హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరిన తమిళిసై.. మోదీ, అమిత్ షాతో భేటీకానున్న గవర్నర్

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. ముగ్గురు ఉద్యోగులు బలన్మరణాలకు పాల్పడిన నేపథ్యంలో సమ్మె ఉద్ధృతమైంది. అటు ప్రభుత్వం కానీ, ఇటు కార్మికులు కానీ ఒక్క మెట్టు కూడా దిగడంలేదు. సమ్మె కారణంగా రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు కూడా మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసైతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత పరిణామాలు వేగవంతంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం కూడా నిశితంగా గమనిస్తోంది. సమ్మెపై గవర్నర్ ను కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. అంతేకాదు, ఢిల్లీకి రావాలంటూ ఆదేశించింది. ఆర్టీసీ సమ్మెపై నివేదికను కోరింది. కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు ఆమె హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీతో గవర్నర్ భేటీ…

Read More

భారత్ తో పాటు బంగ్లాను కూడా గర్వించేలా చేశారు: గంగూలీకి మమత అభినందనలు

బెంగాల్ క్రికెట్ దిగ్గజం, భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. “బీసీసీఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవనున్న సౌరవ్ గంగూలీకి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ పదవీకాలంలో ఎలాంటి ఆటంకాలు కలగకూడదని ఆశిస్తున్నాను. మీరు భారత్ ను, బంగ్లా (పశ్చిమబెంగాల్) ను గర్వించేలా చేశారు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిగా మీరందించిన సేవలకు సంతృప్తి చెందాం. మీ నుంచి మరో గొప్ప ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నాం” అంటూ మమతా ట్వీట్ చేశారు. Tags: Mamatha Banarjee, Sourav Ganguly, Cricket, BCCI

Read More

మా నాయకుడు రాహుల్ గాంధీ పారిపోతున్నారు: సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు!

రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో పాటు, తమ అధీనంలో ఉన్న ఒక్కో రాష్ట్రాన్నీ కోల్పోతున్న కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఏకంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. ఆయనే పార్టీకి ఓ అతిపెద్ద సమస్యని అభివర్ణించారు. రాహుల్ అన్ని విషయాల్లోనూ ఎదురు నిలవకుండా పారిపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్ ఎన్నిక ఈ నెలలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాహుల్ వైఖరితో పార్టీలో ఓ రకమైన శూన్యం ఏర్పడిందని, దాన్ని భర్తీ చేసేందుకు సోనియా గాంధీ ప్రయత్నిస్తున్నా, కుదరడం లేదని అన్నారు. యూపీలోని 80 సీట్లలో కేవలం ఒకే ఒక్క సీటును కాంగ్రెస్ గెలుచుకోవడం, స్వయంగా రాహుల్…

Read More

నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్

ఆర్థికమాంద్యం నేపథ్యంలో రాష్ట్రానికి ఇచ్చే నిధులను పెంచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రితో సమావేశం కావడంకోసం గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రధానమంత్రితో సీఎం భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను పెంచడంతోపాటు రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని ప్రధానిని సీఎం కోరనున్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయప్రాజెక్టు హోదా కల్పించాలని ఇదివరకే అనేకసార్లు ప్రధానిని సీఎం కోరిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల పూడిక తీసే మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని నీతిఆయోగ్ ప్రశంసించింది. దీనివల్ల తెలంగాణలో భూగర్భజలాలు పెద్దఎత్తున పెరుగుతున్నాయి. ఈ పథకానికి ఆర్థిక సహాయం అందించాలని గతంలోనే ప్రధానికి సీఎం…

Read More

కాబుల్‌లో కారు బాంబు పేలుడు..

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరం మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. గురువారం శష్ దరక్ ప్రాంతంలోని అమెరికా ఎంబసీ,నాటో కార్యాలయాలకు సమీపంలో కారు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 10 మంది మృతి చెందారు. ఇందులో సాధారణ పౌరులతో పాటు పోలీసులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.పేలుళ్లు తమ చర్యనే అని తాలిబన్లు ప్రకటించారు.తాలిబన్లతో శాంతి చర్చల తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లోని తమ సైనికులను అమెరికా ఉపసంహరించుకున్న కొన్ని గంటలకే ఈ పేలుళ్లు జరగడం గమనార్హం. గడిచిన నాలుగైదు రోజుల్లో కాబూల్‌లో పేలుళ్ల ఘటన జరగడం ఇది రెండోసారి. దీంతో పేలుడు సంభవించిన ప్రాంతంలో పోలీసులు రాకపోకలను తాత్కాలికంగా నిషేధించారు.కాగా, సోమవారం రాత్రి తూర్పు కాబుల్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 16 మంది చనిపోగా.. 100కు పైగా తీవ్రంగా గాయపడ్డారు.

Read More