రూ.7000 జీతం ఉంటే టూవీలర్ లోన్.. బ్యాంక్ బంపర్ ఆఫర్!

చిరుద్యోగులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మాములుగా టూవీలర్ లోన్స్ తీసుకోవాలనుకునే కస్టమర్లు ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉండాలి. అంతేకాకుండా స్వయం ఉపాధి పొందుతున్న వారికి లోన్ దక్కుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్న వారి వేతనం కూడా దాదాపు రూ.15 వేలు దాటి ఉండాలి. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారులు, నెలకు రూ.7000 అందుకుంటున్న వారు సైతం ద్విచక్ర వాహనాల కొనుగోలు కోసం రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చని అంటున్నారు. అంటే ఉద్యోగం చేస్తున్న వారి వార్షిక ఆదాయం రూ.84,000 వేలు.. స్వయం ఉపాధి పొందుతున్న వారి వార్షిక ఆదాయం రూ.72,000 వేలు ఉండాలి. టూవీలర్ కొనుగోలుకు అవసరమైన పూర్తి డబ్బును రుణం రూపంలో పొందవచ్చని.. 100 శాతం ఫైనాన్స్ సౌకర్యం కూడా లభిస్తుందని అంటున్నారు. అయితే ఇది కేవలం ఎంపిక చేసిన మోడల్స్‌కు మాత్రమే వర్తిస్తుందట.…

Read More

పాన్‌ కార్డు లేదా.. ఆందోళన అక్కర్లేదు : ఆధార్‌ నంబరిచ్చినా చాలంటున్న కేంద్రం

పాన్‌ కార్డు…కొన్ని సందర్భాల్లో తప్పనిసరి అన్నది ఇప్పటి వరకు ఉన్న నిబంధన. లేకుంటే లావాదేవీ నిర్వహణకు వీలుకాక వెనుదిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఖాతాదారులకు ఊరటనిచ్చే ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇకపై పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు ఇంటర్‌ చేంజ్‌బిలిటీకి ఆమోదం తెలిపింది. దీన్ని అనుసరించి ఒకవేళ ఎక్కడైనా పాన్‌ కార్డు ఇవ్వాల్సిన అవసరం వస్తే ఆధార్‌ నంబర్‌ను చూపి పని పూర్తి చేసుకోవచ్చు. ఈ వార్షిక బడ్జెట్‌లోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పాన్‌, ఆధార్‌ ఇంటర్‌ చేంజ్‌బిలిటీకి ప్రతిపాదించారు. తాజాగా దీన్ని ఆమోదించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తన రూల్స్‌లో నోటిఫై చేసింది. ఈ నిర్ణయం ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేసే వారికి ఇది ఊరటనిచ్చే అంశం. అలాగే బ్యాంకులో లావాదేవీ సందర్భంగా కూడా పాన్‌ నంబరు కోరేటప్పుడు…

Read More

కాగ్నిజెంట్‌లో 7 వేల ఉద్యోగాల కోత

అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ కాగ్నిజెట్‌..ఉద్యోగులకు షాకిచ్చింది. వచ్చే కొన్ని నెలల్లో 12 వేల మంది సిబ్బందిని తొలగించడానికి సిద్ధమవుతున్నది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోకతప్పదని ఉన్నతాధికారి ఒకరు సంకేతాలిచ్చారు. కాగా, సెప్టెంబర్‌ 30తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను సంస్థ 497 మిలియన్‌ డాలర్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో వచ్చిన 477 మిలియన్‌ డాలర్లతో పోలిస్తే 4.1 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. అలాగే, ప్రస్తుత సంవత్సరానికిగాను ఆదాయంలో వృద్ధి 4.6-4.9 శాతం మధ్యలో ఉంటుందని అవుట్‌లుక్‌లో పేర్కొంది. ఆదాయం 4.2 శాతం పెరిగి 4.25 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. గడిచిన కొన్ని నెలలుగా సంస్థ అన్ని విభాగాల్లో రాణిస్తున్నదని, ఐటీ రంగంలో పోటీ తీవ్రతరమవుతున్నప్పటికీ ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా నమోదయ్యాయని కాగ్నిజెంట్‌ సీఈవో…

Read More

రిలయన్స్‌ డిజిటల్‌ దివాలీ ఆఫర్‌

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ పరికరాల విక్రయ సంస్థ రిలయన్స్‌ డిజిటల్‌..దివాలీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 25 నుంచి 31 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్‌ కింద రిలయన్స్‌ డిజిటల్‌, మై జియో స్టోర్లలో టీవీలు, గృహోపకరణాలు, మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసిన వారికి 15 శాతం క్యాష్‌బ్యాక్‌తోపాటు మరో పదిశాతం అదనపు రాయితీని కల్పిస్తున్నది సంస్థ. అలాగే లక్కీ డ్రా ద్వారా కిలో బంగారాన్ని, లగ్జరీ కార్లు, మోటార్‌సైకిల్‌, ఎల్‌ఈడీ టీవీలు, ల్యాప్‌టాప్స్‌ లేదా ఐఫోన్లను గెలుచుకునే అవకాశం కూడా కల్పించింది. ఈ లక్కీ డ్రా తమిళనాడుకు వర్తించదని తెలిపింది. ప్రస్తుతం సంస్థ దేశవ్యాప్తంగా 7 వేలకు పైగా స్టోర్లను నిర్వహిస్తున్నది.

Read More

కల్కి ఆశ్రమంలో అక్రమాలు బట్టబయలు… కోట్లాది రూపాయలు, కీలక పత్రాలు స్వాధీనం

కల్కి భగవాన్ కు చెందిన ప్రధాన ఆశ్రమంతో పాటు, పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు రెండో రోజు సోదాలు జరుపుతున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో తనిఖీలను నిర్వహిస్తున్నారు. మొత్తం 400 మంది అధికారులు 16 బృందాలుగా విడిపోయి సోదాలను నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున డబ్బు బయటపడుతోంది. ఇప్పటి వరకు రూ. 33 కోట్లను అధికారులు గుర్తించారు. ఇందులో 9 కోట్ల విదేశీ కరెన్సీ కూడా ఉంది. దీంతో పాటు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమంలో కంప్యూటర్లను సీజ్ చేశారు. చెన్నై, బెంగళూరుల్లో భారీగా భూములు కొన్నట్టు గుర్తించారు. ఆఫ్రికా, ఖతార్ దేశాల్లో కూడా ఆస్తులు ఉన్నట్టు కనుగొన్నారు.

Read More