేజీ కాంబినేషన్ కావడం వలన .. పండుగ సీజన్ కావడం వలన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 77.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 101.05 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. రాజేంద్ర ప్రసాద్ .. ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రలను పోషించిన ఈ…

Read More

కృష్ణకు దాదా సాహెబ్… అల్లు అరవింద్ కు పద్మశ్రీ…

సూపర్ స్టార్ కృష్ణ దాదాపుగా 500 వరకు సినిమాలు చేశారు. ఎన్నో గొప్ప గొప్ప టెక్నాలజీని ఇండస్ట్రీకి అందించారు. సినిమా స్కోప్, కలర్, ఇలా ఎన్నో రకాల ఆవిష్కరణ తీసుకొచ్చారు. కానీ ఆయనకు అందాల్సిన గౌరవం ఇప్పటి వరకు అందలేదు. సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందిస్తూ ఉంటుంది. ఈ ఏడాది అమితాబ్ కు దాదాసాహెబ్ అవార్డు అందించారు. కాగా, కృష్ణకు కూడా ఈ అవార్డు ఇచ్చేలా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సిఫారసు చేయాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. ఇక ఇదిలా ఉంటె, అల వైకుంఠపురం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ కు పద్మశ్రీ అవార్డు ఇచ్చేలా తెలుగు ప్రభుత్వాలు కృషి చేయాలని యూనిట్ కోరింది. మెగాస్టార్, అల వైకుంఠపురంలో యూనిట్…

Read More

విశాఖకు షిఫ్ట్ అవుతున్న జగన్.. ఇంటి స్థలం కోసం అన్వేషిస్తున్న వైసీపీ!

ఏపీ రాజధాని విశాఖకు తరలిపోతే… ముఖ్యమంత్రి జగన్ నివాసం ఎక్కడుండాలనే అంశాన్ని వైసీపీకి చెందిన కొందరు ముఖ్యనేతలు పరిశీలిస్తున్నారు. జగన్ శాశ్వత నివాసం కోసం భీమిలి, కాపులుప్పాడ, తిమ్మాపురం, మధురవాడ, రుషికొండ ప్రాంతాల్లో స్థలాల కోసం అన్వేషిస్తున్నారు. నగర శివారులోని ఏదైనా కొండపై నివాసం ఉంటే సహజసిద్ధమైన భద్రత ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు, ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో సీఎం కొన్ని నెలల పాటు అద్దె ప్రాతిపదికన ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా బీచ్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఓ స్టార్ హోటల్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు సమాచారం. ఇంకోవైపు, భీమిలి-విశాఖ మార్గంలో ఓ విద్యాసంస్థకు కొన్ని భవనాలు ఉన్నాయి. వీటిని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

Read More

హృదయం ద్రవించింది… వాళ్లను శిక్షించాల్సిందే: రామ్ గోపాల్ వర్మ

ఇటీవలి కాలంలో పెరిగిన అత్యాచారాలు, వేధింపులు, అమ్మాయిల ఆత్మహత్యలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఘటనలపై అసహనాన్ని వ్యక్తం చేశారు. దిశ హత్యాచారాన్ని మరువక ముందే ఇంకో యువతి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న భయానక సంఘటనను గురించి తెలుసుకుని తన హృదయం ద్రవించిందన్నారు. ఇటువంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షించాల్సిందేనని చెప్పారు. ఇందుకోసం ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని కోరారు.

Read More