బిస్కెట్ తింటే కారొచ్చింది..!

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 సందర్భంగా ‘పార్లేజీ కావో, క్రోర్స్ ఇనాం పావో’ పేరిట జూన్ నెలలో పార్లేజీ సంస్థ ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. కొన్ని బిస్కెట్ ప్యాకెట్లలో వోచర్లను ఉంచి వాటిని దేశ వ్యాప్తంగా పంపిణీ చేసింది. నగరానికి చెందిన జంగపల్లి నాగరాజుకు రెనాల్డ్ ట్రైబర్ కారు వోచర్ అతని బిస్కెట్ ప్యాకెట్‌లో వచ్చింది. ఈ సందర్బంగా మంగళవారం బేగంపేటలోని రెనాల్డ్ షోరూంలో పార్లేజీ ప్రతినిధులు కారును బహుకరించారు. పార్లేజీ ప్రాడక్ట్స్ ప్రతినిధి మయాంక్ షా మాట్లాడుతూ తమ బిస్కెట్లను ఎంతగానో ఇష్టపడే వినియోగదారునితో ఇలా కలవడం ఆనందంగా ఉందన్నారు. బహుమతిని అందుకున్న జంగపల్లి నాగరాజు మాట్లాడుతూ తన జీవితంలో ఇది అత్యంత గొప్ప రోజు అని ఈ విషయాన్ని తెలుసుకున్న తనకు ఆశ్చర్యం వేసిందన్నారు. తాను కొన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్లో ఇంత…

Read More

తిరుమల వెంకన్నను దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్‌ నుంచి నేరుగా తిరుపతి చేరుకున్న గవర్నర్‌కు టీటీడీ ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం తొలుత వరాహస్వామిని దర్శించుకున్న తమిళిసై అనంతరం వీఐపీల సేవా సమయంలో స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆమెకు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికారు. అనంతరం ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈఓ ఎ.వి.ధర్మారెడ్డిలు గవర్నర్‌కు తీర్థప్రసాదాలు అందజేసి, స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. దర్శనానంతరం ఆలయం వెలుపల గవర్నర్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాను శ్రీవారి భక్తురాలినని, స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తిరుమలలో వసతి సదుపాయాలు, నిర్వహణ బాగున్నాయని కితాబునిచ్చారు.

Read More

రేవంత్ రెడ్డి పై నాన్ బెయిలబుల్ కేసు పెట్టిన హైదరాబాద్ పోలీసులు!

రెండు రోజుల క్రితం జరిగిన విపక్షాల ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో, పోలీసుల కళ్లుగప్పి బైక్ పై వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై పోలీసులు నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, ఆయన్ని తోసివేశారన్న అభియోగాలతో జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది. కాగా, సోమవారం నాడు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన వేళ, తనను అడ్డుకున్న ఎస్ఐ నవీన్ రెడ్డిని రేవంత్ పక్కకు తోసేశారు. ఈ ఘటనలో నవీన్ రెడ్డికి గాయాలు అయ్యాయి. దీంతో ఆయన ఫిర్యాదు చేశారు. రేవంత్ పై ఐపీసీలోని సెక్షన్ 341, 332, 353ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.…

Read More

మున్సిపల్ ఎన్నికలకు పచ్చ జెండా.. ఏ క్షణమైనా నోటిఫికేషన్

రాష్ట్రంలో ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం రిజర్వేషన్లు ఖరారు చేసింది. రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు 800 మంది ఓటర్ల ఉన్నారు. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, బడంగ్‌పేట్, నిజాంపేట్, బండ్లగూడ, మీర్‌పేట్, జవహర్ నగర్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపాలిటీల కాలపరిమితి ఇంకా ముగియలేదు. పాల్వంచ, మందమర్రి, మణుగూరులో సాంకేతిక కారణాలతో ఎన్నికలు నిర్వహించటం లేదు. జడ్జర్ల, నకిరేకల్‌లో గ్రామాల విలీన ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఖమ్మం, హైదరాబాద్, వరంగల్ కార్పొరేషన్లకు కాలపరిమితి ఇంకా ముగియలేదు.

Read More

బిగ్ బ్రేకింగ్: ఏషియన్ సినిమాస్ సంస్థ ఆఫీసులపై ఐటీ దాడులు

ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమా కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఏషియన్ సినిమా అధినేతలు నారాయణదాస్, సునీల్ నారంగ్‌ల ఇళ్లతో పాటు వారి సన్నిహితుల నివాసాలలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్ నగరంలోని ఎ.ఎమ్.బి మాల్‌ను హీరో మహేష్ బాబుతో కలిసి ఏషియన్ సినిమా సంస్థ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. త్వరలో మరో అగ్ర హీరో అల్లు అర్జున్‌తో కలిసి మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమైంది ఈ సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థ నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న సినిమాను నిర్మిస్తోంది. అంతేకాదు.. నైజాంలో భారీ చిత్రాలను పంపిణీ చేయటంతో పాటు ఏషియన్ సినిమాస్ పేరిట చాలా థియేటర్లు ఉన్నాయి.

Read More