299కే స్వచ్ఛ ఆక్సిజన్‌

న్యూఢిల్లీ: రూ.299 చెల్లించండి.. 15 నిమిషాలపాటు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ పీల్చుకోండి. విచిత్రంగా అనిపించి నా ఇది నిజం. ఢిల్లీలో వాయుకాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో ‘ఆక్సీ ప్యూర్‌ సంస్థ’ స్వచ్ఛమైన ప్రాణవాయువు అందిస్తామని ముందుకొచ్చింది. ఈ ఏడాది మే నెలలో ఢిల్లీలోని సాకేత్‌లో సిటీ వాక్‌ మాల్‌ లో ఓ ఆక్సిజన్‌ బార్‌ను ఏర్పాటుచేసింది. ఇందులో ఏడు ఫ్లేవర్లు కూడా ఉన్నాయి. స్పియర్‌మింట్‌, పిప్పర్‌మింట్‌, సిన్నామన్‌, ఆరంజ్‌ వంటి ఏడు సుగంధ ద్రవ్యాల సువాసనల్లో 15 నిమిషాలపాటు స్వచ్ఛమైన ప్రాణ వాయువును ఆస్వాదించవచ్చని సంస్థ చెప్తున్నది. ఇక్కడ ఒక వ్యక్తికి రోజులో ఒకసారి మాత్రమే ఆక్సిజన్‌ను సరఫరా చేస్తారు. ఆక్సిజన్‌ బార్లు మనకు కొత్తే అయినా.. చాలా దేశాల్లో ఇవి ఏండ్లుగా నడుస్తున్నాయి. స్వచ్ఛ ప్రాణవాయువును పీల్చడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందిదని నిర్వాహకులు చెప్తున్నారు.

Read More

మనిషి సమస్యలకు పరిష్కార మార్గాలను చూపుతున్న నిద్ర

సమస్యలకు పరిష్కారం దొరక్క సతమతమవుతున్నారా? అయితే, పరిష్కార మార్గాన్ని కనుక్కోవడం కోసం నిద్రపోవాలని చెబుతున్నారు పరిశోధకులు. మనుషులకు అప్పుడప్పుడు కొన్ని సమస్యలకు నిద్రలోనే పరిష్కారం లభిస్తోందని తేల్చారు. ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, బిజీ లైఫ్ లో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు నిద్ర ద్వారా చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. నిద్రిస్తున్న సమయంలో ఆలోచనలు, జ్ఞాపకాలు సంఘటితం కావడమే దీనికి కారణమని తేల్చారు. సమస్యలు ఎదురైనప్పుడు విన్న శబ్దాలను నిద్రలోనూ విన్నప్పుడు ఈ చర్య మరింత వేగవంతమవుతుందని పరిశోధకులు తెలిపారు. నిద్రిస్తున్న సమయంలో మన మెదడు మామూలు సమయాల్లో కంటే ప్రభావవంతంగా పనిచేస్తుందట. బెంజీన్‌ అణువు ఆకృతి ఎలా ఉంటుందన్న సమస్యకు ఎన్నో ఏళ్లుగా పరిష్కారం లభించలేదు. అయితే, దీనికి పరిష్కార మార్గాన్ని ఆగస్ట్‌ కెకూలే శాస్త్రవేత్తకు నిద్రలో లభించింది. తనకు వచ్చిన కల ఆధారంగానే బెంజీన్‌ నిర్మాణాన్ని ఆయన…

Read More

మనసు దోచుకున్న Swiggy డెలివరీ అమ్మాయి! S9Tv

అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని చెప్పడానికి జనని రావు మరో ఉదాహరణ. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలో జనని ఫీమేల్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తోంది. ఇతర ప్రదేశాల్లో అమ్మాయిలు ఫుడ్ డెలివరీ చేయడం మీరు చూసే ఉంటారు. కానీ మన తెలుగు ప్రాంతమైన హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తూ ఈ అమ్మాయి ఇతర ఆడపిల్లలకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది. అలాగని ఏదో బతుకు తెరువు కోసం జనని ఈ ఉద్యోగాన్ని ఎంచుకుంది అనుకుంటే మీరు పొరబడినట్లే. ఆమె ఉన్నత కుటుంబం నుంచే వచ్చింది. విల్లా మేరీ కాలేజ్‌లో సైకాలజీ, మాస్ కమ్యునికేషన్‌లో డిగ్రీ పూర్తి చేసింది. పై చదువులకు ఇంకా సమయం ఉండటంతో ఇలా కాస్త విభిన్నమైన పార్ట్ టైం జాబ్‌ను ఎంచుకుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వంటి ప్రదేశాల్లో ఫుడ్ డెలివరీ…

Read More

11వ అంతస్తు నుంచి దూకి టెకీ ఆత్మహత్య

techie suicide in Hyderabad suffering from illness

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని 11 అంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కలికిరి మండలానికి చెందిన శ్రావణి(28) కుటుంబ సభ్యులతో కలసి మదీనాగూడలో ఉంటోంది. ప్రైమ్‌ ఎరా మెడికల్‌ టెక్నాలజీస్‌ కంపెనీలో పనిచేస్తోంది. శ్రావణికి 18 నెలల క్రితం రామకృష్ణతో వివాహం కాగా, 4 నెలల క్రితం బాబుకు జన్మనిచ్చింది. అప్పటినుంచి ఆమెకు తలనొప్పి, సైనస్‌ ప్రాబ్లమ్‌ రావడంతో చాలా ఆస్పత్రులకు వెళ్లినా తగ్గలేదు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 9.30 గంటలకి ఉద్యోగానికి వెళుతున్నానని చెప్పి బయలుదేరిన శ్రావణి 10 గంటల సమయంలో ప్రైమ్‌ ఎరా కంపెనీ ఉన్న మిలాంజ్‌ టవర్స్‌ 11వ అంతస్తు ఎక్కి దూకింది. తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. అనారోగ్యం కారణంగానే…

Read More