చిదంబ‌రానికి బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రానికి ఊర‌ట ల‌భించింది. ఇవాళ సుప్రీంకోర్టు చిదంబ‌రానికి బెయిల్ మంజూరీ చేసింది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించ‌డంతో.. మాజీ కేంద్ర మంత్రి బెయిల్ కోసం సుప్రీం త‌ల‌పు త‌ట్టారు. అయితే ఇవాళ సుప్రీం బెయిల్ ఇచ్చినా.. కాంగ్రెస్ నేత మాత్రం ఇంకా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ క‌స్ట‌డీలోనే ఉన్నారు. ఇద్ద‌రు సాక్షి సంత‌కాల‌తో చిదంబ‌రం.. ల‌క్ష రూపాయాల బాండ్‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. చిదంబ‌రం త‌న పాస్‌పోర్ట్‌ను ట్ర‌య‌ల్ కోర్టులో అప్ప‌గించాలి. కోర్టు అనుమ‌తితోనే ఆయ‌న విదేశాల‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ‌కు అక్ర‌మ ప‌ద్ధ‌తిలో విదేశీ పెట్టుబ‌డులు అందే విధంగా చిదంబ‌రం అనుమ‌తి ఇచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ కేసులో ఈ ఏడాది ఆగ‌స్టు 21వ తేదీన చిదంబ‌రాన్ని అరెస్టు చేశారు. అప్ప‌టి నుంచి ఆయ‌న తీహార్…

Read More

ఓటు హక్కును వినియోగించుకున్న సచిన్

మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న పోలింగ్ లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య అంజలి, కుమారుడు అర్జున్ కూడా ఓటు వేశారు. ముంబైలోని బాంద్రా (వెస్ట్)లోని పోలింగ్ బూత్ లో వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో సచిన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచి బయటకు వచ్చి, ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. భవిష్యత్తను మార్చగలిగే సత్తా ఓటర్లకు ఉందని చెప్పారు. సమాజానికి మంచి చేస్తారని ఎవరినైతే మీరు నమ్ముతారో, వారికి ఓటు వేయండని పిలుపునిచ్చారు. అర్హులైన వారిని ఎన్నుకోవాలని కోరారు.

Read More

మా నాయకుడు రాహుల్ గాంధీ పారిపోతున్నారు: సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు!

రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో పాటు, తమ అధీనంలో ఉన్న ఒక్కో రాష్ట్రాన్నీ కోల్పోతున్న కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఏకంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. ఆయనే పార్టీకి ఓ అతిపెద్ద సమస్యని అభివర్ణించారు. రాహుల్ అన్ని విషయాల్లోనూ ఎదురు నిలవకుండా పారిపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్ ఎన్నిక ఈ నెలలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాహుల్ వైఖరితో పార్టీలో ఓ రకమైన శూన్యం ఏర్పడిందని, దాన్ని భర్తీ చేసేందుకు సోనియా గాంధీ ప్రయత్నిస్తున్నా, కుదరడం లేదని అన్నారు. యూపీలోని 80 సీట్లలో కేవలం ఒకే ఒక్క సీటును కాంగ్రెస్ గెలుచుకోవడం, స్వయంగా రాహుల్…

Read More

మోదీ ముందు 22 డిమాండ్లు ఉంచిన కేసీఆర్

ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 50 నిమిషాల పాటు వీరిరువురూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 22 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రధానికి కేసీఆర్ అందించారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏటా రూ. 450 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. అయితే ఇంకా ఒక ఏడాది నిధులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ కోరారు. ఒక ఐఐఎంను మంజూరు చేయాలని విన్నవించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 23 నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని విన్నవించారు. నీతి ఆయోగ్ సిఫారసులకు అనుగుణంగా మిషన్ కాకతీయకు రూ. 5 వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ. 19,205 కోట్లను విడుదల చేయాలని కోరారు.…

Read More

అమిత్ షా ‘హిందీ’ వ్యాఖ్యలపై మండిపడ్డ స్టాలిన్..

భారత్ లో ఒకే భాష ఉండాలనీ, అప్పుడే దేశం ఐక్యంగా ఉంటుందని బీజేపీ చీఫ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారతీయులంతా హిందీ వాడకాన్ని ప్రోత్సహించాలని షా పిలుపునిచ్చారు. తాజాగా అమిత్ షా వ్యాఖ్యలపై తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చెన్నైలో ఘాటుగా స్పందించారు. తమిళులపై హిందీని బలవంతంగా రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తూనే ఉన్నామని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు చేసిన వ్యాఖ్యలు తమను దిగ్భ్రాంతికి గురిచేశాయని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలతో భారత సమగ్రత, ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. కాబట్టి తన వ్యాఖ్యలను షా వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్లుండి తాము డీఎంకే కార్యనిర్వాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నామనీ, అందులో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై చర్చిస్తామని…

Read More