8న మినీ జాబ్‌ మేళా..

యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఈ నెల 8న మినీ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్‌ ఇన్ఫర్మేషన్‌ గైడెన్స్‌ బ్యూరో మోడల్‌ కెరియర్‌ సెంటర్‌ డిప్యూటీ చీఫ్‌ అధికారి ఎన్‌. అనంతరెడ్డి బుధవారం తెలిపారు. 12 కంపెనీల్లో దాదాపు 900 ఉద్యోగాల ఎంపికకు ఈ మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నామన్నారు. 19 నుంచి 30 ఏండ్ల మధ్య వయసు గల యువత సింఖ్రో సర్వ్‌ గ్లోబల్‌ సొల్యూషన్‌ అల్వాల్‌ నందు ఉదయం 10.30 గంటలకు జాబ్‌మేళాకు హాజరు కావాలన్నారు. వివరాలకు యంగ్‌ ప్రొఫెషనల్‌ టి. రఘుపతి నంబరు 8247656356/9100064574కు ఫోన్‌ చేయాలని సూచించారు.

Read More

పెళ్ళి కానివారికి… ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాల్లో

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌(ఐఏఎఫ్)లో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. 249 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ 2020 ద్వారా ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా పోస్టుల భర్తీ జరుగుతుంది. హైదరాబాద్‌లోని దుండిగల్‌లో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ ఉంటుంది. పెళ్లికాని యువతీయువకులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. వేర్వేరు పోస్టులకు విద్యార్హతలు, వయస్సు వేర్వేరుగా ఉన్నాయి. దరఖాస్తులకు ఈ నెల 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు www.indianairforce.nic.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. పోస్టుల వివరాలిలా ఉన్నాయి. మొత్తం ఖాళీలు – 249 ఫ్లయింగ్ బ్రాంచ్ షార్ట్ సర్వీస్ కమిషన్ – 60 గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)…

Read More

సమగ్ర శిక్ష అభియాన్‌లో 383 ఉద్యోగాలు

తెలంగాణలో పాఠశాల విద్యకు సంబంధించి ‘సమగ్ర శిక్ష అభియాన్‌’లో తాత్కాలిక, కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా వివిధ విభాగాల్లోని మొత్తం 383 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో మేనేజ్‌మెంట్ ఇన్ఫ్‌ర్మేషన్ సిస్టం (MIS) ఎంఆర్పీ విభాగంలో 144 కోఆర్డినేటర్ పోస్టులు; డీఈవో, డీపీవో కార్యాలయాల్లో 138 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, 12 సిస్టం అనలిస్ట్ పోస్టులు, 27 అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టులు ఉన్నాయి. పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను నవంబరు 15న అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. నవంబరు 18న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబరు 23 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. డిసెంబర్ మొదటి వారంలో పరీక్షకు సంబంధించిన…

Read More

Postal Jobs: 3677 పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో 3677 పోస్టల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మంగళవారం (అక్టోబరు 22) ప్రారంభమైంది. అక్టోబరు 14న రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసిన వారు అక్టోబరు 22 నుంచి నవంబరు 21 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లించడానికి నవంబరు 14 వరకు అవకాశం ఉంది. ఓసీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసిన వారు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించాల్సినవారు ఆన్‌లైన్ లేదా సంబంధిత పోస్టాఫీసులో చెల్లించవచ్చు. పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మెరిట్ ఆధారంగా ఉద్యోగ…

Read More

ఎస్పీడీసీఎల్‌లో 3,025 ఉద్యోగాలు

రాష్ర్టానికి చెందిన దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) పరిధిలోని 3,025 ఉద్యోగాలను భర్తీచేసేందుకు పూర్తిస్థాయి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు బుధవారం ఎస్పీడీసీఎల్ సీఎండీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మూడు క్యాటగిరీల్లోని వందల సంఖ్యలోని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గతంలోనే ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే. జూనియర్ లైన్‌మెన్ పోస్టులు 2,500, జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు 500, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులు 25.. మొత్తంగా 3,025 పోస్టులను భర్తీచేసేందుకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యా యి. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా పోస్టులు, అర్హతలు, వయసు, దరఖాస్తు విధానం, రిజర్వేషన్లు, ఇతర సమాచారం నోటిఫికేషన్లలో ఇచ్చారు. సంస్థకు చెందిన tssouthpower. cgg. gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్…

Read More