పబ్ జీ ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ యువకుడు!

పబ్ జీ.. ఈ స్మార్ట్ ఫోన్ గేమ్ ప్రస్తుతం దేశంలోని యువతను ఊపేస్తోంది. అయితే అదేపనిగా పబ్ జీ ఆడుతూ చాలామంది ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా పబ్ జీ గేమ్ కు బానిసైన ఓ యువకుడు మెడ నరాలు దెబ్బతినడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వెల్గటూరు మండలం రాజారంపల్లికి చెందిన సాగర్(20) తొలుత పబ్ జీ గేమ్ ను టైంపాస్ గా ఆడటం మొదలుపెట్టాడు. అయితే ఇది కాస్తా వ్యసనంగా మారింది. 45 రోజులు అదేపనిగా పబ్ జీ ఆడటంతో మెడ నరాలు పట్టేశాయి. దీంతో కుటుంబ సభ్యులు సాగర్ ను హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ, మెడ నరాలు పూర్తిగా దెబ్బతినడంతో సాగర్ఐదు రోజులుగా చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస…

Read More

నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవిత

Kalvkutla-Kavitha

నిజామాబాద్ ఎంపీ స్థానానికి టీఆర్‌ఎస్ పార్టీ తరపున కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఎంపీ కవిత.. ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం నిజామాబాద్ శివారులోని సారంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఎంపీ కవిత, ఆమె భర్త అనిల్ ప్రత్యేక పూజలు చేశారు. నామినేషన్ పత్రాలను హనుమంతుడి పాదాల చెంత ఉంచి మొక్కుకున్నారు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు కవిత.

Read More

ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం ఇదే!

ఏపీలో ఎన్నికలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలకు తోడు జనసేన కూడా గెలుపుకోసం విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయిలో వస్తున్న పలు సర్వేలు కూడా జనాల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుపొందుతుందనే ప్రశ్న మీడియా నుంచి టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఎదురైంది. దీనికి సమాధానంగా… ఏపీలో ఎవరు గెలుస్తారో తాను చెప్పలేనని ఆయన అన్నారు. ఏపీ రాజకీయాల పట్ల తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. పక్క రాష్ట్ర రాజకీయాల గురించి తనకు తెలియదని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి రేవంత్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Read More

‘తెలంగాణ జనసమితి’కి గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘం!

లోక్ సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం జోరు పెంచింది. ఇందులో భాగంగా 76 పార్టీలకు గుర్తును కేటాయించింది. కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జనసమితికి ఈ సందర్భంగా ‘బాక్సు’ గుర్తును కేటాయించింది. అలాగే ‘అన్న వైఎస్సార్ కాంగ్రెస్’ పార్టీకి తెలంగాణలోని 10 స్థానాలకు గానూ బ్యాట్స్ మెన్ గుర్తును ఇచ్చింది. ఏపీలోని 13 స్థానాలకు ఫుట్ బాల్ ఆటగాడి గుర్తును కేటాయించింది. మరోవైపు భారతీయ రాష్ట్రీయ మోర్చాకు తెలంగాణలోని 16 స్థానాలకు బెంచ్‌ గుర్తు ఇచ్చింది. అలాగే మార్క్సిస్ట్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాకు తెలంగాణలోని 4 లోక్‌సభ స్థానాలకు కంప్యూటర్‌ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది.

Read More

హైటెక్‌ సిటీ మెట్రోను ప్రారంభించిన గవర్నర్

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హైటెక్‌ సిటీ మెట్రో కారిడార్‌ ప్రారంభమైంది. ఈరోజు (బుధవారం) ఉదయం 9.15 గంటలకు అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఎలాంటి హడావుడి లేకుండా జరిగిన ఈ కార్యక్రమంలో కొందరు ఉన్నతాధికారులు మాత్రమే పాల్గొన్నారు. ట్రైన్ అధికారికంగా ప్రారంభమైనప్పటికీ ప్రయాణికులను మాత్రం సాయంత్రం 4 గంటల నుంచి అనుమతిస్తామని మెట్రో అధికారులు ఇదివరకే చెప్పారు. అమీర్‌పేట- హైటెక్‌సిటీ మార్గంలో మాత్రం ప్రతి 9 నుంచి 12 నిమిషాలకు ఒక రైలు రాకపోకలు సాగించనుందని హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి సోమవారం వెల్లడించారు. ఈ మార్గంలో మొత్తం ఎనిమిది స్టేషన్లు ఉండగా ప్రస్తుతం ఐదు స్టేషన్లను అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్ స్టేషన్లను త్వరలో ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ మార్గం…

Read More