గోల్డెన్ లెహెంగాలో మెరిసిపోయిన సారా అలీ ఖాన్

సారా అలీ ఖాన్.. ఇప్పుడ బాలీవుడ్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్. ప్రస్తుతం జాన్వీ, సారాదే హవా. ఇప్పటికే సింబా హిట్‌తో మంచి హుషారు మీదున్న సారా.. హోలీ సందర్భంగా గోల్డెన్ లెహెంగా ధరించి మెరిసిపోయింది. సారా తరుచుగా అబు జాని, సందీప్ ఖోస్లా, మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఔట్‌ఫిట్స్‌ను ధరిస్తుంటుంది. తాజాగా ఆమె గోల్డెన్ లెహెంగా ధరించి తన అభిమానులకు హ్యాపీ హోలీ అంటూ శుభాకాంక్షలు తెలియజేసింది. 

Read More

“నేనే మొదలు పెట్టాను .. నేనే పూర్తి చేస్తాను” నయనతార ‘ఐరా’ నుంచి ట్రైలర్ రిలీజ్

తమిళంలో నయనతార చేసిన సస్పెన్స్ తో కూడిన హారర్ థ్రిల్లర్ సినిమాలు అక్కడ భారీ విజయాలను సాధించాయి. ఆ సినిమాలు తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలా మారో హారర్ థ్రిల్లర్ సినిమాతో అటు తమిళ ప్రేక్షకులను .. ఇటు తెలుగు ఆడియన్స్ ను పలకరించడానికి నయనతార సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రధారిగా చేసిన ఆ సినిమాయే ‘ఐరా’. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. దెయ్యాలు ఉన్నాయని నమ్మించడానికి ప్రయత్నించిన నయనతార .. ఎలాంటి ఇబ్బందుల్లో పడిందనే కథాంశంతో ఈ కథ కొనసాగుతుందని ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. “ఈ లోకంలో ఎవరూ ఇవ్వని సంతోషాన్ని నువ్వు నాకు ఇచ్చావు అభి .. దానిని దూరం చేసిన ఎవరినీ నేను ప్రాణాలతో వదలను”.. “నేనే మొదలు పెట్టాను…

Read More

ఘనంగా హీరో విశాల్ నిశ్చితార్థం..

తమిళ స్టార్ హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కూతురు అల్ల అనీశా రెడ్డి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్‌కు కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు కూడా ఉంగరాలు మార్చుకున్న తర్వాత ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. ఇవాళ పెళ్లి తేదీని కూడా ఫిక్స్ చేశారని సమాచారం. తాను చేసుకోబోయే అమ్మాయిని అభిమానులకు పరిచయం చేసిన విశాల్ త్వరలోనే వివాహ తేదీని కూడా ప్రకటిస్తాడని అభిమానులు భావిస్తున్నారు.  పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి సినిమాలతో అనీశా రెడ్డి తెలుగు ప్రేక్షకుల పరిచయమైంది. విశాల్ ప్రస్తుతం టెంపర్ రీమేక్ ‘అయోగ్య’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రెండు రోజుల క్రితం తమిళ హీరో ఆర్య.. బాలీవుడ్ నటి సాయేషా సైగల్‌ను…

Read More

రామరాజు ‘సీత’.. ఈ ఆలియా!

ఎంతోమంది స్టార్‌ల వారసులు వస్తుంటారు.. వెళుతుంటారు.. కానీ, తమను తాము నిరూపించుకునేది మాత్రం కొంతమందే. అలా నిరూపించుకున్నవాళ్లలో బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ ఒకరు. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నుంచి ఇటీవల ‘గల్లీబాయ్‌’వరకూ ఆమె చేసిన పాత్రలన్నీ ప్రత్యేకం. అందుకే తక్కువ సమయంలోనే పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. వరుస సినిమాలతో బిజీగా ఉండే ఆలియా.. మరో భారీ ప్రాజెక్టుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌లు కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఒక కథానాయికగా అవకాశం దక్కించుకుంది. నేడు ఆమె పుట్టిన రోజు. 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఆలియా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం.. Tags: #RRR, Aliyabhatt, Tarak, Charan

Read More

పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న కేజీఎఫ్ 2

KGF-2

క‌న్న‌డ సినీ ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా రికార్డులు పొందిన మూవీ కేజీఎఫ్‌. పీరియ‌డ్ గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల‌లో విడుద‌ల చేశారు. అంత‌టా ఈ చిత్రానికి భారీ ఆద‌ర‌ణ ల‌భించింది. శాండ‌ల‌వుడ్ చ‌రిత్రలో సరికొత్త రికార్డు నెల‌కొల్పిన ఈ చిత్రానికి సీక్వెల్ ప్రారంభ‌మైంది. తాజాగా బెంగ‌ళూర్ లోని విజ‌య‌న‌గ‌ర్ ప్రాంతంలో ఉన్న‌ కొండండ్రం గుడిలో సీక్వెల్ చిత్రానికి పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి న‌టుడు య‌శ్‌తో పాటు శ్రీనిధి శెట్టి, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌, త‌దితరులు హాజ‌ర‌య్యారు. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని మేక‌ర్స్ అనుకుంటున్నార‌ట‌. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో కేజీఎఫ్ చిత్రాన్ని తెరకెక్కించారు. యువ నటుడు యష్‌ ఈ చిత్రంలో హీరోగా నటించారు. సీక్వెల్‌లోను…

Read More