చంద్రబాబు, పవన్ కలిశారు!

ఎన్నికల్లో ఒకరిపై మరొకరు కత్తులు దూసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి ఎన్నికల అనంతరం కలిశారు. ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని సరదాగా మాట్లాడుకున్నారు. వీరిద్దరి కలయికకు రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మనవరాలి వివాహం వేదికైంది. నేడు రామోజీరావు మనవరాలు కీర్తి సుహానా, నవయుగ గ్రూప్స్ చైర్మన్ సి. విశ్వేశ్వరరావు మనవడు వినయ్‌తో నేడు వైభవంగా జరిగింది. ఈ వివాహానికి చంద్రబాబు, పవన్ ఇద్దరూ హాజరయ్యారు. ఇద్దరూ కలుసుకుని సరదాగా మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

Read More

అలుపెరుగని శ్రామికుడు..70 ఏళ్ల యువకుడు..

ముందు చూపు అనే పదానికి ఆయన పర్యాయపదం. పాలన దక్షతకు ప్రతిరూపం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన నేర్పరితనం. సంస్కరణల అమల్లో దూకుడు. సంక్షోభాలనే అవకాశాలుగా మలుచుకునే యోధుడు. పాలనకు సాంకేతికతను జోడించిన స్వాప్నికుడు.  ఎదుటివారు ఆలోచించే లోపే ఆచరణలో పెట్టే కార్యదక్షుడు. ఏడు పదుల వయసులోనూ నేటి తరానికి సవాలు విసిరే సాహసికుడు. పట్టువదలని విక్రమార్కుడు ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు. 

Read More

ప్రతి గింజకు మద్దతు ధర

రాష్ట్రంలో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా నీటిపారుదలరంగాన్ని అభివృద్ధిపరుస్తున్నామని, ఫలితంగా రాబోయే రోజుల్లో పంటల దిగుబడులు భారీగా పెరుగుతాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. అందుకు తగినట్లుగా రైతులకు కనీస మద్దతు ధర కల్పించేలా అవసరమైన వ్యూహం ఖరారుచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గింజకు మద్దతు ధర.. లాభసాటి సాగు మన లక్ష్యమని చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించే వ్యూహాన్ని రూపొందించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్‌, పౌరసరఫరాలు తదితర శాఖలన్నీ సమన్వయంతో వ్యవహరించి , రైతులకు కనీస మద్దతు ధర కల్పించి, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. దీనికోసం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల ఆహార అవసరాలేమిటి? ఏది ఎంత…

Read More

ప్రచారంలో దూసుకుపోతున్న ప్రకాశ్ రాజ్

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన పోరాటం ఏ ఒక్క వ్యక్తిపై కాదని చెప్పారు. ప్రజల కోసమే తాను పోరాడుతున్నానని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో సరైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడే ప్రజలు గెలిచినట్టని అన్నారు. సరైన వ్యక్తిని ఎన్నుకోకపోతే… ఆ ఓటమి ప్రజలదేనని చెప్పారు. కుల, మతాలకు అతీతంగా, ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వేయాలని విన్నవించారు.

Read More

నైరుతిలో మంచి వానలు

దేశ వ్యాప్తంగా ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు కానుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాలు సకాలంలోనే ప్రవేశిస్తాయని శుభవార్త చెప్పింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు 96శాతం వర్షపాతం నమోదు కానుందని తెలిపింది. ప్రస్తుతం పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్న ఎల్‌నినో నైరుతి సీజన్‌ రెండో భాగానికి మరింత బలహీనపడుతుందని అంచనా వేసింది. బలహీన ఎల్‌నినో పరిస్థితులు ఈ వేసవి అంతా కొనసాగనున్నాయని, దీంతో ఆసియా పసిఫిక్‌ దేశాల్లో తక్కువ వర్షపాతం కురుస్తుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. ఐఎండీ మాత్రం ఆ ప్రభావం భారత్‌పై ఉండదని తేల్చిచెప్పింది. వేసవి తర్వాత ఎల్‌నినో బలహీనపడుతుందని స్పష్టం చేసింది. గతేడాది మంచి వర్షాలు కురుస్తాయన్న అంచనాకు భిన్నంగా 91శాతం వర్షపాతమే నమోదైంది. ముఖ్యంగా దక్షిణాదిలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈసారి దేశంలో సాధారణ వర్షాలు…

Read More