హైదరాబాద్ లో ఓ ‘అమ్రిష్ పురి’… ‘మోజో’ టీవీని కబ్జా చేస్తున్నారు: రవిప్రకాశ్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్ లో ఉన్న ఓ అమ్రిష్ పురి, పోలీసుల సాయంతో టీవీ చానళ్లను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఉదయం రెండో రోజు సీసీఎస్ పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన ఆయన, లోనికి వెళ్లేముందు మీడియాతో మాట్లాడారు. భూములను ఎలా ఆక్రమిస్తున్నారో, ఇక్కడ మీడియాను అలాగే ఆక్రమిస్తున్నారని అన్నారు. తన మిత్రులు కొందరు కష్టపడి ‘మోజో’ టీవీని పెట్టుకుంటే, సత్ప్రవర్తన లేని పోలీసుల సహకారంతో, తప్పుడు కేసులు పెట్టి యాజమాన్యాన్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఉచితంగా ఓ టెలివిజన్ చానల్ ను కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ, సత్యాన్ని చంపేయాలని చూస్తున్నారని, టీవీ యాజమాన్యానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా లాక్కునే ప్రయత్నం జరుగుతోందని, దీన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. Tags: Raviprakash, MojoTv, Media

Read More

జడ్జి ముందుకు ఐటీ గ్రిడ్స్‌ ఉద్యోగులు

మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన నలుగురు ఉద్యోగులను తెలంగాణ పోలీసులు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. రేగొండ భాస్కర్‌, ఫణి కడులూరి, గురుడు చంద్రశేఖర్‌, విక్రమ్‌గౌడ్‌ రెబ్బాల అనే ఉద్యోగులను అక్రమంగా నిర్బంధించారన్న ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌ దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. ఉద్యోగులను సోమవారం ఉదయం 10.30 గంటలకల్లా తమ ముందు హాజరుపరచాలంటూ తెలంగాణ పోలీసులను హైకోర్టు ఆదివారం ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ నివాసానికి తరలించారు. Tags: IT Grids, Madhapur, Telanganapolice

Read More

వివాహమై పదేళ్లు… ఒకరిని వదిలి ఒకరు ఉండలేక…!

వివాహమైన పదేళ్ల తరువాత, తనకు పరిచయమైన ప్రియుడిని వదిలి ఉండలేని ప్రియురాలు, ఆమెను వదిలి ఉండలేని అతను కలసి ఆత్మహత్యాయత్నం చేశారు. నంద్యాలలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, పులివెందులలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న రఘుకు దివ్యతో పదేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరి వయసు వ్యత్యాసం 23 ఏళ్లు. వీరికి పిల్లలు లేరు. ఈ క్రమంలో ప్రొద్దుటూరుకు చెందిన శ్రావణ్ కుమార్, నెల్లూరులో ఏపీ జెన్ కోలో పని చేస్తుండగా, దివ్యకు సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారగా, అప్పుడప్పుడూ రహస్యంగా కలుస్తుండేవారు. ఈ నెల 13న దివ్య అతని వద్దకు వెళ్లగా, రఘు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆపై తిరుపతికి వెళ్లిన ఇద్దరూ,…

Read More

హోంవర్క్ చేయడం లేదని తొమ్మిదేళ్ల బాలుడిని చంపేశారు!

ఫ్రాన్స్‌లో ఘోరం జరిగింది. హోంవర్క్ చేయడం లేదని తొమ్మిదేళ్ల బాలుడిని చితకబాదడంతో అతడు ప్రాణాలు వదిలాడు. బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక ముల్ హౌజ్‌ పట్టణంలో నివాసం ఉంటున్న తొమ్మిదేళ్ల బాలుడు హోంవర్క్ చేయనని మారం చేయడంతో.. అతని అక్క, అన్న తీవ్రంగా కొట్టారు. ఆ సమయంలో అతని అన్న స్నేహితురాలు కూడా అక్కడే ఉంది. దెబ్బలకు తాళలేక ఆ అబ్బాయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అత్యవసర సేవల కోసం కాల్ చేసినా లాభం లేకుండా పోయిందని నిందితులు నేరాన్ని అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో బాలుడి తల్లితో సహా నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఘటన సమయంలో బాలుడి తల్లి అక్కడ లేదు. అయినా విచారణ నిమిత్తం ఆమెను…

Read More

హైదరాబాద్ శివారులోని పర్వతాపురంలో బిల్డర్ దారుణహత్య

హైదరాబాద్: నగర శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోగల పర్వతాపురంలో ఓ బిల్డర్ దారుణహత్యకు గురైన సంఘటన వెలుగుచూసింది. చంపాపేటకు చెందిన కేసాని రాజిరెడ్డి(38) వృత్తిపరంగా ఓ బిల్డర్ నగరంలోని రియల్ ఎస్టేట్ పనులు చేస్తున్నాడు. అయితే… అతన్ని కారులో నమ్మించి తీసుకొచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు పర్వతాపురం దగ్గర కారులోనే వేట కొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. అనంతరం తీవ్ర గాయాలకు గురైన ఆయన కారులోంచి తప్పించుకుని పరిగెత్తే ప్రయత్నం చేయగా ఆయన్ను వెంబడించి కళ్లల్లో కారం చల్లి నరికి చంపిన ఆనవాళ్లు సంఘటనా స్థలంలో కనిపించాయి. కాగా… ఆ హత్యకు వివాహేతర సంభందమా లేక రియల్ ఎస్టేట్‌లో ఏర్పడ్డ విభేదాల వల్ల జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అలాగే హత్యకు పాల్పడ్డ వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Read More