చంద్రబాబు మీద కక్షతో కొడుకుని జగన్ కాళ్లపై పడేశారు: దగ్గుబాటిపై వర్ల విసుర్లు

varla-ramaiah

దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన భార్య పురందేశ్వరిలపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. తోడల్లుడు చంద్రబాబు అంటే దగ్గుబాటికి ఈర్ష్య అని అన్నారు. చంద్రబాబు సీఎం కావడంతో దగ్గుబాటికి నిప్పుల కుంపటి మీద కూర్చున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మీద కక్షతోనే వైసీపీ అధినేత జగన్ కాళ్లపై తన కొడుకును పడేశారని విమర్శించారు. చంద్రబాబు వింతజీవి అంటున్నారని… వింతజీవి ఎలాగో చెప్పాలని అన్నారు. దగ్గుబాటి, పురందేశ్వరిలు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలంటూ హితవు పలికారు. Tags: Chandrababu, Jagan, Daggubati

Read More

ర‌జ‌నీ, క‌మ‌ల్‌లు ప‌ని చేస్తే అద్భుతం ఖాయం: విశాల్

త‌మిళనాట ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ మ‌ధ్య కాలంలో వీరిద్ద‌రు రాజ‌కీయాల‌లోకి వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రచారు. అయితే క‌మ‌ల్ ఇప్ప‌టికే మక్కల్‌‌ నీది మయ్యం‌ అనే పార్టీని స్థాపించి రాజ‌కీయాల‌లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ర‌జనీకాంత్ మాత్రం ఇప్ప‌టికి పార్టీ పేరు, కార్యాచ‌ర‌ణ‌ని ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం. ఇటీవ‌ల తాను రానున్న లోక్ స‌భ‌లో పోటీ చేయ‌న‌ని చెప్పడంతో పాటు ఏ పార్టీకి స‌పోర్ట్ చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించాడు ర‌జ‌నీకాంత్‌. ‘రజనీ మక్కల్‌ మండ్రమ్‌’ అనే అభిమాన సంఘం పేరిట తన రాజ‌కీయ కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్న తలైవా అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తాన‌ని అన్నాడు. అయితే లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో క‌మ‌ల్‌, ర‌జనీకాంత్ క‌లిసి పోటీ చేస్తే బాగుంటుంద‌ని విశాల్ అభిప్రాయ‌ప‌డుతున్నాడు. వారిద్ద‌రు క‌లిసి త‌మిళ‌నాడుకి మంచి జ‌రుగుతుంద‌ని అంటున్నాడు.…

Read More

ప్రకాశం జిల్లాపై వైసీపీ బ్రహ్మాస్త్రం

ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలపై వైసీపీ కన్నేసిందా? రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసేందుకు యత్నిస్తోందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జగన్ ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా ఆయన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందం రాష్ట్రమంతటా పర్యటించింది. వైసీపీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజల అభిప్రాయాన్ని సేకరించింది. ఈ నేఫథ్యంలో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి ఈ సారి వైవీ సుబ్బారెడ్డిని కాకుండా వైఎస్ షర్మిలను పోటీకి దించాలని ప్రతిపాదించింది. Tags: YCP party , YS sharmila, Prakasamdistirct

Read More

కేసీఆర్ ఒక గిఫ్ట్ ఇస్తే మేం మూడు గిఫ్ట్‌లు ఇస్తాం: చంద్రబాబు

కేసీఆర్ ఒక గిఫ్ట్ ఇస్తే. తాము మూడు గిఫ్ట్‌లు ఇస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తామేమీ చేతకానివారం కాదని అన్నారు. మనతో ప్రధాని మోదీ మంచిగా ఉన్నంతవరకు కేసీఆర్ కూడా మంచిగానే ఉన్నారని అన్నారు. ఎన్డీయే నుంచి బయటకు రావడంతో కేసీఆర్ కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. Tags: cm kcr, CM Chandrababu, ReturnGigt

Read More

సీఎం కేసీఆర్‌కు బెంగాల్‌ సీఎం మమత ఫోన్

సీఎం కేసీఆర్‌కు బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ ఫోన్‌ చేశారు. కోల్‌కతా ర్యాలీకి రావాలని కేసీఆర్‌ను ఆహ్వానించారు. కాంగ్రెస్‌, చంద్రబాబు పాల్గొనే ర్యాలీకి కేసీఆర్ దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలిసింది. రేపు కోల్‌కతాలో బీజేపీయేతర పార్టీల ర్యాలీ నిర్వహించనున్నారు. Tags: cm kcr, Mamata banerjee

Read More