టీఆర్‌ఎస్‌దే హవా

 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే క్లీన్‌స్వీప్. పదహారు ఎంపీ స్థానాల్లో విజయఢంకా మోగించనున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీమెజార్టీతో రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకొన్న గులాబీ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ తన హవా కొనసాగించనున్నదని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టంచేశాయి. రాష్ట్రంలో ఎంపీ సీట్లన్నింటినీ టీఆర్‌ఎస్ ఏకపక్షంగా గెలుచుకోబోతున్నదని జాతీయసంస్థలు నిర్వహించిన అన్ని ఎగ్జిట్‌పోల్స్ పేర్కొన్నాయి. 45 శాతానికి పైగా ఓటర్లు టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికారని తెలిపాయి. 17 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ 16 స్థానాలను గెలుచుకుంటుందని హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) ప్రతినిధి వేణుగోపాలరావు పేర్కొన్నారు. మరోస్థానంలో ఎంఐఎందే విజయమని తెలిపారు.

Read More

ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ప్రశ్నకు నటుడు ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అభివృద్ధికి, ప్రభుత్వ వ్యతిరేకతకు మధ్య జరగలేదని, వ్యక్తిగత నిందారోపణలు, పరస్పర అభియోగాలు, నేతల మధ్య విభేదాలు ప్రాతిపదికన జరిగాయని తాను భావిస్తున్నట్టు నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా, “ఏపీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారని భావిస్తున్నారు?” అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. తనకు ఏపీ ఎన్నికల్లో పరిస్థితి ఏంటన్న విషయమై క్షేత్రస్థాయిలో అవగాహన లేదని, అయితే, అత్యధికులు చంద్రబాబుకు గతంలో వచ్చినంత మెజారిటీ రాకపోవచ్చని అంటున్నారని, ఇదే సమయంలో జగన్ చాలా ఎదిగారని చెబుతున్నారని అన్నారు. ఓ విజన్ ఉన్న నాయకుడైన చంద్రబాబు, తన విజన్ ను ఈ ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందుకు తీసుకు రాలేదని భావిస్తున్నట్టు చెప్పారు.

Read More

కేసీఆర్ సెంటిమెంట్..ఎంపీలు క్లీన్ స్వీపేనా?

కేసీఆర్ కు దైవభక్తి నమ్మకాలు ఎక్కువ. ఆయన వాస్తును పక్కాగా ఫాలో అవుతుంటారు. వాస్తు సరిగా లేదని.. ఉమ్మడి ఏపీ పాలనలో సీఎం నివాసమైన బేగంపేట భవనాన్ని వదిలేశారు. పంజాగుట్టలో వాస్తు ప్రకారం ప్రగతి భవన్ కట్టుకున్నారు. ఇక సెక్రెటేరియట్ కూడా వాస్తు సరిగా లేదని అటువైపే వెళ్లడం లేదు.విజయాలు సాధించాంటే వాస్తు ప్రకారం వెళ్లాలన్నది కేసీఆర్ నమ్మకం. ఆ నమ్మకంతోనే తను ప్రచారం చేసినా.. ఏదైనా బృహత్తర పని మొదలుపెట్టినా ఆయన ఈశాన్యం నుంచే మొదలుపెడుతారు. ఈశాన్య సెంటిమెంట్ కేసీఆర్ కు అచ్చొచ్చిన ప్రదేశంగా చెబుతారు. CM KCR, MP Elections

Read More

సిద్ధిపేటలో బావిలో పడ్డ కారు… వైజాగ్ వాసులకు తీవ్ర గాయాలు!

సిద్ధిపేట సమీపంలో అదుపుతప్పిన ఓ కారు రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోగా, విశాఖపట్నం ప్రాంతానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన నేటి తెల్లవారుజాము సమీపంలో జరిగింది. సిద్దిపేట రూరల్ మండలం గుర్రాలగొంది గ్రామ శివారు ప్రాంతంలో ఘటన జరుగగా, గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విశాఖ జిల్లాకు చెందిన కొందరు ఓ శుభకార్యం నిమిత్తం సిద్దిపేటకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. తాను వేగంగా నడుపుతున్న కారును డ్రైవర్ నియంత్రించలేక పోయాడని, దీంతో రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో అది పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.

Read More

తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేటాయింపులు ఇవే..

Telangana Budget 2019-20 తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. రూ.లక్షా 82,017 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను సీఎం ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.లక్షా 31,629 కోట్లు, ఆర్థికలోటు- రూ.27,749 కోట్లు, రెవెన్యూ మిగులు- రూ.6,564 కోట్లు, ప్రగతి పద్దు- రూ.లక్షా 7,302 కోట్లు, నిర్వహణ పద్దు- రూ.74,715 కోట్లు, రూ. 2లక్షల కోట్లు దాటని తెలంగాణ బడ్జెట్. బడ్జెట్ కేటాయింపులు: రైతు రుణమాఫీకి రూ.6వేల కోట్లు రైతు బంధుకు రూ.12 వేల కోట్లు రైతు బీమా రూ.650 కోట్లు మిషన్‌ కాకతీయకు రూ.22,500 కోట్లు పంటకాలనీల అభివృద్ధికి రూ.20,107 కోట్లు నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు ఎస్సీల అభివృద్ధికి రూ.16,581 కోట్లు ఎస్టీల అభివృద్ధికి రూ.9,827 కోట్లు మైనార్టీల సంక్షేమానికి రూ.2004 కోట్లు ఈఎన్‌టీ, దంత పరీక్షలకు రూ.5,536 కోట్లు ఆసరా…

Read More