హైదరాబాద్‌లో 9 మంది అనుమానితులు?

హైదరాబాద్‌ నగరంలో తొమ్మిది మంది కరోనా వైరస్‌ అనుమానంతో ఆస్పత్రులను ఆశ్రయించారు. ఇటీవల ఇండిగో విమానంలో ప్రయాణించిన ఇద్దరికి వైరస్‌ సోకినట్లు గుర్తించడంతో మిగిలిన ప్రయాణికుల్లో ఎవరికైనా అనుమానం ఉంటే నిర్ధారణ పరీక్షలు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. అందులో భాగంగా బుధవారం ముగ్గురు ఎయిర్‌హోస్టె్‌సలను గాంధీ ఆస్ప్రతికి తరలించి, పరీక్షలు చేస్తున్నారు. వారితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు అనుమానంతో పరీక్షలు చేయించుకునేందుకు వచ్చారు. ఫీవర్‌ ఆస్పత్రిలో మరో నలుగురు అనుమానితులు చేరారు. బీజింగ్‌ నుంచి సొంత పని మీద హైదరాబాద్‌ వచ్చిన ఇద్దరు చైనా దేశస్థులు అనుమానంతో ఫీవర్‌ ఆస్పత్రిలో చేరి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. తర్వాత వైద్యుల పర్యవేక్షణలో ఉండకుండానే వెళ్లిపోయారు. నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల చైనా వెళ్లి వచ్చారు. వారు కూడా అనుమానంతో ఫీవర్‌ ఆస్పత్రికి వచ్చారు.

Read More

కారున్నా.. ‘ఆరోగ్య శ్రీ’కి అర్హులే..!

ఏపీ ప్రజలకు.. జగన్ ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. కారున్న వారికి కూడా.. ఆరోగ్య శ్రీ పథకం వర్తిస్తుందని.. అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్నవారు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చునని స్పష్టం చేశారు. తాజాగా.. వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ పథకం విస్తరణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వీరికి ఆరోగ్య శ్రీ పథకం వర్తిస్తుంది:అన్ని రకాల బియ్యం కార్డులున్న వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది. పింఛన్ కార్డు ఉన్నవారు అర్హులే.. ఇంకా ఈ కార్డు దారులు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు. జగనన్న విద్యా కార్డ్ వసతి దీవెన కార్డు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారు 12 ఎకరాల కన్నా తక్కువ మాగాణి పొలం ఉన్నవారు 35 ఎకరాల కన్నా తక్కువ మెట్ట…

Read More

ఆయుష్మాన్‌ భారత్‌ కన్నా ఆరోగ్యశ్రీ మిన్న

కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ పథకంతో తెలంగాణలో 24 లక్షల మందికే లబ్ధి చేకూరుతున్నదని, ఆరోగ్యశ్రీ వల్ల 85 లక్షల మంది ఉచిత వైద్య సేవలు పొందుతున్నారని మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ అధ్యక్షతన రెండు రోజుల పాటు జరగనున్న సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ సమావేశం గురువారం ఢిల్లీలో ప్రారంభమైంది. ఆయుష్మాన్‌ ద్వారా చికిత్సల్లో అత్యధికంగా రూ.5 లక్షలే ఇస్తున్నారని ఈ సందర్భంగా ఈటల తెలిపారు. కానీ తాము మూత్రపిండాలు, గుండె మార్పిడి వంటి అత్యంత వ్యయంతో కూడుకున్న చికిత్సలకూ డబ్బులు ఇస్తున్నామని, వీటికి రూ.13 లక్షల వరకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు. తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలకు కేంద్రం మరింత మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. గ్రామాల…

Read More

ఆక‌లి బాగా పెర‌గాలంటే.. ఇలా చేయాలి..!

ఆకలి బాగా అయితేనే మ‌నం ఆహారం తింటాం. జీర్ణం బాగా అవుతుంది. దాంతో మ‌న‌కు శ‌క్తి, పోష‌కాలు ల‌భిస్తాయి. అయితే ఆక‌లి లేక‌పోతే ఏ ఆహారాన్నీ తిన‌లేం. దీంతో నీర‌సం, అల‌స‌ట వస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే చాలా మంది ఆక‌లి లేక‌పోవ‌డ‌మ‌నే స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. మరి ఆక‌లి బాగా పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!  1. ఒక టీస్పూన్ బెల్లం పొడి, అర టీస్పూన్ న‌ల్ల‌మిరియాల పొడిల‌ను క‌లిపి రోజూ ఒక పూట తీసుకుంటే ఆక‌లి బాగా పెరుగుతుంది.  2. అర టీస్పూన్ అల్లం ర‌సంలో కొద్దిగా రాక్ సాల్ట్ క‌లిపి 10 రోజుల పాటు రోజూ ఈ మిశ్రమాన్ని భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకుంటే ఆక‌లి బాగా పెరుగుతుంది.  3. ఒక క‌ప్పులో నీటిని తీసుకుని అందులో 2 టీస్పూన్ల ఉసిరికాయ ర‌సం,…

Read More

మేలైన నల్లద్రాక్ష

-ద్రాక్షలో విటమిన్ సి, ఎ, బి6, ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, కాల్షియం, ఇనుము, ఫాస్పరస్, మెగ్నీషియం, సెలీనియంలాంటి ఎన్నో రకాల ఖనిజ లవణాలు ద్రాక్షల్లో సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు.. ఫ్లేవనాయిడ్స్‌లాంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఫ్రీరాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి.-ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ద్రాక్షలో ఉండే ఔషధ గుణాలు ఆస్తమాను అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి. ద్రాక్షపండ్లలో టీరోస్టిల్‌బీన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదును తగ్గిస్తుంది. ద్రాక్ష పొట్టులో ఉండే సెపోనిన్లు కొలెస్ట్రాల్‌కు అతుక్కుని దాన్ని శరీరం గ్రహించకుండా నివారిస్తాయి.-నల్లద్రాక్షల రసం రొమ్ము క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుందని ఇటీవలి అధ్యయనాలు తెలుపుతున్నాయి. ద్రాక్ష రసం క్యాన్సర్‌ను అణచివేయడమే కాదు. క్యాన్సర్ కణాల వ్యాప్తిని కూడా అరికడుతుంది. ద్రాక్షలోని ఈ పదార్థాలు మొత్తం శరీర వ్యాధి నిరోధక వ్యవస్థనే…

Read More