మంగళగిరిలో నామినేషన్ వేసిన నారా లోకేశ్

Nara-Lokesh-s-Tweet-Challenge

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ నేత నారా లోకేశ్ ఈరోజు తన నామినేషన్ దాఖలు చేశారు. మంగళగిరిలోని తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను లోకేశ్ సమర్పించారు. లోకేశ్ వెంట టీడీపీ నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, ఆయన కుటుంబసభ్యులు ఉన్నారు. లోకేశ్ తో ఆయన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్ ఉన్నారు.

Read More

కొడుకుతో తిరుమలకు వచ్చిన నారా బ్రాహ్మణి… రూ. 30 లక్షల విరాళం!

నేడు చంద్రబాబు మనవడు, లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమలలో నారా వారి ఫ్యామిలీ సందడి చేసింది. దేవాన్ష్ ను తీసుకుని భువనేశ్వరి, బ్రాహ్మణిలు తిరుమలకు రాగా, అధికారులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం వీఐపీ దర్శనం ప్రారంభమయ్యే ముందు వారికి దర్శనం చేయించి, రంగనాయకుల మండపంలో ఆశీర్వదించి, ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా అన్న ప్రసాద ట్రస్ట్ కు రూ. 30 లక్షలను బ్రాహ్మణి అందించారు. ఆపై దేవాన్ష్ తో కలిసి వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వచ్చిన వారు, భక్తులకు స్వయంగా అల్పాహారాన్ని వడ్డించి, వారితో పాటు కలిసి ఆరగించారు. పలువురు టీటీడీ అధికారులు భువనేశ్వరి, బ్రాహ్మణి వెంటే ఉండి, వారికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు.

Read More

నామినేషన్ కు ముహూర్తం ఖరారు చేసుకున్న బాలకృష్ణ!

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న నందమూరి బాలకృష్ణ, తన నామినేషన్ దాఖలుకు ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. ఈ నెల 22న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ విషయాన్ని పీఆర్వో వంశీ కాక, తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు. “హిందూపురంలో బాలకృష్ణ 22వ తేదీన నామినేషన్ వేస్తారు” అని పేర్కొన్నారు. కాగా, బాలకృష్ణ నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ జరిపేందుకు పట్టణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Read More

బీఎస్పీతో జట్టుకట్టిన జనసేన

జనసేన, బహుజన సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) మధ్య పొత్తు కుదిరింది. ఏపీ, తెలంగాణలో కలిసి పోటీచేయనున్నట్టు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి సంయుక్తంగా ప్రకటించారు. పొత్తులపై చర్చించేందుకు పవన్‌కల్యాణ్ శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోకు వెళ్లారు. అనంతరం మాయావతితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీచేయనున్నట్టు మాయావతి ప్రకటించారు. కమ్యూనిస్టు పార్టీలు సైతం తమతో కలిసివస్తాయని, పవన్ కళ్యాణ్‌ను ఏపీ సీఎంగా చూడాలనుకుంటున్నానని చెప్పారు. సీట్ల పంపకాలపై స్పష్టత వచ్చిందని, వచ్చేనెల 3న ఏపీలో, 4న తెలంగాణలో పర్యటిస్తానని అన్నారు.పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ మాయావతిని ప్రధానమంత్రిగా చూడాలని ఉన్నదనని, ఇది తన చిరకాల కోరిక అని చెప్పారు.

Read More

వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై దర్యాప్తు చేస్తున్నాం: ఎస్పీ

కాసేపట్లో వైఎస్ వివేకానందరెడ్డి డెడ్‌బాడీకి పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పోస్టుమార్టం తర్వాత ఏం జరిగిందనేది తేలుతుందన్నారు. బాత్రూమ్‌లో రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. మృతిపై అనుమానాలున్నాయని వైఎస్ వివేకానందరెడ్డి పీఏ ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఐపీసీ 175 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు.

Read More