కేటీఆర్, హరీశ్‌లకు ఐటీశాఖ నోటీసులు! ‘కూలి పనే’ కొంపముంచిందా?

టీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు ముఖ్య నేతలకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. మూడేళ్ల క్రితం వారు చేపట్టిన గులాబీ కూలీ కార్యక్రమానికి సంబంధించి వివరాలు, లెక్కలు చెప్పాలంటూ ఐటీశాఖ ఇప్పుడు తాఖీదులిచ్చినట్లు తెలుస్తోంది. ఐటీశాఖ కన్ను పడిన వారిలో కొందరు మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. కేటీఆర్‌, హరీశ్‌ రావు, మహమూద్‌ అలీ, ఈటల రాజేందర్ సహా ఈ జాబితాలో చాలా మంది పేర్లు ఉన్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. మూడేళ్ల క్రితం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ పార్టీ వరంగల్‌లో పెద్ద ఎత్తున ప్రగతి నివేదన సభ నిర్వహించింది. అయితే అప్పుడు ఈ సభకు వచ్చే కార్యకర్తల దారి ఖర్చుల కోసం వినూత్నంగా ‘గులాబీ కూలీ’ పేరిట టీఆర్‌ఎస్‌ ఓ కార్యక్రమం చేపట్టింది. అగ్ర నేతల పిలుపు మేరకు అప్పటి మంత్రులు,…

Read More

జగన్‌ ఆర్నెల్ల పాలన బాగుంది!

‘ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ ఆర్నెల్ల పాలన బాగుంది. మంచి ప్రారంభం’ అని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఏపీకి మూడు రాజధానులు మంచిదో.. కాదో.. ఆ రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని, తాను కాదని తెలిపారు. ట్విటర్‌లో ‘ఆస్క్‌ కేటీఆర్‌’లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయం ఏమిటి? రాజధాని నగరం, హైకోర్టు ఇవేనా అభివృద్ధి అంటే? అని ఓ నెటిజన్‌ కేటీఆర్‌ను ప్రశ్నించాడు. దానికి తెలివిగా సమాధానం చెప్పిన కేటీఆర్‌.. అది నిర్ణయించేది తాను కాదని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలని బదులిచ్చారు.

Read More

మాట మార్చి, మడమ తిప్పి జగన్ గారు అమరావతిని ముంచేశారు: లోకేశ్

lokesh

‘భారీ వరదకి కూడా అమరావతి మునగలేదు. జగన్ గారి దొంగ దెబ్బకి అమరావతి మునిగిపోయింది’ అంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. నిండు సభలో గతంలో అమరావతికి జై కొట్టారని. కనీసం 30 వేల ఎకరాలు ఉంటే కానీ రాజధాని అభివృద్ధి సాధ్యం కాదని అన్నారని లోకేశ్ అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని వైసీపీ మేనిఫెస్టోలో పెట్టారని, అమరావతిని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని నమ్మబలికారని నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక మాటమార్చి, మడమ తిప్పి జగన్ గారు అమరావతిని ముంచేశారని విమర్శించారు.

Read More

ఓఆర్‌ఆర్ పరిధి గ్రామాల్లో వందకే నల్లా కనెక్షన్

ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని గ్రామాల ప్రజలకు శుభవార్త. రూ.100కే నల్లా కనెక్షన్ మంజూరుచేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ రెండురోజుల కిందట ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. సంస్థ పరిధిలో దారిద్య్రరేఖకు దిగువనున్న (బీపీఎల్) కుటుంబాలకు ఇప్పటికే ఒక్క రూపాయి చెల్లి స్తే నల్లా కనెక్షన్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇతరులకు వంద రూపాయలకే నల్లా కనెక్షన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. ఇందులోభాగంగానే ఔటర్ లోపల ఉ న్న దాదాపు 190గ్రామాల పరిధిలోని ఒక్కో ఇంటికి 15 ఎంఎం కనెక్షన్‌ను మంజూరుచేయనున్నారు. సంస్థ ఇప్పటివరకు మూడు క్యాటగిరీల్లో నల్లా కనెక్షన్లు మంజూరుచేస్తున్నది. ఇందులో క్యాటగిరి-1 (ఇండివిజువల్ ఫ్యామిలీ- డొమెస్టిక్), క్యాటగిరి- 2 (మల్టీస్టోరీడ్ బిల్డింగ్/ఎంఎస్బీ), క్యాటగిరి- 3 (బల్క్ కనెక్షన్లు) మంజూరుచేస్తున్నది. ఇప్పటి వరకు డొమెస్టిక్ నల్లా కనెక్షన్ల మంజూరులో వినియోగదారులకు దాదాపు రూ.25 వే…

Read More

సిద్ధిపేటలో బావిలో పడ్డ కారు… వైజాగ్ వాసులకు తీవ్ర గాయాలు!

సిద్ధిపేట సమీపంలో అదుపుతప్పిన ఓ కారు రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోగా, విశాఖపట్నం ప్రాంతానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన నేటి తెల్లవారుజాము సమీపంలో జరిగింది. సిద్దిపేట రూరల్ మండలం గుర్రాలగొంది గ్రామ శివారు ప్రాంతంలో ఘటన జరుగగా, గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విశాఖ జిల్లాకు చెందిన కొందరు ఓ శుభకార్యం నిమిత్తం సిద్దిపేటకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. తాను వేగంగా నడుపుతున్న కారును డ్రైవర్ నియంత్రించలేక పోయాడని, దీంతో రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో అది పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.

Read More