బిగ్ బాస్-3 కంటెస్టెంట్స్ జాబితా… పోటీలో రేణు దేశాయ్, ఉదయభాను! బిగ్ బాస్ సీజన్-3కి ఏర్పాట్లు శరవేగంగా సగిపోతున్నాయి. ఇప్పటికే రెండు సీజన్లలో అలరించిన రియాల్టీ షో, ఇప్పుడు మూడోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనంటూ ఓ లీక్ బయటకు వచ్చింది. పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కంటెస్టెంట్ గా ఉండబోతున్నారని టాక్. ఇదే సమయంలో.. 1-టీవీ యాంకర్ ఉదయ భాను 2- యూ ట్యూబర్ జాహ్నవి దాసెట్టి 3- నటి శోభితా దూళిపాళ 4-గద్దె సింధూర 5- టీవీ నటుడు జాకీ తోట 6- నటులు వరుణ్ సందేశ్ 7- చైతన్య కృష్ణ 8- కమల్ కామరాజు 9-మనోజ్ నందం 10-డ్యాన్స్ మాస్టర్ రఘు 11-సింగర్ హేమచంద్ర 12-బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా కంటెస్టెంట్స్ గా…

Read More

మోదీ అంబులపొదిలో ఇదే చివరి బాణం: హార్దిక్ పటేల్

modi-హార్దిక్ పటేల్

అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పటీదార్ రిజర్వేషన్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ స్పందించారు. మోదీ ‘తూణీరంలో చివరిబాణం’ ఇదేనని అన్నారు. ఇది ప్రజలకు ఇచ్చిన ‘లాలీపాల్’ అయితే అది తప్పే అవుతుందన్నారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చడంలో విఫలమైన పక్షంలో ప్రజలే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కేంద్రం తీసుకున్న కోటా నిర్ణయానికి రాజ్యాంగ సవరణ కీలకమని, ఆ దిశగా అడుగు పడాల్సి ఉంటుందని హార్దిక్ పటేల్ అన్నారు. కాగా, అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్‌కు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణాల వారికి ఈ కోటా వర్తిస్తుంది. ఎన్నికల సంవత్సరం కావడం, సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న…

Read More

APPSC Recruitment Notification: ఏపీలో కొలువుల జాతర.. త్వరలో మరో 14 నోటిఫికేషన్లు

APPSC Recruitment Notification-s9Tv

ఆంధ్రప్రదేశ్‌లో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే 21 నోటిఫికేషన్ల ద్వారా 3,225 పోస్టుల్ని భర్తీ చేస్తున్న ఏపీపీఎస్సీ.. తాజాగా మరికొన్ని నోటిఫికేషన్లకు సిద్ధమవుతోంది. ఈ నెలాఖరు లోపు 1500 ఉద్యోగాల భర్తీకి 14 నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్. నోటిఫికేషన్లలోనే స్క్రీనింగ్‌ టెస్ట్‌, మెయిన్స్‌ పరీక్ష షెడ్యూల్‌తో పాటు ఖాళీల వివరాలను భిన్నంగా క్యారీ ఫార్వర్డ్‌ పోస్టుల వివరాలతో సహా పొందుపరిచామన్నారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందన్నారు ఉదయ్ భాస్కర్. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఈ నెల 19 వరకు దరఖాస్తులకు గడువు ఉందని.. ఆ పోస్టులకు మొత్తం 56,621 దరఖాస్తులు వచ్చాయన్నారు. పోస్టులకు చివరి నిమిషంలో దరఖాస్తులు చేయడం వల్ల సర్వర్‌లో సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయని.. అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.…

Read More

టెక్‌, ఈ-కామర్స్‌ సంస్థల ఉద్యోగ మేళా : 40 వేల ఉద్యోగాల భర్తీకి నిర్ణయం

టెక్నాజీ స్టార్టప్‌ కంపెనీలు, ఈ-కామర్స్‌ దిగ్గజాలు కొత్త ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్నాయి. వ్యాపార విస్తరణలో భాగంగా సరికొత్త పెట్టుబడులకు సిద్ధమవుతున్న సంస్థలు ఉద్యోగుల సంఖ్యను 30 శాతం వరకు పెంచాలని నిర్ణయించాయి. ఉద్యోగార్థులకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశం. హెల్తియన్స్‌, మిల్క్‌ బాస్కెట్‌, కార్స్‌ 24, ఇస్టామోజో, మో ఎంగేజ్‌ వంటి సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించాయని సమాచారం. 2018లో ఉద్యోగ కల్పనలో 55 శాతం వృద్ధి నమోదు చేశాయి. పెరుగుతున్న అవసరాల రీత్యా ప్రస్తుతం చాలా సంస్థలు సొంత టెక్నాలజీ బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ విషయంలో ఆహార సరఫరా, ఈ కామర్స్‌ వంటి సంస్థలు ముందున్నాయి. మార్కెట్లో పట్టుపెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న జొమాటో, ఓయో, స్విగ్గీ వంటి సంస్థలు ఉద్యోగుల సంఖ్యను 30 శాతం పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయని సమాచారం.

Read More